E-Paper
Advertisement

Shahid Afridi: అల్లుడు కాదు వాడు న‌ర‌రూప రాక్ష‌సుడు..బౌలింగ్ వేయ‌డం రాని ద‌ద్ద‌మ్మ‌

Shahid Afridi: అల్లుడు కాదు వాడు న‌ర‌రూప రాక్ష‌సుడు..బౌలింగ్ వేయ‌డం రాని ద‌ద్ద‌మ్మ‌
Advertisement

Shahid Afridi:  టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ( T20 World Cup 2026 tournament ) నేపథ్యంలో పాకిస్తాన్ ఎలిమినేట్ అయిన తర్వాత తీవ్రస్థాయిలో ఆ జట్టుపై విమర్శలు వస్తున్నాయి. ప్రతి ఒక్కరూ పాకిస్తాన్ జట్టును టార్గెట్ చేసి ఏదో ఒక బాంబు వేస్తూనే ఉన్నారు. అతి త్వరలోనే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ( Pakistan Cricket Board) కూడా చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేసింది. ఇలాంటి నేపథ్యంలో పాకిస్తాన్ ప్రీమియర్ బౌలర్ అని చెప్పుకునే షాహీన్ అఫ్రిదిపై ( Shaheen Afridi) ఆయన మామ షాహిద్ ఆఫ్రీది ( Shahid Afridi ) స్థాయిలో విరుచుకుపడ్డారు. తన అల్లుడైతే ఏంటి…? తప్పు చేస్తే అందరూ ఒక్క‌టే.. వెంటనే షాహీన్‌పై వేటు వేయాలంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు షాహిద్ ఆఫ్రీది. చివరి ఓవర్లలో బౌలింగ్ చేయడం చేతకావడం లేదని.. ఎన్నిసార్లు చెప్పినా వాడు అర్థం చేసుకోవడం లేదని ఫైర్ అయ్యారు. ఎంత చెప్పినా మారని తన అల్లుడిపై వేటు వేయండి అంటూ పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు సలహా ఇచ్చారు షాహిద్ ఆఫ్రీది ( Shahid Afridi ).

Also Read: T20 World Cup Semi Final Schedule: మార్చి 4 నుంచే సెమీస్ రేస్‌..టీమిండియా షెడ్యూల్ ఇదే, వ‌ర్షం ప‌డితే ఎలా

బౌలింగ్ వేయ‌డం రాని ద‌ద్ద‌మ్మ‌..షాహీన్ అఫ్రిదిపై సీరియస్‌

Advertisement

టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ సూపర్ 8 దశ నుంచి పాకిస్తాన్ ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. దీంతో ఆ జట్టుపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే షాహిద్ అఫ్రీది కూడా పాకిస్తాన్ జట్టు ప్రదర్శన పై స్పందించారు. పాకిస్తాన్ ప్లేయర్లు అత్యంత దారుణంగా విఫలమయ్యారని మండిపడ్డారు. ముఖ్యంగా తన అల్లుడు షాహీన్ అఫ్రిది ప్రదర్శన చాలా చెత్తగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మ్యాచ్ డెత్‌ ఓవర్లలో అతడు, వేసే బంతులు పాకిస్తాన్ ఓటమికి కారణం అవుతున్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. బ్యాటర్ కు అనుకూలంగా బంతులు వేయడం వల్ల పరుగులు విపరీతంగా వస్తున్నాయని పేర్కొన్నారు. ఈ విషయంలో మార్పు తెచ్చుకోవాలని పదేపదే చెప్పినా కూడా తన అల్లుడు షాహీన్ అఫ్రిది వినడం లేదని సీరియస్ అయ్యారు.

ఇలాంటి వాడిని జట్టులోంచి తొలగించాలని డిమాండ్ చేశారు. అల్లుడైతే ఏంటి ? సరిగ్గా ఆడని వాడిని పాకిస్తాన్ జట్టు నుంచి తొలగించాల్సిందేనంటూ హాట్ కామెంట్స్ చేశారు షాహిద్ అఫ్రీది. డెత్ ఓవర్లలో ఎలా బౌలింగ్ చేయాలో నేర్చుకోవాలని హితువు పలికారు. రైట్ హ్యాండ్ బ్యాటర్లకు రౌండ్ ది వికెట్ వచ్చి యార్కర్ వేయడం కంటే.. స్టంప్స్‌ లక్ష్యంగా బౌలింగ్ చేస్తే వికెట్ పడే అవకాశం ఉంటుందని సూచనలు చేశారు. అటు పాకిస్తాన్ ప్లేయర్లపై 50 లక్షల జరిమానా విధిస్తున్నట్లు వస్తున్న వార్తలపై షాహిద్ అఫ్రీది స్పందించారు. పాకిస్తాన్ ప్లేయర్లపై ఇలా భారీ స్థాయిలో ఫైన్ విధించడం ఏమాత్రం సమంజసం కాదని మండిపడ్డారు. ఇది బుర్ర తక్కువ పని అంటూ సీరియస్ అయ్యారు షాహిద్ అఫ్రీది. దీనిపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు పునరాలోచన చేయాలని కోరారు. అవసరమైతే విఫలమైన ప్లేయర్లను ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడాలని ఆదేశాలు ఇవ్వాలన్నారు. రెండు సంవత్సరాల వరకు అలాంటి ప్లేయర్లను దూరం పెట్టాలని స్పష్టం చేశారు షాహిద్ అఫ్రీది.

Advertisement

Also Read: T20 World Cup Semi Final Schedule: మార్చి 4 నుంచే సెమీస్ రేస్‌..టీమిండియా షెడ్యూల్ ఇదే, వ‌ర్షం ప‌డితే ఎలా

 

 

Related News

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 ఫైన‌ల్ మ్యాచ్ టైమింగ్స్ ఇవే..ఇండియాలో లైవ్ ఎప్పుడంటే ?

రెండు మ్యాచ్ ల‌కే గాయ‌ప‌డ్డ బుమ్రాతో వ‌ర‌ల్డ్ క‌ప్ గెలుస్తారా? గ‌వాస్క‌ర్ సీరియ‌స్‌

2027 వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్..త‌న డ్రీమ్ టీమిండియాను ప్ర‌క‌టించిన ర‌విశాస్త్రి

శ్రీలంక‌లో షాహీన్ అఫ్రిదికి ఘోర అవ‌మానం…ప్రీమియ‌ర్ బౌల‌ర్ కాస్త..మీడియం అయ్యాడు

టీమిండియా చాలా వీక్ గా ఉంది..పాకిస్తాన్ మ‌హిళ‌ల చేతిలో కూడా ఓడిపోవ‌డం ఖాయం!

రోహిత్ శ‌ర్మ‌ కూడా స్లాగ‌రే..గుడ్డిగా బ్యాట్ ఊపితే, వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వ‌లేరు

గంభీర్ ను వెధ‌వ‌ను చేసేందుకు రోహిత్ శ‌ర్మ PR స్టంట్..రిటైర్మెంట్, బొక్కా లేదు

దక్షిణాఫ్రికాలో వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వాలంటే, రోహిత్ శ‌ర్మ ఉండాల్సిందే

Big Stories

Advertisement
×