E-Paper
Advertisement

Uppal Stadium Dressing Room: SRH డ్రెస్సింగ్ రూమ్ చూశారా..? ఉప్పల్ స్టేడియంలో లగ్జరీ ఏర్పాట్లు.. ఈ వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే

Uppal Stadium Dressing Room: SRH డ్రెస్సింగ్ రూమ్ చూశారా..? ఉప్పల్ స్టేడియంలో లగ్జరీ ఏర్పాట్లు.. ఈ వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే

Uppal Stadium Dressing Room: మీరు ఇప్పటివరకు ఎన్నో క్రీడా మైదానాలకు వెళ్లి క్రికెట్ మ్యాచ్ ని లైవ్ లో వీక్షించి ఉంటారు. కానీ మీరు ఎప్పుడైనా ఉప్పల్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్ డ్రెస్సింగ్ రూమ్ చూశారా..? ఈ డ్రెస్సింగ్ రూమ్ లోని లగ్జరీ ఏర్పాట్లకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. డ్రెస్సింగ్ రూమ్ కి సంబంధించిన ఈ వీడియోని చూసి షాక్ అవుతున్నారు క్రీడాభిమానులు.

Also Read: Abhishek Sharma Tattoo: అభిషేక్‌ శర్మ కొత్త టాటూ.. 10 గంటల్లోనే దాదాపు లక్ష లైక్‌లు

ఉప్పల్ తూర్పు శివారులో ఉన్న ఈ స్టేడియం గరిష్ట సామర్థ్యం 55,000 కాగా.. ఈ మైదానం 16 ఎకరాలలో విస్తరించి ఉంది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్, ఇండియన్ ప్రీమియర్ లీగ్, సన్రైజర్స్ హైదరాబాద్ కి హోం గ్రౌండ్ గా పనిచేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం ఐపీఎల్ 17వ సీజన్ లో బెస్ట్ పిచ్, గ్రౌండ్ అవార్డు అందుకుంది.

SRH డ్రెస్సింగ్ రూమ్:

ఇటీవల స్టేడియం రేనోవేషన్ లో డ్రెస్సింగ్ రూమ్, ప్లేయర్ ఏరియాలను అప్గ్రేడ్ చేశారు. ఈ డ్రెస్సింగ్ రూమ్ లోకి ఎంటర్ కాగానే మొదట రైట్ సైడ్ లో ఉన్న చైర్లలో కూర్చుని ఆటగాళ్లు మ్యాచ్ ని ప్రత్యక్షంగా చూస్తుంటారు. ఇక ఆ తర్వాత రూములో ఆటగాళ్లు తీసుకునే ఆహార పదార్థాలు మరియు కూల్ డ్రింక్స్ ని ఏర్పాటు చేస్తారు. ఇక ఈ డ్రెస్సింగ్ రూమ్ లో ప్రతి ఆటగాడికి వ్యక్తిగత లాకర్ యూనిట్ ఉంటుంది. ఆ లాకర్ ముందు పేరు లేదా జెర్సీ నెంబర్ డిస్ప్లే చేసేందుకు ఎల్ఈడి నేమ్ ప్లేట్ సిస్టం ఉంది. ఈ లాకర్ లను కలపతో డిజైన్ చేశారు. వీటిలో ప్లేయర్ షూస్, హెల్మెట్, గ్లౌవ్స్ కోసం ప్రత్యేక సెల్ఫ్ లు ఉన్నాయి. ఇక మధ్యలో సెంటర్ సోఫా సెటప్ ని ఏర్పాటు చేశారు. ఇది బ్లాక్ కలర్ థీమ్ లో ఉంది. అలాగే గోడలపై టీం మోటివేషనల్ వాల్ కోట్స్, గదిలో ఓ పెద్ద వీడియో స్రీన్ ని ఏర్పాటు చేశారు.

