E-Paper
Advertisement

2025–26 Ashes series: ఇవాళ్టి నుంచే ‘యాషెస్’ సమరం.. టాస్ గెలిచిన ఇంగ్లాండ్, టైమింగ్స్‌, ఉచితంగా ఎలా చూడాలంటే !

2025–26 Ashes series: ఇవాళ్టి నుంచే ‘యాషెస్’ సమరం.. టాస్ గెలిచిన ఇంగ్లాండ్,  టైమింగ్స్‌, ఉచితంగా ఎలా చూడాలంటే !
Advertisement

2025–26 Ashes series: ఆస్ట్రేలియా వర్సెస్ ఇంగ్లాండ్ ( Australia vs England) మధ్య ఎంతో ప్రతిష్టాత్మకంగా జరగనున్న ‘యాషెస్’ సిరీస్ కు సర్వం సిద్ధమైంది. ఇవాళ్టి నుంచి బూడిద కోసం రెండు జట్లు తలపడనున్నాయి. దాదాపు 143 సంవత్సరాల నుంచి ఈ ‘యాషెస్’ సిరీస్ (2025–26 Ashes series ) కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి జరగనున్న ఈ ‘యాషెస్’ టోర్నమెంట్.. నేటి నుంచి ప్రారంభం కానుంది.

Also Read: Hardik Pandya engaged: సీక్రెట్ గా బాలీవుడ్ న‌టితో హార్దిక్ పాండ్యా ఎంగేజ్‌మెంట్..కోట్లు విలువ చేసే రింగ్ తొడిగి మ‌రీ ! 

ఇవాళ్టి నుంచే ‘యాషెస్’ సమరం

Advertisement

ఇవాళ ఆస్ట్రేలియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య తొలి టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కాబోతోంది. ‘యాషెస్’ సిరీస్ 2025 టోర్నమెంట్ లో భాగంగా ఆస్ట్రేలియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య ఇవాళ ఉదయం 7.50 గంటలకు వేదికగా తొలి మ్యాచ్ ప్రారంభం అవుతుంది. ఈ మ్యాచ్ లో టాస్ నెగ్గిన ఇంగ్లాండ్ మొదట బ్యాటింగ్ చేయాలని నిర్ణయం తీసుకుంది. దీంతో మొదట ఆస్ట్రేలియా బౌలింగ్ చేయనుంది. ‘యాషెస్’ సిరీస్ 2025 టోర్నమెంట్ కు సంబంధించిన మ్యాచ్‌లు అన్ని కూడా జియో హాట్ స్టార్ లో ( Jio Hot star) ఉచితంగానే చూడ‌వ‌చ్చును.  2010 సంవత్సరం తర్వాత ఆస్ట్రేలియాతో ఇంగ్లాండ్ ఒక్క సిరీస్ కూడా గెలవలేకపోయింది. వరుసగా గడిచిన మూడు సిరీస్ లలో కంగారులు విజయం సాధించారు. అంటే ఈ టోర్నమెంట్లో ఆస్ట్రేలియాదే పై చేయి అన్న మాట.

