Gold Rate Today: పసిడి ప్రియులకు బంగారం ధరల తగ్గుదల ఒక్కరోజు మురిపంగానే మారిపోయింది. మంగళవారం నాడు కాస్త దిగొచ్చిన బంగారం ధరలు.. మళ్లీ కొండెక్కి కూర్చున్నాయి. తగ్గేదేలే అంటూ వాయు వేగంతో పరుగులు పెడుతోంది. తాజాగా బంగారం ధరలు 22 క్యారెట్ల తులం బంగారం ధరకు రూ.950 పెరిగి ఏకంగా రూ. 88,150 ఉండగా.. 24 క్యారెట్ల తులం బంగారం ధరకు రూ.990 పెరిగి రూ.96,170 ఉంది. ప్రధాన నగరాల్లో గోల్డ్ రేట్స్ ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం.
రెండున్నర దశాబ్దాల్లో బంగారం ధర రూ.90 వేలు దాటేసింది. మే నెల వచ్చేసరికి తులం పసిడి ధర రూ. లక్ష దాటుతుందా..? ఆర్ధిక మాంద్యం భయాలతో జనం బంగారం ధరలపై పెట్టుబడి పెడుతున్నారు. రియలస్టేట్‌కు కాస్త ఊపు తగ్గడంతో.. బంగారానికి కలిసొచ్చిందనే చెప్పాలి. ఏరోజు ఎంత పెరుగుతుందో.. అంచనా వేసే ఛాన్స్ లేకుండా పోతుంది. తగ్గినట్టే తగ్గి అంతలోనే ఊహించని విధంగా పెరిగిపోతుంది.
ధమ్ముంటే కొనండి అంటూ సవాళ్లు విసురుతోంది. మధ్య మధ్యలో తగ్గుతూ ఊరిస్తోంది. ఇలా పసిడి ధరల్లో నిత్యం మార్పులు రావడానికి ప్రధాన కారణం.. ప్రపంచ ధరల్లో మార్పులు, కేంద్ర బ్యాంకుల్లో బంగారం నిల్వ, హెచ్చు తగ్గుల వడ్డీ రేట్లు, స్టాక్ మార్కెట్ల ప్రభావం, ద్రవ్యోల్బణం, అంతర్జాతీయంగా నెలకొన్న మార్పులు, రష్యా ఉక్రెయిన్ యుద్ధాలు వంటి ఇతర కారణాలు కావచ్చు.
బంగారం ధరలు ఇలా
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.88,150కి చేరుకుంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.96,170 వద్ద కొనసాగుతోంది.
విజయవాడలో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.88,150 ఉండగా.. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.96,170 వద్ద ట్రేడింగ్‌లో ఉంది.
వైజాగ్‌లో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.88,150 వద్ద కొనసాగుతోంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.96,170 ఉంది.
రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.88,300 ఉంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.96, 320 వద్ద కొనసాగుతోంది.
చెన్నైలో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.88,150 కి చేరుకుంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.96,170 వద్ద కొనసాగుతోంది.
ముంబై, కేరళ, కోల్ కత్తాలో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.88,150 వద్ద కొనసాగుతోంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.96,170 వద్ద ట్రేడింగ్‌లో ఉంది.
Also Read: స్టాక్ మార్కెట్లో బుల్ షో స్టార్ట్.. 1750 పాయింట్లకు పైగా ఎగిసిన సెన్సెక్స్
వెండి ధరలు ఇలా..
బంగారం ధరలు మాదిరిగా.. వెండి ధరలు కూడా దూసుకుపోతున్నాయి. ఈరోజు వెండి ధరలు చూస్తే.. చెన్నై, హైదరాబాద్, కేరళ, వైజాగ్ లో కిలో వెండి ధర రూ.1,10,000 కి చేరుకుంది.
ముంబై, కోల్ కత్తా, బెంగళూరు, ఢిల్లీలో కిలో వెండి ధర రూ.1,00,000 వద్ద కొనసాగుతోంది.