BigTV English

BJP on Pakistan : ఆపరేషన్ సిందూర్.. పాకిస్థాన్ చుక్కలు చూపించారుగా.. ఒక్కటి మిస్ కాలేదు !

BJP on Pakistan : ఆపరేషన్ సిందూర్.. పాకిస్థాన్ చుక్కలు చూపించారుగా.. ఒక్కటి మిస్ కాలేదు  !

BJP on Pakistan :  భారత్-పాకిస్తాన్ మధ్య ప్రస్తుతం ఉద్రిక్త వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. తొలుత పాకిస్తాన్ కి చెందిన ఉగ్రవాదులు పహల్గామ్ లో దాడి చేయడంతో దాదాపు 28 మంది భారతీయులు మరణించిన విషయం తెలిసిందే. అయితే భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ తో పాకిస్తాన్ తోక ముడిచినట్టయింది. ఇక ఈ విజయాన్ని కీర్తిస్తూ.. బీజేపీ చేసిన ఓ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 2007 నాటి టీ-20 ప్రపంచ కప్ మ్యాచ్ కి సంబంధించిన వీడియో ను షేర్ చేసింది బీజేపీ.. నాటి మ్యాచ్ లో భారత్ సాధించిన విజయాన్ని ఆపరేషన్ సిందూర్ తో పోల్చుతూ పాకిస్తాన్ ని ఎద్దేవా చేసింది.


 

Also Read :   RCB VS KKR : రేపటి నుంచి ఐపీఎల్ 2025 పునః ప్రారంభం.. ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్.. టైమింగ్స్ లో మార్పులు!

ఇక ఆ టోర్నీలో లీగ్ దశలో భారత్ -పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్ టై అయింది. దీంతో బౌల్-ఔట్ పెట్టగా పాక్ జట్టు చిత్తు చిత్తుగా ఓడింది. బౌల్ అవుట్ లో భారత ఆటగాళ్లు వీరేంద్ర సెహ్వాగ్, హర్భజన్ సింగ్, రాబిన్ ఉతప్ప స్టంప్స్ ను పడగొట్టారు. పాక్ క్రికెటర్లు యాసిర్ అరాఫత్, ఉమర్ గుల్, షాహిద్ అప్రిదీ మాత్రం మూడుసార్లు విఫలం చెందారు. దీంతో 3-0తో ఆ మ్యాచ్ లో టీమిండియా  విజయం సాధించింది. ఇందుకు సంబంధించిన వీడియో బీజేపీ తమ ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేస్తూ.. ఇది కూడా ఆపరేషన్ సిందూర్ లాంటిదే అంటూ క్యాప్షన్ రాసుకొచ్చింది. తాజాగా జరిగిన సైనిక ఆపరేషన్ లో కూడా భారత్ పై చేయి సాధించేందుకు పాక్ చేసిన ఒక్క ప్రయత్నం ఫలించకపోవడంతో ఆ దేశం చిత్తుగా ఓడిందన్న ఉద్దేశంతో బీజేపీ ఈ పోస్ట్ చేసింది.

2007లో తొలిసారి టీ 20 టోర్నీని ప్రారంభించారు. మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్సీలో తొలిసారి భారత్ పాకిస్తాన్ పై ఫైనల్ లో విజయం సాధించింది. సాధారణంగా భారత్-పాకిస్తాన్ మ్యాచ్ అంటే అభిమానులకు ఉన్నటువంటి ఆసక్తి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. అయితే 2007 టీ-20 ప్రపంచ కప్ లో మ్యాచ్ లీగ్ దశలో భారత్-పాకిస్తాన్ తలపడ్డాయి. ఇక ఆరో8జు మ్యాచ్ సమం కావడంతో మరింత రసవత్తరంగా మారింది. ఇరు జట్లు కూడా 141 పరుగులు సాధించాయి. అప్పటికీ ఇంకా సూపర్ ఓవర్ అనే విధానం అందుబాటులోకి తీసుకురాలేదు. టై బ్రేకింగ్ కోసం బౌల్ అవుట్ నిర్వహించారు. ఇది పుట్ బాల్ లో పెనాల్టీ షూట్ అవుట్ లాంటిదే. ఇందులో ఇరు జట్ల నుంచి ముగ్గురు ఆటగాళ్ల చొప్పున అవకాశం కల్పిస్తారు. బ్యాటర్లు ఎవ్వరూ ఉండరు. కేవలం ఆటగాళ్లు బౌలింగ్ చేసి స్టంప్స్ పడగొట్టాల్సి ఉంటుంది. ఏ జట్టు ఎక్కువ స్టంప్స్ పడగొడితే  ఆ జట్టునే విజేత గా నిర్ణయిస్తారు. అందులో భారత్ సునాయసంగా విజయం సాధించింది. అలాగే ఫైనల్ లో కూడా భారత్-పాక్ జట్ల మధ్య ఉత్కంఠగా జరిగింది. చివర్లో శ్రీశాంత్ వేసిన బంతి అందరూ సిక్స్ కి వెళ్లిందని అనుకున్నారు. కానీ పాక్ బ్యాటర్ బౌండరీ లైన్ వద్ద క్యాచ్ ఔట్ కావడంతో టీమిండియా తొలిసారి టీ-20 ప్రపంచ కప్ ను సాధించింది.

Related News

Gill – Abhishek : యువరాజ్ స్కూల్ లో ట్రైనింగ్.. నెంబర్ వన్ ర్యాంక్ లో గిల్, అభిషేక్

KL Rahul: ఇంగ్లాండ్ ప్లేయర్లకు యముడిలా మారిన kl రాహుల్.. ఔట్ చేస్తే గాయాలే

Rishabh Pant : రిషబ్ పంత్ గొప్పోడయ్యా.. కష్టాల్లో ఉన్న ఓ లేడీకి.. ఆ గుండె బతకాలి

Dhoni on Virat : కోహ్లీ పెద్ద జోకర్.. ధోని హాట్ కామెంట్స్ వైరల్!

Night watchman : టెస్ట్ క్రికెట్ లో అసలు నైట్ వాచ్మెన్ అంటే ఎవరు.. వాళ్ల డ్యూటీ ఏంటి

Shreyas Iyer: శ్రేయస్‌కు మరోసారి నిరాశే.. ఆసియా కప్‌ జట్టులో నో ఛాన్స్ ?

Big Stories

×