E-Paper
Advertisement

Shahid Afridi: పాక్ బౌలర్ల దెబ్బకు..వైభవ్ ఆస్పత్రి బెడ్డు ఎక్కాల్సిందే

Shahid Afridi: పాక్ బౌలర్ల దెబ్బకు..వైభవ్ ఆస్పత్రి బెడ్డు ఎక్కాల్సిందే
Advertisement

Shahid Afridi:  ఇంగ్లాండ్, ఐర్లాండ్ లతో జరిగే టి20 సిరీస్ లతో పాటు ఏషియన్ గేమ్స్ కోసం టీమిండియా జట్టును తాజాగా ప్రకటించింది భారత క్రికెట్ నియంత్రణ మండలి. ఈ నేపథ్యంలో సూర్య కుమార్ యాదవ్ పై వేటు వేసిన బిసిసిఐ… శ్రేయస్ అయ్యర్ కు కెప్టెన్సీ అప్పగించింది. అంతేకాదు హైదరాబాద్ కుర్రాడు తిలక్ వర్మను వైస్ కెప్టెన్ గా ప్రమోట్ చేసింది. అటు 15 ఏళ్ల వైభవ్ సూర్య‌వంశీ (Vaibhav Suryavanshi ) కూడా టీమిండియాలోకి వచ్చేసాడు. ఐర్లాండ్ లేదా ఇంగ్లాండ్ టోర్నమెంట్లలో కచ్చితంగా అంతర్జాతీయ మ్యాచ్ కూడా ఆడబోతున్నాడు. ఇలాంటి క్రమంలో 15 ఏళ్ల వైభవ్ సూర్య వంశీ పైన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు పాకిస్తాన్ ( Pakistan) మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది (Shahid Afridi). పాకిస్తాన్ బౌలర్లను 15 ఏళ్ల బుడ్డోడు వైభవ్ సూర్య వంశీ ఎదుర్కోవడం కష్టమేనని బాంబు పేల్చారు. పాకిస్తాన్ బౌలర్లు వేసే బంతులు… 15 ఏళ్ల వైభవ్ కు బలంగా తగిలితే మాత్రం… అతడు ఆసుపత్రి బెడ్డు ఎక్కడ గ్యారంటీ అంటూ వార్నింగ్ ఇచ్చారు. అనవసరంగా బీసీసీఐ… ఆ బుడ్డోడిని ఎంకరేజ్ చేస్తోందని మండిపడ్డారు. దీంతో వైభవ్ పైన షాహిద్ అఫ్రిది చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

Also Read: Ambati Rayudu: బ‌ల‌హీనమైన గుజ‌రాత్ పై గెలిచి బిల్డ‌ప్ ఇస్తున్నారు..RCB ప‌రువు తీసిన అంబ‌టి Ambati Rayudu!

పాక్ బౌలర్ల దెబ్బకు..వైభవ్ ఆస్పత్రి బెడ్డు ఎక్కాల్సిందే

Advertisement

15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ టీమిండియాలోకి వస్తున్న క్రమంలో పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు తమకు నచ్చినట్లుగా కామెంట్లు చేస్తున్నారు. 15 ఏళ్ల బుడ్డోడి మనో ధైర్యాన్ని దెబ్బతీసేలా మాట్లాడుతున్నారు. లేటెస్ట్ గా పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది (Shahid Afridi ) కూడా దీనిపై స్పందించారు. వైభవ్ సూర్యవంశీని ఇంత తక్కువ వయస్సులో సెలెక్ట్ చేసి తన ఫూలిష్ బుద్ధిని భారత క్రికెట్ నియంత్రణ మండలి బయటపెట్టుకుందని ఫైర్ అయ్యారు. అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగు పెట్టెందుకు… వైభవ్ సూర్య వంశీకి కాస్త సమయం ఇస్తే బాగుండని పేర్కొన్నారు. క్రికెట్ చరిత్రలో 15 ఏళ్ల కుర్రాడికి అవకాశం ఇచ్చి పెద్ద తప్పిదం చేస్తోందని సీరియస్ అయ్యారు.

ఒకవేళ పాకిస్తాన్ క్రికెట్ జట్టుతో ( Pakistan) తలపడినప్పుడు… వైభవ్ సూర్య వంశీ చాలా ఇబ్బంది పడాల్సి వస్తుందని వార్నింగ్ ఇచ్చారు. పాకిస్తాన్ బౌలర్లు వేసే బంతులు.. అగ్ని పిడుగుల్లా దూసుకు వస్తాయని హెచ్చరించారు. ఈ దెబ్బకు వైభవ్ సూర్య వంశీ ఆసుపత్రి బెడ్డు ఎక్కడ గ్యారంటీ అని షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆ తర్వాత పాకిస్తాన్ క్రికెట్ జట్టును హేళన చేసేవాళ్లంతా నోర్లు మూసుకోవాల్సి వస్తుందని బాంబు పేల్చారు. దీంతో వైభవ్ పైన షాహిద్ అఫ్రిది చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. అయితే, షాహిద్ అఫ్రిదికి అదే త‌ర‌హాలోనే ఇండియ‌న్ ఫ్యాన్స్ కౌంట‌ర్ ఇస్తున్నారు.

Advertisement

Also Read:  Tanveer Ahmed: బాబ‌ర్ ను ( babar azam) ఐపీఎల్ లోకి తీసుకోండి..వైభ‌వ్ కంటే భ‌యంక‌రంగా ఆడ‌తాడు

 

Related News

కోహ్లీ చెత్త ఫీల్డర్‌.. అత‌ని చేత‌కాని త‌నం వ‌ల్లే..బ్రెండన్ మెక్‌కలమ్ 300 బాదేశాడు!

షేన్ వార్న్, మురళీధరన్ కంటే..స‌చిన్ బౌలింగ్ అత్యంత ప్ర‌మాదక‌రం

స్పాట్ ఫిక్సింగ్ లో అంద‌రూ న‌న్ను బ‌లి చేశారు..2013 సంఘ‌ట‌న‌పై శ్రీశాంత్ సంచ‌ల‌నం !

2023 ప్రపంచకప్ ఫైనల్ లో టీమిండియాను గెలిపించేందుకు కుట్ర‌లు చేశారు!

పాకిస్తాన్ ప‌రువు తీసిన శుభ్‌మన్ గిల్…అంద‌రూ క‌లిసి చేసిన ర‌న్స్ ఒక్క‌డే చేశాడుగా!

పాకిస్తాన్ ను నాశ‌నం చేసింది మైక్ హెసనే..వాడు కూడా ఇండియ‌న్ ఏజెంటే !

పీక‌ల‌దాకా తాగుతూ నైట్ క్ల‌బ్ లో దొరికిన 9 మంది పాకిస్తాన్ క్రికెట‌ర్లు

125 స్పీడ్ తో బౌలింగ్ చేస్తే, నా ఆస్తులు రాసిస్తా… బ్రెట్ లీకి షోయ‌బ్ అక్త‌ర్ స‌వాల్

Big Stories

Advertisement
×