E-Paper
Advertisement

Inzamam-ul-Haq: జై షా ఫోన్ చేసి బెదిరించాడు..అందుకే వెస్టిండీస్ ప్లేయ‌ర్లు భ‌య‌ప‌డి, ఓడిపోయారు

Inzamam-ul-Haq: జై షా ఫోన్ చేసి బెదిరించాడు..అందుకే వెస్టిండీస్ ప్లేయ‌ర్లు భ‌య‌ప‌డి, ఓడిపోయారు
Advertisement

Inzamam-ul-Haq: టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ( T20 World Cup 2026 tournament ) చివరి దశకు వచ్చింది. ఆదివారం రోజున వెస్టిండీస్ పై విజయం సాధించిన టీమిండియా సెమీ ఫైనల్ లో అడుగుపెట్టింది. అయితే టీమిండియా సెమీ ఫైనల్ కు వెళ్లిన నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు విషం కక్కుతున్నారు. ఇదంతా మ్యాచ్ ఫిక్సింగ్ అని ఆరోపణలు చేస్తున్నారు. అయితే తాజాగా వెస్టిండీస్ వర్సెస్ టీమ్ ఇండియా ( Team India vs West Indies ) మ్యాచ్ పై పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ వుల్ హక్ ( INZAMAM-UL-HAQ ) కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇండియా వర్సెస్ వెస్టిండీస్ మధ్య మ్యాచ్ ఫిక్సింగ్  ( Match Fixing) జరిగిందని బాంబు పేల్చారు. టీమిండియా రెండు వికెట్లు కోల్పోయిన తర్వాత వెంటనే ఐసీసీ అధ్య‌క్షుడు జై షా రంగంలోకి దిగాడని ఆరోపణలు చేశారు. ఆయన ఫోన్ చేసి, వెస్టిండీస్ ప్లేయర్లను బెదిరించాడని సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో మ్యాచ్ మొత్తం టీమిండియా చేతిలోకి వెళ్లిపోయిందని ఇంజమామ్ వుల్ హక్ కారు కూతలు కూసాడు.

Also Read: India vs West Indies: సంజూ ర‌ఫా..ర‌ఫా, వెస్టిండీస్ పై 10 ఏళ్ల రివేంజ్ తీర్చుకున్న టీమిండియా…సెమీ ఫైనల్ లోకి ఎంట్రీ

జై షా ఫోన్ చేసి బెదిరించాడు..అందుకే వెస్టిండీస్ ప్లేయ‌ర్లు భ‌య‌ప‌డి, ఓడిపోయారు

Advertisement

టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ లో భాగంగా ఆదివారం వెస్టిండీస్ వర్సెస్ టీమ్ ఇండియా మధ్య మ్యాచ్ జరిగింది. ఇందులో టీమిండియా గ్రాండ్ విక్టరీ కొట్టింది. వెస్టిండీస్ పై ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించి సెమీ ఫైనల్ లో అడుగు పెట్టింది. దీంతో ఇంగ్లాండ్ వర్సెస్ టీమ్ ఇండియా మధ్య ఈనెల 5వ తేదీన సెమీఫైనల్ మ్యాచ్ జరగనుంది. అందులో గెలిస్తే ఫైనల్ ఉంటుంది. అయితే టీమిండియా సెమీఫైనల్ వెళ్లిన నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ క్రికెటర్, మాజీ కెప్టెన్ ఇంజమామ్ ఉల్ హ‌క్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. టీమిండియా బ్యాటింగ్ చేస్తున్న క్రమంలోనే జై షా రంగంలోకి దిగి స్టేడియం అధికారులకు ఫోన్ చేశాడని వెల్లడించారు.

అలాగే జింబాబ్వే ప్లేయర్లను భయపెట్టించాడని.. డబ్బులతో వాళ్లను కొనేశాడని బాంబు పేల్చాడు. ఇలా మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్న కారణంగానే టీమిండియా గెలిచిందని వెల్లడించాడు. లేకపోతే 195 పరుగుల లక్ష్యాన్ని చేదించడం ఇండియా వల్ల కాకపోయేదని విమర్శలు చేశారు. ఫిక్సింగ్ జరగడం వల్లే టీమిండియా సెమీ ఫైనల్ కు చేరిందని ఫైర్ అయ్యారు. దీనిపై ఐసీసీని వివరణ కోరుతానని ఇంజమామ్ ఉల్ హ‌క్ వెల్లడించారు. బీసీసీఐ చెప్పిన‌ట్లుగానే ఐసీసీ న‌డుచుకుంటోంద‌ని విమ‌ర్శ‌లు చేశారు. ఇలా అయితే, క్రికెట్ ఆడ‌టం క‌ష్ట‌మేన‌ని మండిప‌డ్డారు పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ వుల్ హక్ ( INZAMAM-UL-HAQ ). ఇక పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ వుల్ హక్ చేసిన ఈ వ్యాఖ్య‌ల‌కు ఇండియ‌న్స్ కౌంట‌ర్లు ఇస్తున్నారు.

Advertisement

Also Read: India vs West Indies: విండీస్ ఫ‌స్ట్ బ్యాటింగ్..ఐసీసీని ఇండియన్ క్రికెట్ కౌన్సిల్ గా మార్చారు…విషం క‌క్కిన పాక్‌

 

Related News

2027 వ‌ర‌ల్డ్ క‌ప్ పాకిస్తాన్ కు అందిస్తా..లేక‌పోతే త‌ల న‌రుక్కుంటా ?

డ‌బుల్ సెంచ‌రీ చేయ‌కుండా ద్రవిడ్ అడ్డుకున్నాడు..స‌చిన్ సంచ‌ల‌నం !

కావ్య పాప‌ పెళ్లికి పాకిస్తాన్ క్రికెట‌ర్లు…SRHను బ్యాన్ చేయాలంటూ మ‌ళ్లీ పోస్టులు ?

పుట్టినిల్లా ? మెట్టినిల్లా ? బక్కోడిని ఆడుకుంటున్న ఐపీఎల్ ఫ్యాన్స్

ఒరేయ్ ఇన్ని రోజులు ఎక్క‌డున్నావ్ రా? న‌మ‌న్ ధీర్ బ్యాటింగ్ చూసి బిత్త‌ర‌పోయిన గంభీర్‌

విండీస్, టీమిండియా మ్యాచ్ రద్దు… వ‌ర్షం ప‌డి బ‌తికిపోయారంటూ తన్వీర్ అహ్మద్ కామెంట్!

పాకిస్తాన్ జట్టులో ప్రకంపనలు..కోచ్ మైక్ హెసన్ కాలర్ పట్టుకున్న షాహీన్ అఫ్రిది

ముస్లిం క్రికెట‌ర్ల‌కు టీమిండియాలో ఛాన్స్ ఇవ్వ‌రు కానీ పాకిస్తాన్ వ‌చ్చేయ్ !

Big Stories

Advertisement
×