E-Paper
Advertisement

Cameron Green – IPL 2026: గ్రీన్ కు బిగ్ షాక్‌..వ‌చ్చేది రూ.25.20 కోట్లు కాదు, రూ.9.74 కోట్లే..మొత్తం నాకేశారుగా !

Cameron Green – IPL 2026: గ్రీన్ కు బిగ్ షాక్‌..వ‌చ్చేది రూ.25.20 కోట్లు కాదు, రూ.9.74 కోట్లే..మొత్తం నాకేశారుగా !
Advertisement

Cameron Green – IPL 2026: ఇటీవల దుబాయ్ లో జరిగిన 2026 ఐపీఎల్ మినీ వేలంలో ఆస్ట్రేలియా స్టార్ ఆల్ రౌండర్ కామెరున్ గ్రీన్ అత్యధిక మొత్తానికి అమ్ముడుపోయిన ఆటగాడిగా నిలిచాడు. ఓవరాల్ గా ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధరకు అమ్ముడుపోయిన మూడవ ప్లేయర్ గా రికార్డులకు ఎక్కాడు కామరూన్ గ్రీన్. ఇతడిని కోల్కత్తా నైట్ రైడర్స్ 25.20 కోట్లకు సొంతం చేసుకుంది. కామెరున్ గ్రీన్ ని ఓ కంప్లీట్ ఆల్రౌండర్ గా జట్టులోకి తీసుకున్న కేకేఆర్.. అతనిపై ఎన్నో ఆశలు పెట్టుకుంది.

Also Read: U19 Asia Cup 2025: ACC ఛైర్మన్ నఖ్వీ ఇజ్జ‌త్ తీసిన టీమిండియా… ముఖాన కొట్టిన మెడల్స్

Advertisement

బ్యాట్ తో పాటు బంతి తోను రాణిస్తాడని కేకేఆర్ ఆశిస్తోంది. ఇక తనను కేకేఆర్ భారీ ధరకు కొనడం పై ఆనందాన్ని వ్యక్తం చేశాడు గ్రీన్. ఇందుకు సంబంధించిన వీడియో ని కేకేఆర్ తన సోషల్ మీడియా ఖాతాలో అభిమానులతో పంచుకుంది. ఈ వీడియోలో గ్రీన్.. ఈడెన్ గార్డెన్స్ లో కేకేఆర్ తరఫున ఆడేందుకు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నానని.. ఐపీఎల్ 2026 సీజన్ లో కేకేఆర్ కప్ గెలవాలని ఆకాంక్షించాడు.

 

కామెరున్ గ్రీన్ పై టాక్స్ బాదుడు:

Advertisement

కామెరున్ గ్రీన్ ని కేకేఆర్ 25.20 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ మొత్తం అతడి చేతికి వెళ్లదు. ఐపీఎల్ నిబంధనలు, భారత పన్ను చట్టాలు, ఆస్ట్రేలియా ప్రభుత్వ ఆర్థిక విధానాలు, బీసీసీఐ ఆర్థిక విధానాల కారణంగా అతడి వాస్తవ ఆదాయం గణనీయంగా తగ్గిపోతుంది. అన్ని తగ్గింపులు వర్తింపజేసిన తర్వాత కామెరూన్ గ్రీన్ భారతదేశం నుంచి ఇంటికి తీసుకువెళ్లగల మొత్తం సుమారు రూ. 9.74 కోట్లు మాత్రమే. ఇటీవలి కాలంలో మెగా వేళానికి దూరంగా ఉండి.. కేవలం మినీ వేలంలో మాత్రమే పేరు నమోదు చేసుకోవడం ద్వారా కొరత ఆధారిత బిడ్డింగ్ యుద్ధాలను సృష్టిస్తున్నారనే ఆందోళన బీసీసీఐలో తీవ్రంగా పెరిగింది.

దీనిని నియంత్రించేందుకు బోర్డు గరిష్ట రుసుము విధానాన్ని అమలు చేస్తోంది. ఈ విధానం ప్రకారం ఒక విదేశీ ఆటగాడికి ఫ్రాంచైజీ ఎంత ఎక్కువ వెచ్చించి కొనుగోలు చేసినా.. అతడికి నేరుగా చెల్లించే గరిష్ట మొత్తం 18 కోట్లకే పరిమితం అవుతుంది. ఇంతకు మించిన మొత్తం బీసీసీఐ ఆధ్వర్యంలోని ప్లేయింగ్ వెల్ఫేర్ ఫండ్ కి మళ్ళించడం జరుగుతుంది. తద్వారా అతడికి వచ్చిన 25.20 కోట్లలో నేరుగా లభించేది కేవలం 18 కోట్లు మాత్రమే. ఇక ఈ 18 కోట్లు కూడా మొత్తం అతని ఖాతాకి చేరదు. ఇక్కడినుండే అసలు పన్నుల భారం ప్రారంభమవుతుంది.

