E-Paper
Advertisement

శశాంక్ సింగ్ క్యాచ్ లు కాదు, చేప‌లు ప‌డుతున్నాడు..ర్యాగింగ్ చేసిన అర్ష్​ దీప్ సింగ్

శశాంక్ సింగ్ క్యాచ్ లు కాదు, చేప‌లు ప‌డుతున్నాడు..ర్యాగింగ్ చేసిన అర్ష్​ దీప్ సింగ్
Advertisement

Shashank Singh catch drop:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament) చాలా ఉత్కంఠ భరితంగా సాగుతున్న సంగతి తెలిసిందే. ఈ టోర్నమెంట్ లో ఇప్పటికే 40 పైగా మ్యాచులు పూర్తయ్యాయి. మరో 25% మ్యాచులు ఫినిష్ అయితే టోర్నమెంట్ కూడా ముగుస్తుంది. ఇలాంటి నేపథ్యంలో నిన్న సన్రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ ( Sunrisers Hyderabad vs Punjab Kings) మధ్య కీలక మ్యాచ్ జరిగింది. ఇందులో అద్భుతంగా రాణించిన సన్ రైజర్స్ హైదరాబాద్ 33 పరుగుల తేడాతో విజయాన్ని నమోదు చేసుకుంది. ఈ విక్టరీతో పాయింట్ల పట్టికలో కూడా స‌న్ రైజ‌ర్స్‌ హైదరాబాద్ మొదటి స్థానానికి చేరుకోవడం గమనార్హం. అటు పంజాబ్ కింగ్స్ మొద‌టి స్థానం నుంచి రెండో ప్లేస్ కు షిఫ్ట్ అయింది.

Also Read: Alastair Cook: IPL ఓన‌ర్ల‌కు ప్లేయ‌ర్లు భ‌య‌ప‌డుతూ బ‌తుకుతున్నారు, టార్చ‌ర్ అనుభ‌విస్తున్నారు Alastair Cook !

పంజాబ్ కింగ్స్ లో విల‌న్ లా మారిన శశాంక్ సింగ్

Advertisement

సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ ఓడిపోవడానికి ముఖ్య కారణం ఆ జట్టుకు సంబంధించిన చెత్త ఫీల్డింగ్. స‌న్ రైజ‌ర్స్‌ హైదరాబాద్ ఆటగాళ్లు ఇచ్చిన మంచి క్యాచులను నేల పాలు చేశారు పంజాబ్ కింగ్స్ ఆటగాళ్లు. మొత్తం నాలుగు అవకాశాలు వస్తే, ఒక్కటి కూడా సద్వినియోగం చేసుకోలేదు పంజాబ్ కింగ్స్. ఈ క్రమంలోనే స‌న్ రైజ‌ర్స్‌ హైదరాబాద్ అవలీలగా విజయం సాధించింది.

ముఖ్యంగా శశాంక్ సింగ్.. ప్రతి మ్యాచ్ లో కీలక క్యాచ్ లను వదిలేస్తున్నాడు. పంజాబ్ కింగ్స్ హెడ్ కోచ్ రికీ పాంటింగ్ ఎన్నిసార్లు వార్నింగ్ ఇచ్చినా కూడా శశాంక్ సింగ్ లో మార్పు రావడం లేదు. నిన్ననైతే హైదరాబాద్ ఓనర్ కావ్య పాపకు అమ్ముడుపోయినట్లుగానే శశాంక్ సింగ్ వ్యవహరించాడు. నిన్న‌టి మ్యాచ్ లో కూప‌ర్‌, ఫెర్గ్యూస‌న్‌, శ‌శాంక్ సింగ్ ముగ్గురు మూడు క్యాచ్ లు వ‌దిలేశారు. అటు ఇషాన్ కిష‌న్ ను స్టంప్ ఔట్ చేసే, అవ‌కాశం వ‌చ్చిన‌ప్ప‌టికీ ప్ర‌భ్ సిమ్రాన్ సింగ్ చేజేతులా వ‌దిలేశాడు. ఈ క్ర‌మంలోనే హెన్రిచ్ క్లాసెన్‌, ఇషాన్ కిష‌న్ ఇద్ద‌రూ అర్ధ సెంచ‌రీలు చేసి రెచ్చిపోయారు. దీని ఫ‌లితంగా పంజాబ్ కింగ్స్ ఓట‌మి అయింది.

