E-Paper
Advertisement

IND VS SA 2nd Test: టాస్ మరోసారి ఓడిపోయిన టీమ్ ఇండియా.. ఇద్దరు కొత్త ప్లేయర్లు ఎంట్రీ, లంచ్ బ్రేక్ లో మార్పులు

IND VS SA 2nd Test: టాస్ మరోసారి ఓడిపోయిన టీమ్ ఇండియా.. ఇద్దరు కొత్త ప్లేయర్లు ఎంట్రీ, లంచ్ బ్రేక్ లో మార్పులు
Advertisement

 IND VS SA 2nd Test: టీం ఇండియా వర్సెస్ దక్షిణాఫ్రికా ( India vs South Africa, 2nd Test ) మధ్య మరికాసేపట్లోనే రెండవ టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కాబోతుంది. ఇప్పటికే ఈ రెండు జట్ల మధ్య తొలి టెస్ట్ పూర్తి కాగా, నేటి నుంచి ఐదు రోజుల పాటు మ్యాచ్ జరగనుంది. గౌహతి వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ కు సంబంధించిన టాస్ ప్రక్రియ కొద్దిసేపటి క్రితమే ముగిసింది. గౌహతి బర్సపారా క్రికెట్ స్టేడియం ( Barsapara Cricket Stadium, Guwahati) లో వాతావరణ పరిస్థితులు నేపథ్యంలో 8:30 గంటలకు టాస్ వేశారు. ఇక ఇందులో టాస్ నెగ్గిన దక్షిణాఫ్రికా మొదట బ్యాటింగ్ చేసేందుకు నిర్ణయం తీసుకుంది. అటు మరోసారి టాస్ ఓడిపోయిన టీమిండియా మొదట బౌలింగ్ చేయనుంది. గౌహతి వేదికగా మొదట బ్యాటింగ్ చేసిన జట్టుకు అడ్వాంటేజ్ ఉండనుంది.

Also Read: 2025–26 Ashes series: ఇవాళ్టి నుంచే ‘యాషెస్’ సమరం.. టాస్ గెలిచిన ఇంగ్లాండ్, టైమింగ్స్‌, ఉచితంగా ఎలా చూడాలంటే !

రెండో టెస్టు లంచ్, టీ బ్రేక్ లో మార్పులు

టీమిండియా వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య గౌహతి వేదికగా జరగనున్న రెండో టెస్టు నేపథ్యంలో కీలక మార్పులు చోటు చేసుకోనున్నాయి. టీమిండియా కెప్టెన్ గిల్ మెడనొప్పి కారణంగా రెండో టెస్టుకు దూరమయ్యాడు. దీంతో అతని స్థానంలో రిషబ్ పంత్ కెప్టెన్ గా వ్యవహరించబోతున్నాడు. అలాగే గిల్ స్థానంలో తుది జట్టులోకి సాయి సుదర్శన్ వస్తాడని తాత్కాలిక కెప్టెన్ పంత్ వెల్లడించారు. అక్షర్ పటేల్ స్థానంలో నితీష్ కుమార్ రెడ్డిని బరిలోకి దింపబోతున్నారు. ఇక మ్యాచ్ టైమింగ్స్ లో మార్పులు ఒకసారి పరిశీలిస్తే, ఉదయం 9 గంటలకు అంటే 30 నిమిషాలు ముందుగానే మ్యాచ్ ప్రారంభం కానుంది. ఉదయం 11 గంటలకు టీ బ్రేక్ ఇవ్వనున్నారు. అయితే లంచ్ బ్రేక్ మాత్రం మధ్యాహ్నం ఉంటుంది. మధ్యాహ్నం 1:20 గంటల నుంచి 2 గంటల వరకు లంచ్ బ్రేక్ ఉండనుంది. సాయంత్రం 4 గంటలకే మ్యాచ్ ఫినిష్ అవుతుంది. అంటే దాదాపు గంట ముందే మ్యాచ్ క్లోజ్ చేస్తారు. చలికాలం కాబట్టి గౌహతిలో త్వరగా సూర్యుడు రావడమే కాకుండా తొందరగా వెళ్ళిపోతాడు. అందుకే ఈ ఒక్క టెస్ట్ మ్యాచ్ లో లంచ్ , టీ బ్రేక్ ల‌లో మార్పులు చోటు చేసుకున్నాయి. ఇక ఈ మ్యాచ్ లో టీమిండియా గెలిస్తే, 1-1 తేడాతో సిరీస్ స‌మం కానుంది. ఒక వేళ టీమిండియా ఓడినా, మ్యాచ్ డ్రా అయినా ద‌క్షిణాఫ్రికా టెస్ట్ సిరీస్ గెల‌వ‌నుంది.

Advertisement

 

దక్షిణాఫ్రికా వర్సెస్ టీమ్ ఇండియా జట్లు 

Advertisement

 

దక్షిణాఫ్రికా (ప్లేయింగ్ XI): ఐడెన్ మార్క్రామ్, ర్యాన్ రికెల్టన్, వియాన్ ముల్డర్, టెంబా బావుమా(సి), టోనీ డి జోర్జి, ట్రిస్టన్ స్టబ్స్, కైల్ వెర్రెయిన్నే(w), మార్కో జాన్సెన్, సెనురన్ ముత్తుసామి, సైమన్ హార్మర్, కేశవ్ మహారాజ్

 

భారత్ (ప్లేయింగ్ XI): KL రాహుల్, యశస్వి జైస్వాల్, సాయి సుదర్శన్, ధ్రువ్ జురెల్, రిషబ్ పంత్(w/c), రవీంద్ర జడేజా, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్

 

Also Read: Asia Cup Rising Stars 2025: టీమిండియా వ‌ర్సెస్ బంగ్లా మ‌ధ్య సెమీస్‌..పాకిస్తాన్ మ్యాచ్ కూడా, టైమింగ్స్‌, ఉచితంగా ఎలా చూడాలంటే

 

 

 

Related News

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 ఫైన‌ల్ మ్యాచ్ టైమింగ్స్ ఇవే..ఇండియాలో లైవ్ ఎప్పుడంటే ?

రెండు మ్యాచ్ ల‌కే గాయ‌ప‌డ్డ బుమ్రాతో వ‌ర‌ల్డ్ క‌ప్ గెలుస్తారా? గ‌వాస్క‌ర్ సీరియ‌స్‌

2027 వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్..త‌న డ్రీమ్ టీమిండియాను ప్ర‌క‌టించిన ర‌విశాస్త్రి

శ్రీలంక‌లో షాహీన్ అఫ్రిదికి ఘోర అవ‌మానం…ప్రీమియ‌ర్ బౌల‌ర్ కాస్త..మీడియం అయ్యాడు

టీమిండియా చాలా వీక్ గా ఉంది..పాకిస్తాన్ మ‌హిళ‌ల చేతిలో కూడా ఓడిపోవ‌డం ఖాయం!

రోహిత్ శ‌ర్మ‌ కూడా స్లాగ‌రే..గుడ్డిగా బ్యాట్ ఊపితే, వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వ‌లేరు

గంభీర్ ను వెధ‌వ‌ను చేసేందుకు రోహిత్ శ‌ర్మ PR స్టంట్..రిటైర్మెంట్, బొక్కా లేదు

దక్షిణాఫ్రికాలో వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వాలంటే, రోహిత్ శ‌ర్మ ఉండాల్సిందే

Big Stories

Advertisement
×