Sam Billings : ఇంగ్లాండ్ క్రికెటర్ సామ్ బిల్లింగ్స్ (Sam Billings) గురించి దాదాపు అందరికీ తెలిసే ఉంటుంది. ఇతని గురించి సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఇతను తన స్నేహితురాలు సారా కాంట్లెను 2018లో పెళ్లి చేసుకున్నట్టు కొన్ని ఓల్డ్ పేస్ బుక్ పోస్టులు కనిపిస్తున్నాయి. అలాగే 2021లో తన స్నేహితురాలు సారా కాంట్లేతో నిశ్చితార్థం చేసుకున్నారు. అతను తన చిన్ననాటి స్నేహితురాలు, టెన్నిస్ క్రీడాకారిణి అయిన సారా కాంట్లే (Sarah Cantlay) ను వివాహం చేసుకున్నాడు. 2024 మార్చిలో వారికి ఐవీ ఫే బిల్లింగ్స్ అనే పాప జన్మించింది. సామ్ బిల్లింగ్స్, అతని భార్య సారా కలిసి ఉన్న చిత్రాలను వారి సోషల్ మీడియా ఖాతాలలో పంచుకున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో అవి వైరల్ గా మారాయి.
Also Read : WTC 2025-2027: పీకల్లోతూ కష్టాల్లో టీమిండియా.. ప్రతి టెస్టు గెలిస్తేనే, WTC ఛాన్స్..పాయింట్ల పట్టిక ఇదే
మరోవైపు 2021లో ఎంగేజ్ మెంట్ చేసుకున్న సామ్ బిల్లింగ్స్.. ఆ సీజన్ ఐపీఎల్ వేలంలో అన్ సోల్డ్ ప్లేయర్ గా నిలిచాడు. దీంతో అతని ప్రియురాలు బాగా తిట్టిందట. నువ్వు వికెట్ కీపర్ కాబట్టి అన్ సోల్డ్ అయ్యావ్.. అదే బౌలర్ అయి ఉంటే బాగుండని కీలక సూచనలు కూడా చేసిందట సారా కాంట్లె. సామ్ బిల్లింగ్స్ ఐపీఎల్ లో కోల్ కతా నైట్ రైడర్స్, చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లకు ప్రాతినిధ్యం వహించాడు.
2016 ఐపీఎల్ లోకి ఆరంగేట్రం చేశాడు. 2022లో కొంత కాలం పాటు ఐపీఎల్ నుంచి తప్పుకున్నాడు. దీర్ఘకాల ఫార్మాట్ క్రికెట్ పై దృష్టి సారించాడు. ఐపీఎల్ కెరీర్ లో 30 మ్యాచ్ ల్లో 503 పరుగులు చేశాడు సామ్ బిల్లింగ్స్. ముఖ్యంగా 2018లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడుతూ.. చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ కోల్ కతా నైట్ రైడర్స్ మ్యాచ్ లో హాఫ్ సెంచరీ సాధించాడు. ఆ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కోల్ కతా నైట్ రైడర్స్ ను ఓడించింది. 2022 నుంచి ఐపీఎల్ నుంచి వైదొలిగాడు. 2025 ఐపీఎల్ మెగావేలంలో అమ్ముడు పోలేదు. ప్రస్తుతం సామ్ బిల్లింగ్స్ PSL లో ఆడుతున్నాడు.
సామ్ బిల్లింగ్స్ ఇంగ్లాండ్ క్రికెట్ కెరీర్ లో పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లలో ఎక్కువగా రాణించాడు. ముఖ్యంగా T20లలో, టెస్టులలో కూడా ఆడాడు. అతను వికెట్ కీపర్-బ్యాట్స్‌మన్. బిల్లింగ్స్ ప్రధానంగా పరిమిత ఓవర్ల క్రికెట్‌లో కనిపించాడు. అతను తన బ్యాటింగ్ నైపుణ్యాలను ప్రదర్శించాడు. ఇంగ్లాండ్ తరపున వన్డేలు, T20 అంతర్జాతీయ మ్యాచ్‌లలో ఆడాడు. 3500 కంటే ఎక్కువ T20 పరుగులు సాధించాడు. అతను T20 బ్లెస్ట్ లీగ్ అయిన “ది హండ్రెడ్”లో “ది ఇన్విన్సిబుల్స్” జట్టుకు కెప్టెన్‌గా రెండుసార్లు విజేతగా నిలిచాడు. జనవరి 2022లో తన టెస్ట్ క్రికెట్ అరంగేట్రం చేశాడు. అతను టెస్ట్ క్రికెట్ నుండి వైదొలిగాడు, అతను టెస్ట్ జట్టులో స్థానం పొందడానికి గట్టి పోటీనే ఎదుర్కొన్నాడు.ఇదిలా ఉంటే.. ప్రస్తుతం సామ్ బిల్లింగ్స్-సారా కాంట్లే ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.