శశాంక్ సింగ్ క్యాచ్ లు కాదు, చేప‌లు ప‌డుతున్నాడు

Advertisement

సన్రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ సందర్భంగా క్యాచ్ వదిలివేసిన శశాంక్ సింగ్ ను దారుణంగా ట్రోల్ చేశాడు అర్ష్ దీప్ సింగ్. హైదరాబాద్ లో మ్యాచ్ ఫినిష్ అయిన తర్వాత తిరుగు ప్రయాణమైంది పంజాబ్ కింగ్స్. ఈ క్రమంలో విమానాశ్రయంలో శశాంక్ సింగ్ నిద్రపోయాడు. నిద్ర పోయిన శశాంక్ సింగ్ ను వీడియో తీస్తూ, ర్యాగింగ్ చేశాడు అర్ష్ దీప్ సింగ్. వీడు విమానాశ్రయంలో.. అటు స్టేడియంలో నిద్రపోతాడు అన్న అర్థం వచ్చేలా రీల్ తీసి వైరల్ చేశాడు. దీంతో ఈ వీడియో కాస్త వైరల్ గా మారింది. ఈ క్రమంలో శశాంక్ సింగ్ పై దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు పంజాబ్ కింగ్స్ అభిమానులు. క్యాచ్ లు వదిలి వేస్తున్న శశాంక్ సింగ్ ను బయటకు నెట్టండి అంటూ డిమాండ్ చేస్తున్నారు.

 

Also Read: Hasin Jahan: షమీ కుటుంబంలో అంద‌రూ దొంగ‌లే..పెళ్లి చేసుకుంటాన‌ని మోసం, ప్రెగ్నెంట్ అయ్యాక !

 

 

 

Related News

విండీస్, టీమిండియా మ్యాచ్ రద్దు… వ‌ర్షం ప‌డి బ‌తికిపోయారంటూ తన్వీర్ అహ్మద్ కామెంట్!

పాకిస్తాన్ జట్టులో ప్రకంపనలు..కోచ్ మైక్ హెసన్ కాలర్ పట్టుకున్న షాహీన్ అఫ్రిది

ముస్లిం క్రికెట‌ర్ల‌కు టీమిండియాలో ఛాన్స్ ఇవ్వ‌రు కానీ పాకిస్తాన్ వ‌చ్చేయ్ !

ఇస్లామాబాద్ లో హై టెన్ష‌న్‌…ఇంగ్లాండ్ క్రికెట‌ర్లు బ‌స చేస్తున్న హోట‌ల్ ద‌గ్గ‌ర భారీ బ్లాస్ట్ !

ప్రీతి జింటా లాగా సొట్ట బుగ్గలేసుకుని, వీడేం వికెట్ కీపింగ్ చేస్తాడురా నాయ‌నా ?

పాకిస్తాన్ అంటేనే ఎగిరెగిరి ప‌డ‌తారు, కానీ సిగ్గు లేకుండా మాతో మ్యాచ్ లు ఆడ‌తారు!

ద‌రిద్రుడు అగార్క‌ర్ పోయినా రాత మార‌లేదే…ష‌మీ, భువీల‌ను న‌ట్టేట ముంచారు క‌ద‌రా?

విండీస్ పై చివ‌రి మ్యాచ్ ఆడేశాడు…ఇక ర‌వీంద్ర జ‌డేజా రిటైర్మెంట్ ఇవ్వాల్సిందే

Big Stories

Advertisement
×