Alastair Cook: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament) చాలా ఉత్కంఠ భరితంగా సాగుతున్న సంగతి తెలిసిందే. ఈ టోర్నమెంట్ లో ఇప్పటికే 75 శాతానికి పైగా మ్యాచ్ లు ఫినిష్ అయ్యాయి. మే 31వ తేదీ లోపు టోర్నమెంట్ కూడా ఫినిష్ అవుతుంది. అయితే ఇలాంటి క్రమంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ పైన మరోసారి ఇంగ్లాండ్ మాజీ ఆటగాడు అలిస్టర్ కుక్ ( Alastair Cook) వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్ టోర్నమెంట్ లో ఓనర్లను చూసి ప్లేయర్లు గజ గజ వణికి పోతారని… బాంబు పేల్చారు. ఓనర్ల మెప్పు కోసం డబ్బా కొట్టుకుంటూ ప్లేయర్లు టార్చర్ అనుభవిస్తున్నట్లు షాకింగ్ ఆరోపణలు చేశారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ ( Indian Premier League ) గొప్ప లీగ్ అంటూనే.. గొయ్యి తగ్గాడు అలిస్టర్ కుక్. దీంతో అలిస్టర్ కుక్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. దీనికి ఇండియన్ ఫాన్స్ కూడా కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. చేతకానీ వెధవలు అందరూ ఇలాంటి కామెంట్స్ చేస్తూనే ఉంటారని చురకలు అంటిస్తున్నారు.
Also Read: Tanveer Ahmed: బాబర్ ఒక్క టైటిల్ గెలిస్తే, కోహ్లీ మాత్రం కెప్టెన్సీ కోసం బిచ్చగాడిలా మారాడు Tanveer Ahmed
ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ పైన అలిస్టర్ కుక్ ( Alastair Cook) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. చాలా రోజుల నుంచి ఐపీఎల్ గురించి వింటున్నాను.. చాలా మంది దీని గురించి డబ్బా కొట్టారు.. కానీ నాకు మాత్రం అయితే ఇలా ఉంటే అసలు ఇష్టం ఉండదు అంటూ బాంబు పేల్చారు. ఐపీఎల్ టోర్నమెంట్ కు సంబంధించిన ఫ్రాంచైజీ ఓనర్లను సంతృప్తి చేసేందుకు ప్లేయర్లు చాలా కష్టపడాల్సి ఉంటుందని వెల్లడించారు. ఓనర్ల గురించి డబ్బా కొడితేనే, తర్వాతి సీజన్ లో కాంట్రాక్టు దక్కుతుందని ప్లేయర్లు అభద్రత భావంతో ఉంటారని షాకింగ్ ఆరోపణలు చేశారు అలిస్టర్ కుక్. నిత్యం ఐపిఎల్ ఓనర్లను ప్లేయర్లు సంతృప్తి పరచాల్సిందేనని తెలిపారు. ఓనర్లను చూసి భయపడాల్సిందేనని.. ప్రెస్ మీట్ ఎక్కడ జరిగిన ఐపీఎల్ గురించి డబ్బా కొట్టుకోవాలని కామెంట్స్ చేశారు.
వారం రోజుల కిందట రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఆటగాడు జాకబ్ బెతెల్ గురించి అలిస్టర్ కుక్ ( Alastair Cook) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అతనికి బెంగళూరు జట్టులో ఛాన్స్ రావడం లేదని.. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్ కు వచ్చి కౌంటింగ్ క్రికెట్ ఆడుకోవాలని సూచనలు చేశారు. రిజర్వ్ బెంచ్ లో కూర్చుంటే ఏమీ రాదని ఫైర్ అయ్యారు. దీనికి కెవిన్ పీటర్సన్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఐపీఎల్ గురించి అలిస్టర్ కుక్ కు జీరో నాలెడ్జ్ అంటూ ఫైర్ అయ్యారు. ఐపీఎల్ లో రిజర్వు బెంచ్ లో కూర్చున్నా కూడా మంచి అనుభవం వస్తుందని ఈ వ్యాఖ్యానించారు పీటర్సన్. ఈ క్రమంలోనే తాజాగా ఐపీఎల్ ఓనర్లను ప్లేయర్లు మెచ్చుకుంటూ నరకం అనుభవిస్తున్నారని పీటర్సన్ కు కౌంటర్ ఇచ్చారు అలిస్టర్ కుక్.
Alastair Cook: Players Won’t Criticize IPL Openly Due to Contracts
He said, “Now, I don’t know what the IPL is like quite clearly, but you hear some of the little undercurrents like it’s not quite as good as everyone thinks it is. I’m not slagging off the IPL – no one ever is… pic.twitter.com/6JEOq0xt1O
— Vipin Tiwari (@Vipintiwari952) May 6, 2026