CSK Fans On Ruturaj: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ లో ( Indian Premier League 2026 Tournament) చెన్నై సూపర్ కింగ్స్ జట్టు వరుసగా విఫలమవుతూనే ఉంది. ఇప్పటికే తొలి మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ చేతిలో చిత్తుగా ఓడిపోయిన చెన్నై సూపర్ కింగ్స్, నిన్న పంజాబ్ కింగ్స్ చేతిలో కూడా మరో ఓటమి చవి చూసింది. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులు తీవ్ర నిరాశ చెందుతున్నారు. మహేంద్ర సింగ్ ధోని మళ్లీ కెప్టెన్సీ బాధ్యతలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు ప్రస్తుత చెన్నై సూపర్ కింగ్స్ ( CSK) కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ను ( RUTURAJ GAIKWAD) ఉద్దేశించి వివాదాస్పద పోస్టులు చేస్తున్నారు. అతని చెత్త కెప్టెన్సీ వల్ల చెన్నై ఓడిపోయిందని మండిపడుతున్నారు. మళ్లీ కెప్టెన్ గా బరిలోకి దిగితే నీ పెళ్ళాన్ని రే**ప్ చేస్తామంటూ వార్నింగ్ ఇస్తున్నారు ఫ్యాన్స్ ( CSK Fans). దీనికి సంబంధించిన పోస్టులు వైరల్ అవుతున్నాయి.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament) నేపథ్యంలో అద్భుతంగా రాణిస్తుంది అనుకున్న చెన్నై సూపర్ కింగ్స్ జట్టు.. గత సీజన్ లాగానే తయారయింది. 2025 టోర్నమెంట్ సందర్భంగా సీనియర్ ప్లేయర్లు ఉన్నప్పటికీ కూడా ఓడిపోయింది చెన్నై. అయితే ఇప్పుడు కొత్త రక్తంతో బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్.. అయినప్పటికీ వరుసగా రెండు ఓటములను చవిచూసింది. రాజస్థాన్ ( Rajastan) చేతిలో చిత్తుగా ఓడిపోయిన చెన్నై సూపర్ కింగ్స్… నిన్న పంజాబ్ కింగ్స్ చేతిలో మాత్రం పోరాడి ఓడింది. బ్యాటింగ్ లో పర్వాలేదనిపించిన చెన్నై… బౌలింగ్ లో మాత్రం తేలిపోయింది. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ వైఫల్యం వరస ఓటములు చోటు చేసుకుంటున్నాయని విమర్శలు చేస్తున్నారు క్రికెట్ అభిమానులు.
చెన్నై సూపర్ కింగ్స్ జట్టు (CSK) వరుసగా ఓటములను చవిచూస్తున్న నేపథ్యంలో కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ పైన దారుణంగా విమర్శలు చేస్తున్నారు చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులు. ఇంకోసారి కెప్టెన్ గా కనిపిస్తే, నీ భార్యని రే**ప్ చేస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు. ఈ మేరకు రుతురాజ్ ఇన్ స్టాగ్రామ్ లో దారుణంగా పోస్టులు పెడుతున్నారు. అయితే చెన్నై సూపర్ కింగ్స్ అభిమానుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చిన నేపథ్యంలో.. తన కామెంట్స్ బాక్సును ఇంస్టాగ్రామ్ లో ( RUTURAJ GAIKWAD Instagramme) బ్లాక్ చేశాడు రుతురాజ్. దీంతో ఈ న్యూస్ వైరల్ గా మారింది. ఇక ఫ్యాన్స్ నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చిన నేపథ్యంలో కెప్టెన్ గా రాజీనామా చేయాలని రుతురాజ్ డిసైడ్ అయ్యాడని అంటున్నారు.
https://www.instagram.com/ruutu.131?utm_source=ig_web_button_share_sheet&igsh=ZDNlZDc0MzIxNw==