U19 Asia Cup 2025: టైటిల్ ఫేవరేట్ గా బరిలోకి దిగిన భారత కుర్రాళ్లకు అండర్ 19 ఆసియా కప్ ఫైనల్ లో నిరాశ ఎదురైంది. రికార్డ్ స్థాయిలో తొమ్మిదవ సారి టైటిల్ ని కైవసం చేసుకోవాలనుకున్న టీమిండియా ఆశలను పాకిస్తాన్ జట్టు అడ్డుకుంది. ఆదివారం రోజు పాకిస్తాన్ తో జరిగిన ఫైనల్ లో భారత్ 191 పరుగుల తేడాతో ఘోర పరాజయం చవిచూసింది. అన్ని రంగాలలో ఆధిపత్యం కనబరిచిన పాకిస్తాన్ జట్టు టైటిల్ ని చేజిక్కించుకుంది.
Also Read: Ishan Kishan: వివాదంలో ఇషాన్ కిషన్..టీ20 వరల్డ్ కప్ కాదు, నాకు తినడం, పడుకోవడమే కావాలి !
ఆదివారం రోజు దుబాయ్ లోని ఐసీసీ అకాడమీ స్టేడియం వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్ లో భారత్ టాస్ గెలిచి మొదట బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్ కి దిగిన పాకిస్తాన్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 347 పరుగుల భారీ స్కోర్ నమోదు చేసింది. ఓపెనర్ సమీర్ మిన్హస్ 172 పరుగులతో చెలరేగాడు. దీంతో పాకిస్తాన్ భారీ స్కోర్ నమోదు చేయగలిగింది. అనంతరం 348 పరుగుల లక్ష్య చేదనలో భారత్ దారుణంగా విఫలమైంది. టీమిండియా స్టార్ బ్యాటర్లు ఎవరు ఆకట్టుకోలేకపోయారు. దీంతో 26.2 ఓవర్లలోనే 156 పరుగులకే టీమిండియా ఆల్ అవుట్ అయింది. టీమిండియా ఆటగాళ్లలో బౌలర్ దీపేష్ దేవేంద్రన్ ఒక్కడే 36 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఇక మిగతా ఆటగాళ్లు ఎవరు పెద్దగా రాణించలేకపోయారు. ఇక పాకిస్తాన్ బౌలర్లలో అలీ రజా 4 వికెట్లతో భారత్ ని దెబ్బతీశాడు. అలాగే అబ్దుల్ సుభాన్, మహమ్మద్ సయ్యాం, హుజైపా అహ్సాన్ చెరో 2 వికెట్లు పడగొట్టారు.
ఈ ఫైనల్ మ్యాచ్ అనంతరం జరిగిన బహుమతి ప్రధానోత్సవంలో ఓ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఆసియా క్రికెట్ కౌన్సిల్ చైర్మన్, పాకిస్తాన్ అంతర్గత వ్యవహారాల మంత్రి మోహ్సిన్ నఖ్వి మైదానంలో ఉన్నప్పటికీ.. అతడి చేతుల మీదుగా భారత ఆటగాళ్లు మెడల్స్ తీసుకోలేదు. సాధారణంగా ఎసిసి చైర్మన్ హోదాలో ఉన్న నఖ్వి మెడల్స్ అందించాల్సి ఉంటుంది. కానీ భారత ఆటగాళ్లు స్టేజ్ వద్ద ఉన్న నఖ్వి దగ్గరకి వెళ్లకుండా.. పోడియం ముందు ఉన్న ఖాళీ ప్రదేశంలోనే తమ మెడల్స్ ని స్వీకరించారు.
Also Read: T20 World Cup 2026 India Squad: గిల్ ను తీసేశారు, కానీ హర్షిత్ రాణాను టచ్ చేస్తే మాడి మసైపోతారు
ఐసీసీ అసోసియేట్ మెంబర్ డైరెక్టర్లలో ఒకరైన ముబష్మిర్ ఉస్మాని చేతుల మీదుగా టీమిండియా ఆటగాళ్లు రన్నరప్ మెడల్స్ ని అందుకున్నారు. భారత జట్టు ఇలా నఖ్వి ని నిరాకరించడం ఇది రెండవసారి. ఈ ఏడాది మొదట్లో జరిగిన సీనియర్ ఆసియా కప్ ఫైనల్ లోను పాకిస్తాన్ ను ఓడించి టైటిల్ గెలిచిన అనంతరం.. ఇతడి చేతుల మీదుగా ట్రోఫీని అందుకునేందుకు టీమిండియా నిరాకరించింది. దీంతో ఆయన ఆ ట్రోఫీని తనతో పాటే వెనక్కి తీసుకెళ్లాడు. పెహల్గాం ఉగ్రదాడి అనంతరం రెండు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను నేపథ్యంలో భారత జట్టు ఈ నిర్ణయం తీసుకుంది.
India wins the #AsiaCupFinal 2025 🏆💙
Team India refuses to accept the Trophy from Pakistan Interior Minister & ACC Chairman Mohsin Naqvi.
Someone just picked it up and walked off the ground! 🤯
Another Embarrassing Moment for 🇵🇰
📹 Video Out!#INDvsPAK #Tilak #AsiaCupFinal pic.twitter.com/uZ3t9G2zJ7— Vijay Gautam 🚩 (@Vijay_Gautamm) September 28, 2025