Sara Tendulkar: టీమిండియా స్టార్ క్రికెటర్ శుభ్ మన్ గిల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టీమిండియా క్రికెట్లో అతి తక్కువ కాలంలోనే టాప్ మోస్ట్ క్రికెటర్ గా మారిపోయాడు శుభ్ మన్ గిల్. త్వరలోనే టీమ్ ఇండియా టెస్ట్ కెప్టెన్ గా కూడా అవతారం ఎత్తబోతున్నాడు. ఇలాంటి నేపథ్యంలో.. శుభ్ మన్ గిల్ అలాగే సారా టెండూల్కర్ ప్రేమాయణం గురించి సంచలన విషయం బయటకు వచ్చింది. సారా టెండూల్కర్ అలాగే శుభ్ మన్ గిల్ ఇద్దరు ప్రేమించుకుంటున్నారని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల వీరిద్దరు విడిపోయారని కూడా… బోలెడు వార్తలు వచ్చాయి. అయితే వీళ్లిద్దరు విడిపోవడానికి గల కారణం వివరిస్తూ.. నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి.
Also Read: BJP on Pakistan : ఆపరేషన్ సిందూర్.. పాకిస్థాన్ చుక్కలు చూపించారుగా.. ఒక్కటి మిస్ కాలేదు !
భయంకరమైన వ్యాధితో బాధపడుతున్న సారా
సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్ భయంకరమైన వ్యాధితో పోరాడుతున్నట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ విషయాన్ని స్వయంగా సారా టెండూల్కర్ ఇంటర్వ్యూలో ప్రకటించడం జరిగింది. తనకు pcos అనే భయంకరమైన వ్యాధి సోగినట్లు ఆమె పేర్కొంది. అయితే ఈ భయంకరమైన వ్యాధి కారణంగా తాను లావుగా మారినట్లు వెల్లడించింది సారా టెండూల్కర్. అలాగే తన ముఖం పైన మొత్తం మచ్చలు ఏర్పడినట్లు కూడా వెల్లడించింది. తిన్న ఆహారం అసలు జీర్ణం కాదని కూడా పేర్కొంది. బరువు కూడా పెరిగినట్లు వివరించింది. అయితే ఈ సమస్య వస్తే భవిష్యత్తులో… సంతానం కలిగే అవకాశాలు తక్కువగా ఉంటాయని కూడా వైద్య నిపుణులు చెబుతున్నారు.
అయితే ఈ సమస్య నేపథ్యంలోనే.. సారా టెండూల్కర్ ను శుభ్ మన్ గిల్ వదిలేసినట్లు సోషల్ మీడియాలో కొత్త చర్చ మొదలైంది. ఆమెతో చెట్టా పట్టాలేసుని వేసుకుని తిరిగి.. కొత్త ఆరోగ్య సమస్య వచ్చిందని… శుభ్ మన్ గిల్ వదిలేసినట్లు ట్రోలింగ్ చేస్తున్నారు కొంతమంది. అవసరానికి ఆమెను వాడుకొని.. ఇప్పుడు గాలికి వదిలేసాడని శుభ్ మన్ గిల్ పై ఫైర్ అవుతున్నారు. గత మూడు సంవత్సరాలుగా గిల్ అలాగే సారా టెండూల్కర్ ఇద్దరు కూడా ప్రేమించుకున్నారని… రెస్టారెంట్లు అలాగే హోటల్స్, పబుల్లో కూడా తిరిగినట్టు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు క్రీడా అభిమానులు. మొత్తానికి సారా టెండూల్కర్ వ్యాధి కారణంగా గిల్ ట్రోలింగ్ కు గురి అవుతున్నాడు.
Also Read: Virat Kohli : విరాట్ కోహ్లీకి టెన్త్ క్లాస్ లో వచ్చిన మార్కులు తెలిస్తే.. ఆశ్చర్యపోవాల్సిందే..!
బాలీవుడ్ నటుడితో సారా టెండూల్కర్ రిలేషన్
శుభ్ మన్ గిల్ వదిలేసిన తర్వాత సారా టెండూల్కర్ గురించి మరో రూమర్ బయటకు వచ్చింది. బాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించిన యంగ్ కుర్రాడితో సారా టెండూల్కర్ ప్రేమాయణం నడిపిందని వార్తలు వచ్చాయి. ఆ నటుడు ఎవరో కాదు సిద్ధార్థ చతుర్వేది అని సమాచారం. గత కొన్ని రోజులుగా ఇతనితో డేటింగ్ చేస్తోందట సారాటెండూల్కర్. మరి ఇందులో ఎంత మేరకు వాస్తవం ఉందో తెలియాల్సి ఉంది.