AP Free Bus Scheme: ఏపీ ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ఇది కేవలం ఓ ప్రయాణ సౌకర్యం కాదు.. మహిళల జీవన శైలిలో విప్లవాత్మక మార్పుని తీసుకురానుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కర్నూలు పర్యటనలో చేసిన ఈ ప్రకటనతో మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆగస్ట్ 15 నుంచి రాష్ట్రంలోని మహిళలందరికీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తామన్న ఒక్క మాట తోనే లక్షలాది మంది మహిళల మనసుల్లో నూతన ఆశలు చిగురించాయి.
ఈ పథకం అమలవుతోన్న తీరును గమనిస్తే, ఇది కేవలం ఓ రాజకీయ ఎజెండా కాదని స్పష్టమవుతుంది. ఇందులో ఓ వ్యూహాత్మక దృష్టి, సామాజిక బాధ్యత దాగి ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే.. ప్రయాణ ఖర్చు తగ్గితే, ఉపాధి, విద్య, ఆరోగ్య సేవలకు మహిళలకు కాస్త ఆర్థిక కష్టాలు తగ్గుముఖం పడతాయి. ఈ స్కీమ్ కోసం ఎందరో మహిళలు ఏపీలో ఎదురుచూస్తున్నారని చెప్పవచ్చు.
ఈ పథకం ఆగస్ట్ 15 నుంచి అమలులోకి వస్తుందని సీఎం చంద్రబాబు చెప్పకనే చెప్పారు. అయితే ఎలా వర్తింపజేస్తారన్నది ఇప్పుడు ఎన్నో సందేహాలను వ్యక్తం చేస్తోంది. రాష్ట్రంలో నివసించే ప్రతి మహిళకు ఇది వర్తించనుంది. ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం సౌకర్యం కల్పించనున్నారు. గుర్తింపు కార్డు లేదా ఆధార్ ఆధారంగా ప్రయాణ అనుమతి కల్పిస్తారని చెప్పవచ్చు. పల్లె నుండి పట్టణానికి పని, విద్య కోసం వచ్చే మహిళలకు ఇది చాలా ఉపయోగపడనుంది.
అయితే ఇది ఇలా అని చెప్పగానే కొన్ని ప్రశ్నలు పుట్టుకొస్తున్నాయి. ప్రయాణికుల రద్దీ పెరిగితే ఎలా? సాయంత్రం సమయంలో రద్దీ బస్సుల్లో మహిళలే ఎక్కువైపోతే మిగిలిన ప్రయాణికులకు ఇబ్బంది కలుగదా? ఈ స్కీమ్‌కు ప్రభుత్వానికి ఏ మేర ఖర్చు అవుతుంది? ఈ ఖర్చుని ఎలా భరించబోతున్నారు? అనే ప్రశ్నలకు సమాధానం రావాల్సి ఉంది. ఈ పథకానికి ప్రభుత్వం భారీ బడ్జెట్ కేటాయించనుందని సమాచారం. ఆర్థిక వనరుల విషయాన్ని అధికార వర్గాలు విశ్లేషించగా, ముఖ్యంగా మహిళా శక్తిని సమాజ నిర్మాణానికి ప్రధానంగా వినియోగించాలన్న లక్ష్యంతో రూపొందించబడింది.
Also Read: Pawan Kalyan: పవన్ చేతిపై టాటూ.. అర్థం ఏంటో తెలుసా..?
ఇప్పుడు ఫ్రీగా ప్రయాణించగలిగే మహిళలు పని చేయడానికి దూర ప్రాంతాలకు వెళ్లగలుగుతారు. డిగ్రీ, పీజీ చదువుతున్న అమ్మాయిలకు ఇది ఓ వరం. పల్లె నుంచి పట్టణానికి చదువుకోడానికి వెళ్లే విద్యార్థినులకు ఇదొక సదవకాశమని చెప్పవచ్చు. అయితే పథకాన్ని పూర్తిగా ఆనందంగా స్వీకరించని వర్గాలు కూడా ఉన్నాయి.
కొందరు ప్రయాణికులు ఇప్పటికే బస్సుల్లో రద్దీ ఎక్కువగా ఉంది, ఇది మరింత పెరుగుతుంది అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు మాత్రం, ఇది ఓ కొత్త సామాజిక సమీకరణకు నాంది అంటూ ప్రశంసిస్తున్నారు. నిజంగా ఈ స్కీమ్ ద్వారా మహిళలు జీవనోపాధికి మరింత దగ్గరయ్యే అవకాశముందని ఎక్కువ మంది మహిళల అభిప్రాయం.
చివరగా.. మహిళల ప్రయాణం ఇక ఉచితం మాత్రమే కాదు.. గౌరవంతో కూడినది కూడా. ఇది ఒక సామాజిక మార్పు బస్సు ప్రయాణం. మొత్తం మీద ఏపీలో మహిళలకు ఫ్రీ బస్ స్కీమ్ ఏ మేరకు సక్సెస్ అవుతుందో వేచిచూడాలి.