E-Paper
Advertisement

Shahid Afridi: ఇండియాను నిద్ర‌లేకుండా చేసారు.. మీరు రియ‌ల్ హీరోలు రా !

Shahid Afridi: ఇండియాను నిద్ర‌లేకుండా చేసారు.. మీరు రియ‌ల్ హీరోలు రా !
Advertisement

Shahid Afridi: చిరకాల ప్రత్యర్ధులు భారత్ – పాకిస్తాన్ మధ్య జరిగిన అండర్-19 ఆసియా కప్ ఫైనల్ పోరులో పాకిస్తాన్ ఘన విజయం సాధించింది. టోర్నీ ఆధ్యాంతం జైత్రయాత్ర సాగించిన భారత్.. కీలకమైన చివరి పోరులో చేతులెత్తేసింది. ఆదివారం రోజు దుబాయ్ వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్ లో బ్యాటింగ్, బౌలింగ్ విభాగాలలో సమిష్టిగా రాణించిన పాకిస్తాన్ జట్టు 191 పరుగుల భారీ తేడాతో టీమ్ ఇండియాపై గెలుపొందింది. పాకిస్తాన్ యువ బ్యాటర్ సమీర్ మిన్హస్ 172 పరుగుల వీరోచిత ఇన్నింగ్స్ తో చెలరేగడంతో టీమ్ ఇండియా పై 191 పరుగుల తేడాతో పాకిస్తాన్ విజయం సాధించి టైటిల్ ని ముద్దాడింది.

Also Read: Cameron Green – IPL 2026: గ్రీన్ కు బిగ్ షాక్‌..వ‌చ్చేది రూ.25.20 కోట్లు కాదు, రూ.9.74 కోట్లే..మొత్తం నాకేశారుగా !

Advertisement

 

2017 చాంపియన్స్ ట్రోఫీ టైటిల్ మ్యాచ్ లాగే ఈ ఫైనల్:

2017 ఛాంపియన్ ట్రోఫీ తరహాలోనే.. ఈ టోర్నీ గ్రూప్ దశలో భారత్ చేతిలో ఓడిపోయింది పాకిస్తాన్. కానీ ఫైనల్ లో మాత్రం భారీ తేడాతో గెలిచి టైటిల్ ని గెలుచుకోవడం గమనార్హం. ఈ మ్యాచ్ లో టీమిండియా టాస్ గెలిచి మొదట బౌలింగ్ చేయాలని నిర్ణయించుకుంది. కానీ ఈ నిర్ణయం పూర్తిగా తప్పు అని నిరూపితమైంది. ఈ మ్యాచ్ లో టాస్ ఓడి బ్యాటింగ్ కి దిగిన పాకిస్తాన్ కి సమీర్ కనీవిని ఎరుగని ఇన్నింగ్స్ తో అండగా నిలిచాడు. అతడు కేవలం 71 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు. మొత్తంగా 113 బంతులలో 172 పరుగులు చేసి భారత బౌలర్లను ముప్పు తిప్పలు పెట్టాడు.

Advertisement

దీంతో పాకిస్తాన్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 347 పరుగుల భారీ స్కోర్ నమోదు చేసింది. అనంతరం 348 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టును పాక్ పేస్ త్రయం అలీ రజా, అబ్దుల్ సుభాన్, మహమ్మద్ సయ్యాం కుప్పకూల్చారు. కేవలం 26.2 ఓవర్లలోనే భారత్ 150 పరుగులకే అవుట్ కావడంతో పాకిస్తాన్ రికార్డు స్థాయి విజయం సాధించింది. టీమిండియా దృష్టి అంతా వైభవ్ సూర్య వంశీ పైనే ఉంది. ఈ ఓపెనర్ అద్భుతమైన ఆరంభాన్ని అందించినప్పటికీ.. ఐదవ ఓవర్ మొదటి బంతికి 26 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. దీంతో టీమ్ ఇండియాకి కోలుకోలేని దెబ్బ తగిలింది. ఈ టోర్నీ మొత్తం విజయాలతో దూసుకు వెళ్లిన టీమిండియా కుర్రాళ్ళు.. ఫైనల్ లో మాత్రం ఓడి వట్టి చేతులతో నిరాశగా ఇంటి ముఖం పడ్డారు.

Also Read: U19 Asia Cup 2025: ACC ఛైర్మన్ నఖ్వీ ఇజ్జ‌త్ తీసిన టీమిండియా… ముఖాన కొట్టిన మెడల్స్

 

టీమిండియాని నిద్ర లేకుండా చేశారు:

అండర్ 19 ఆసియా కప్ 2025లో పాకిస్తాన్ అండర్ 19 క్రికెట్ జట్టు అద్భుత ప్రదర్శనతో భారత్ ని 191 పరుగుల తేడాతో ఓడించి ఛాంపియన్ కావడంతో ఆ దేశవ్యాప్తంగా సంబరాలు కొనసాగుతున్నాయి. ఈ విజయం పట్ల పాకిస్తాన్ సీనియర్ క్రికెటర్ షాహిద్ అఫ్రీది కూడా సోషల్ మీడియా వేదికగా స్పందించాడు. ” Congratulations rising stars of Pakistan, you have lifted Pakistan from the womb today” అంటూ ట్వీట్ చేశాడు. తాను ఊహించినట్లుగానే తమ దేశాన్ని గర్వంగా నిలబెట్టారని.. ఈ ఘనవిజయానికి ప్రపంచం గౌరవిస్తుందన్నాడు. మీరు మీ ప్రతిభా, పట్టుదలతో అద్భుత ఆట చూపించారని.. ఈ ప్రదర్శన ప్రాకిస్తాన్ క్రికెట్ రాజకీయ భవిష్యత్తు కోసం పెద్ద సందేశం పంపిందన్నాడు. ఈ రియల్ హీరోలు టీమిండియాను నిద్రలేకుండా చేశారని అన్నాడు షాహిద్ అఫ్రీదీ.

Related News

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

గంభీర్ వెనక కోహ్లీ కుప్పిగంతులు..అస‌భ్యక‌రంగా చేతులు చూపిస్తూ డ్యాన్స్

లార్ట్స్ మైదానంలో ఈ గంట కొట్ట‌డానికి కార‌ణం ఏంటి? దీని వెనుక ఉన్న‌ర‌హ‌స్యం

Big Stories

Advertisement
×