ఇక డ్రెస్సింగ్ రూమ్ వెనుక భాగంలో ఫిజియో రూమ్ ఉంది. ఇందులో మూడు మసాజ్ బెడ్స్, ఒక ఐస్ బాత్ టబ్, చిన్న హైడ్రోథెరపీ యూనిట్, మెడికల్ క్యాబినెట్, ఫస్ట్ ఎయిడ్ కిడ్స్, డీహైడ్రేషన్ డ్రింక్స్ కి ఓ ఫ్రిడ్జ్ ఉంది. ఈ ఏరియాలో ప్రత్యేకంగా ఫిజియోథెరపిస్టులు వాడే పరికరాలతో నిండి ఉంది. ఇక వాష్ రూమ్ ఏరియాలో ప్రైవేట్ పవర్ క్యూబిక్ లు కూడా ఉన్నాయి. ఇందులోని ప్రతి ఒక్కదానిలో హాట్ లేదా కోల్డ్ వాటర్ కంట్రోల్ ఉంది. వీటితో పాటు డ్రెస్సింగ్ రూమ్ లో చిన్న ప్రొజెక్టర్ సెక్షన్ ఉంది. అలాగే ఓ పెద్ద సౌండ్ సిస్టం కూడా ఉంది. గోడల పై సన్ రైజర్స్ లోగో, హైదరాబాద్ స్కై లైన్ ఆర్ట్ ఉంది. అలాగే డ్రెస్సింగ్ రూమ్ లో ఆటగాళ్లు మ్యాచ్ గెలిచిన తర్వాత సెలబ్రేషన్స్ చేసుకునేందుకు, ప్లేయర్ అవార్డ్స్ ప్రజెంటేషన్ చేసుకునేందుకు కూడా విశాలమైన స్థలం ఈ వీడియోలో కనిపిస్తుంది.

Also Read: SL vs PAK 2025: చేత‌కానీ దద్ద‌మ్మ‌లు…ఇండియాపై గెలవ‌డం చేత‌కాదు, కానీ శ్రీలంక చీల్చిచెండాడిన పాక్‌

మొత్తంగా రెండు డ్రెస్సింగ్ రూమ్ లు ఉన్నాయి. ఇందులో ఒకటి హోమ్ డ్రెస్సింగ్ రూమ్, మరో డ్రెస్సింగ్ రూమ్ లో విజిటింగ్ టీం ఉంటుంది. డ్రెస్సింగ్ రూమ్ పక్కన క్రికెట్ మ్యూజియం ఉంటుంది. ఇందులో మాజీ ఆటగాళ్లు, హైదరాబాద్ కి చెందిన క్రికెటర్ల ఫోటోలు గోడలపై కనిపిస్తాయి. అలాగే ఉమెన్స్ క్రికెటర్స్ కి సంబంధించిన ఫోటోలు కూడా ఈ మ్యూజియంలో కనిపిస్తాయి. ఇక డ్రెస్సింగ్ రూమ్ నుంచి బయటకు వస్తున్న సమయంలో కుడి చేతి వైపు ఒక గంట {BELL} ఉంది. ఇలా హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం లోని డ్రెస్సింగ్ రూమ్ కి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Related News

Jos Buttler: న‌న్ను నంబ‌ర్ 4లో పంపి, ఆశిష్ నెహ్రానే స‌ర్వ నాశ‌నం చేశాడు !

బాబ‌ర్ పై ట్రోల్స్‌..ఇండియ‌న్స్ అనుకుని, ఆస్ట్రేలియా ఫ్యాన్స్ ను అరెస్ట్ చేసిన పాక్ !

మైదానంలోనే స్మోకింగ్..మ‌రో వివాదంలో టిమ్ డేవిడ్, ఇక ప‌ర్మినెంట్ బ్యాన్ !

టీమిండియాకు బిగ్ షాక్‌..బంగ్లాదేశ్ లోనే ఆసియా కప్ 2027, షెడ్యూల్ ఇదే

ఎలిమినేట‌ర్ లో ఓడిపోయిన‌ SRHకు ఊపిరిపోసిన పాకిస్తాన్ ప్లేయ‌ర్

రెండోసారి ఛాంపియ‌న్ గా RCB..ప్ర‌మాదంలో సూర్య‌, శ్రేయ‌స్ అయ్య‌ర్ భ‌విష్య‌త్తు !

Tanveer Ahmed: విరాట్ కోహ్లీ మ‌గాడైతే, పాకిస్తాన్ పిచ్ ల‌పై ఆడి చూపించాలి

లాహోర్ గ‌డ్డ‌పై విరాట్ కోహ్లీ ప్లకార్డులు…గూస్ బంప్స్ రావాల్సిందే

Big Stories

×