 

విదేశీ ఆటగాళ్లపై 20% టి.డి.ఎస్ పన్ను:

ఇండియన్ ప్రీమియర్ లీగ్ ద్వారా వచ్చే ఆదాయాన్ని భారత పన్నుల చట్టం వృత్తిపరమైన ఆదాయంగా పరిగణిస్తుంది. ఇది మన దేశ ఆటగాళ్లకు సెక్షన్ 194 J కింద 10% మాత్రమే టి.డి.ఎస్ కి వర్తిస్తుంది. కానీ విదేశీ ఆటగాళ్లకు నాన్ రెసిడెంట్లుగా వర్గీకరించి సెక్షన్ 115 బి.బి.ఏ కింద పన్ను విధిస్తారు. ఇందులో 20% టి.డి.ఎస్ ఉంటుంది. అంతేకాకుండా అతని ఆదాయం ఎక్కువగా ఉండటం వల్ల సర్ చార్జ్, సెస్ లు కూడా వర్తిస్తాయి. ఇలా అతని 18 కోట్లలో 20% టి.డి.ఎస్ విధిస్తే 3.60 కోట్లు తగ్గుతుంది. అంతేకాకుండా దీని మీద 25% సర్ ఛార్జ్ తో మరో 90 లక్షలు కట్ అవుతుంది. అదనంగా 4% సెస్ గా మరో 18 లక్షలు కట్ అవుతాయి.

Also Read: Ishan Kishan: వివాదంలో ఇషాన్ కిష‌న్..టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ కాదు, నాకు తిన‌డం, ప‌డుకోవ‌డ‌మే కావాలి !

ఇలా మన ప్రభుత్వం వద్దే మొత్తంగా 4.68 కోట్ల పన్నుల రూపంలో కట్ అవుతాయి. ఈ అన్ని తగ్గింపుల తర్వాత ఇండియా నుండి గ్రీన్ సుమారు 13.32 కోట్లను మాత్రమే ఆస్ట్రేలియాకి తీసుకువెళ్తాడు. ఇక తన దేశంలో కూడా అతడి పై ఆధాయ పన్ను, మెడికేర్ లేవీ వర్తిస్తుంది. ఆస్ట్రేలియా – భారత్ మధ్య ఉన్న డబుల్ టాక్సేషన్ అవాయిడెన్స్ ఒప్పందం ప్రకారం.. భారత్ లో చెల్లించిన పన్నుకు అతడికి క్రెడిట్ లభించినప్పటికీ.. ఆస్ట్రేలియాలో అతనిపై పన్ను భారం తప్పదు. ఆస్ట్రేలియాలో కూడా వివిధ రకాల పన్నుల కింద దాదాపు 3.58 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. ఇవన్నీ పోగా గ్రీన్ తన ఇంటికి తీసుకు వెళ్ళేది 25.20 కోట్లలో రూ. 9.74 కోట్లు మాత్రమే.

 

 

View this post on Instagram

 

Related News

ఆ పాట‌లు పెట్టి ధోని న‌న్ను రెచ్చ‌గొట్టేవాడు…వీరూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

బాబ‌ర్‌, షాహీన్‌, షాబాద్, హారిస్ రోజులు లెక్క‌బెట్టుకోవాల్సిందే…పాకిస్తాన్ నుంచి త‌రిమేసే టైమ్ వ‌చ్చింది!

2027 వ‌ర‌ల్డ్ క‌ప్ పాకిస్తాన్ కు అందిస్తా..లేక‌పోతే త‌ల న‌రుక్కుంటా ?

డ‌బుల్ సెంచ‌రీ చేయ‌కుండా ద్రవిడ్ అడ్డుకున్నాడు..స‌చిన్ సంచ‌ల‌నం !

కావ్య పాప‌ పెళ్లికి పాకిస్తాన్ క్రికెట‌ర్లు…SRHను బ్యాన్ చేయాలంటూ మ‌ళ్లీ పోస్టులు ?

పుట్టినిల్లా ? మెట్టినిల్లా ? బక్కోడిని ఆడుకుంటున్న ఐపీఎల్ ఫ్యాన్స్

ఒరేయ్ ఇన్ని రోజులు ఎక్క‌డున్నావ్ రా? న‌మ‌న్ ధీర్ బ్యాటింగ్ చూసి బిత్త‌ర‌పోయిన గంభీర్‌

విండీస్, టీమిండియా మ్యాచ్ రద్దు… వ‌ర్షం ప‌డి బ‌తికిపోయారంటూ తన్వీర్ అహ్మద్ కామెంట్!

Big Stories

Advertisement
×