E-Paper
Advertisement

Shahid Afridi: బంగ్లాదేశ్ ఒక్క‌టే కాదు, ద‌గ్గ‌ర‌లోనే ఇండియాను అన్ని దేశాలు ఛీ కొడ‌తాయి !

Shahid Afridi: బంగ్లాదేశ్ ఒక్క‌టే కాదు, ద‌గ్గ‌ర‌లోనే ఇండియాను అన్ని దేశాలు ఛీ కొడ‌తాయి !
Advertisement

Shahid Afridi:  టీ20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ( T20 world cup 2026) నేపథ్యంలో ఇండియా ( India) అలాగే బంగ్లాదేశ్ ( Bangladesh ) మధ్య చీలిక వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ( T20 world cup 2026) నుంచి వైదొలిగింది బంగ్లాదేశ్. ఈ మేరకు ఇటీవల అధికారిక ప్రకటన కూడా చేసింది. దీంతో బంగ్లాదేశ్ స్థానంలో స్కాట్లాండ్ రంగంలోకి దిగబోతున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి నేపథ్యంలో బంగ్లాదేశ్ తప్పుకోవడం పై పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షాహిద్ ఆఫ్రీది ( Shahid Afridi) సంచలన వ్యాఖ్యలు చేశారు. బంగ్లాదేశ్ తప్పుకున్నట్లే, త్వరలోనే ఇండియాను అన్ని జట్లు ఛీ కొట్టడం గ్యారంటీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు షాహిద్ ఆఫ్రీది.

Also Read: Virat Kohli to Rohit Sharma: ఒక్క పోస్టుకు రూ.14 కోట్లు..కోహ్లీ నుంచి రోహిత్ వ‌ర‌కు ఎవ‌రు ఎంత తీసుకుంటున్నారంటే

ఇండియా పై షాహిద్ ఆఫ్రీది వివాదాస్పద వ్యాఖ్యలు

Advertisement

టీ20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ నుంచి బంగ్లాదేశ్ తప్పుకోవడం పై తాజాగా మాజీ క్రికెటర్ షాహిద్ ఆఫ్రీది వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బంగ్లాదేశ్ ఈ టోర్నమెంట్ నుంచి తప్పుకోవడం చాలా దారుణం అన్నారు. క్రికెట్ చరిత్రలో ఇలాంటి సంఘటన ఎప్పుడు జరగలేదని వివరించారు. ఇది క్రీడ రంగంలోనే చీకటి రోజు అంటూ షాహిద్ ఆఫ్రీది వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో బంగ్లాదేశ్ ఒక్కటే ఇప్పుడు దూరమైంది.. దగ్గరలోనే ఇండియాకు అన్ని దేశాలు కూడా దూరం కాబోతున్నట్లు హాట్ కామెంట్స్ చేశారు. ఇండియా పరువు పోవడం గ్యారెంటీ అంటూ వచ్చి పోయారు. ఇంత జరుగుతున్నా కూడా భారత క్రికెట్ నియంత్రణ మండలికి ఐసీసీ సపోర్ట్ గా నిలుస్తోందని షాహిద్ ఆఫ్రీది మండిపడ్డారు.

బంగ్లాదేశ్ ఎందుకు త‌ప్పుకుందంటే ?

బంగ్లాదేశ్ లో హిందువులపై వరుసగా దాడులు జరుగుతున్నాయి. వారంలో ఇద్దరు లేదా ముగ్గురు హిందువులు బంగ్లాదేశ్ లో మరణిస్తున్నారు. హిందువులను టార్గెట్ చేసి, చంపేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బంగ్లాదేశ్ కు చెందిన క్రికెటర్లు ముస్తాఫిజుర్ రహమాన్ లాంటి ప్లేయర్లను ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ లో ( Indian Premier League Tournament 2026)  ఆడకుండా భారత క్రికెట్ నియంత్రణ మండలి ( Board of Control for Cricket in India) ఆదేశాలు ఇచ్చింది. దీంతో కేకేఆర్ జట్టు నుంచి తప్పుకున్నాడు ముస్తాఫిజుర్ రహమాన్. ఈ సంఘటన నేపథ్యంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ప్రసారాలపై బ్యాన్ విధించింది బంగ్లాదేశ్ సర్కార్. అంతేకాదు టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ లో భాగంగా జరిగే మ్యాచ్ లు ఇండియాలో ఆడబోమని వైదొలిగింది బంగ్లాదేశ్. ఐసీసీ ఎన్నిసార్లు ఛాన్స్ ఇచ్చినా కూడా వెనక్కి తగ్గలేదు బంగ్లాదేశ్. ఇలాంటి నేపథ్యంలో బంగ్లాదేశ్ స్థానంలో ఇప్పుడు టి20 ప్రపంచ కప్ ఆడేందుకు స్కాట్లాండ్ సిద్ధమైంది.

Advertisement

Also Read: Sarfaraz Khan Double Century: స‌ర్ఫ‌రాజ్ ఖాన్ డ‌బుల్ సెంచ‌రీ..ఇంకేం చేయాలి, ఇక‌నైనా టీమిండియాలోకి తీసుకోండిరా

 

Related News

టీమిండియా చాలా వీక్ గా ఉంది..పాకిస్తాన్ మ‌హిళ‌ల చేతిలో కూడా ఓడిపోవ‌డం ఖాయం!

రోహిత్ శ‌ర్మ‌ కూడా స్లాగ‌రే..గుడ్డిగా బ్యాట్ ఊపితే, వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వ‌లేరు

గంభీర్ ను వెధ‌వ‌ను చేసేందుకు రోహిత్ శ‌ర్మ PR స్టంట్..రిటైర్మెంట్, బొక్కా లేదు

దక్షిణాఫ్రికాలో వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వాలంటే, రోహిత్ శ‌ర్మ ఉండాల్సిందే

పాకిస్తాన్ జ‌ట్టులో కుదుపు…ఫాతిమా స‌నా కెప్టెన్సీ గ‌ల్లంతు

ధోని లేక ఒక్కొక్క‌డి సుఖాలు ఎక్కువ‌య్యాయి..లేకుంటే గంభీర్‌, అగార్క‌ర్ తోక‌లు క‌ట్ చేసేవాడు

పాకిస్తాన్ త‌యారు చేసిన బంతుల వ‌ల్లే, ఫిఫా వరల్డ్ కప్ స‌క్సెస్!

పిక్ పాకెట్ కేసులో పాక్ క్రికెట‌ర్ హసన్ అలీ..తోలు తీసిన ఇండియ‌న్‌ పోలీసులు !

Big Stories

Advertisement
×