143 ఏళ్లుగా బూడిద కోసం పోరు

క్రికెట్ లో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ( IND VS PAK) పోరు తర్వాత అదే స్థాయిలో ఈ ‘యాషెస్’ సిరీస్ కూడా జరగనుంది. 1982లో ది ఓవల్ వేదికగా ఇంగ్లాండ్ జట్టు పైన ఆస్ట్రేలియా విజయం సాధించింది. ఈ టెస్ట్ లో ఇంగ్లాండ్ ఓడిపోయిన తరుణంలో బ్రిటిష్ వార్తాపత్రిక ది స్పోర్టింగ్ టైమ్స్ లో అనేక కథనాలు వెలువడ్డాయి. ఇంగ్లాండ్ క్రికెట్ చచ్చిపోయింది అని కూడా హెడ్ లైన్ రాశారు. ఇంగ్లాండ్ బూడిదను ఆస్ట్రేలియా తీసుకువెళ్లిందని తెలుపుతూ ఆర్టికల్ రాశారు. దీంతో అప్పటి కెప్టెన్ ఐఓ బ్లైగ్ సంచలన ప్ర‌క‌ట‌న‌ చేశాడు. ఆస్ట్రేలియా తీసుకువెళ్లిన ఆ బూడిదను మళ్లీ ఇంగ్లాండ్ ను తీసుకువస్తానని పేర్కొన్నాడు. దీంతో అప్పటి నుంచి ఈ ఆస్ట్రేలియా వర్సెస్ ఇంగ్లాండ్ ( Australia vs England) జ‌ట్ల మ‌ధ్య ‘యాషెస్’ అంటే బూడిద సిరీస్ జ‌రుగుతోంది. ఆ బూడిద కోసం 143 ఏళ్లుగా రెండు జ‌ట్లు త‌ట్టుకుంటున్నాయి.

ఇంగ్లాండ్ వ‌ర్సెస్ ఆస్ట్రేలియా జ‌ట్లు ఇవే

Advertisement

ఆస్ట్రేలియా ప్లేయింగ్ XI: ఉస్మాన్ ఖవాజా, జేక్ వెదరాల్డ్, మార్నస్ లాబుస్చాగ్నే, స్టీవ్ స్మిత్ (కెప్టెన్), ట్రావిస్ హెడ్, కామెరాన్ గ్రీన్, అలెక్స్ కారీ (వికెట్ కీపర్), మిచెల్ స్టార్క్, స్కాట్ బోలాండ్, నాథన్ లియాన్, బ్రెండన్ డాగెట్

ఇంగ్లాండ్ ప్రాబబుల్ XI: జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఓల్లీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్ (సిపెన్), జామీ స్మిత్ (వికెట్ కీపర్), గస్ అట్కిన్సన్, బ్రైడాన్ కార్స్/షోయబ్ బషీర్, మార్క్ వుడ్, జోఫ్రా ఆర్చర్

Also Read: Asia Cup Rising Stars 2025: టీమిండియా వ‌ర్సెస్ బంగ్లా మ‌ధ్య సెమీస్‌..పాకిస్తాన్ మ్యాచ్ కూడా, టైమింగ్స్‌, ఉచితంగా ఎలా చూడాలంటే

 

Related News

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 ఫైన‌ల్ మ్యాచ్ టైమింగ్స్ ఇవే..ఇండియాలో లైవ్ ఎప్పుడంటే ?

రెండు మ్యాచ్ ల‌కే గాయ‌ప‌డ్డ బుమ్రాతో వ‌ర‌ల్డ్ క‌ప్ గెలుస్తారా? గ‌వాస్క‌ర్ సీరియ‌స్‌

2027 వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్..త‌న డ్రీమ్ టీమిండియాను ప్ర‌క‌టించిన ర‌విశాస్త్రి

శ్రీలంక‌లో షాహీన్ అఫ్రిదికి ఘోర అవ‌మానం…ప్రీమియ‌ర్ బౌల‌ర్ కాస్త..మీడియం అయ్యాడు

టీమిండియా చాలా వీక్ గా ఉంది..పాకిస్తాన్ మ‌హిళ‌ల చేతిలో కూడా ఓడిపోవ‌డం ఖాయం!

రోహిత్ శ‌ర్మ‌ కూడా స్లాగ‌రే..గుడ్డిగా బ్యాట్ ఊపితే, వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వ‌లేరు

గంభీర్ ను వెధ‌వ‌ను చేసేందుకు రోహిత్ శ‌ర్మ PR స్టంట్..రిటైర్మెంట్, బొక్కా లేదు

దక్షిణాఫ్రికాలో వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వాలంటే, రోహిత్ శ‌ర్మ ఉండాల్సిందే

Big Stories

Advertisement
×