Shoaib Akhtar: బంగ్లాదేశ్ వర్సెస్ పాకిస్తాన్ (Bangladesh vs Pakistan) మధ్య తొలి టెస్ట్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఢాఖలోని షేర్ బంగ్లా నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరుగుతోంది. నాలుగు రోజుల కిందట ప్రారంభమైన ఈ మ్యాచ్ లో బంగ్లాదేశ్ పై చేయి సాధిస్తోంది. వర్షం పదే పదే అడ్డు తగిలినా.. మ్యాచ్ మాత్రం కొనసాగుతూనే ఉంది. అయితే ఈ నేపథ్యంలో పాకిస్తాన్ టెస్ట్ కెప్టెన్ షాన్ మసూద్ పైన షోయబ్ అక్తర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బంగ్లాదేశ్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య తొలి టెస్ట్ జరుగుతున్న సంగతి తెలిసిందే. షాన్ మసూద్ (Shan Masood) కెప్టెన్ గా పనికిరాడు..వాడి మాట ఎవడూ వినడం లేదని విమర్శలు చేశారు. అనవసరంగా షాన్ మసూద్ ను కెప్టెన్ చేశారని ఆగ్రహించారు షోయబ్ అక్తర్ (Shoaib Akhtar).
Also Read: Yuvraj Singh Yuvraj Singh : స్టేజ్ పైనే మలయాళ నటితో యువరాజ్ రొమాన్స్..ఇంతకు ఎవరీ నవ్య నాయర్ ?
బంగ్లాదేశ్ వర్సెస్ పాకిస్తాన్ (Bangladesh vs Pakistan, 1st Test,) మధ్య తొలి టెస్ట్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ టెస్ట్ నేపథ్యంలో పాకిస్తాన్ కెప్టెన్ గా షాన్ మసూద్ వ్యవహరిస్తున్నాడు. అయితే అతని కెప్టెన్సీ పైన తాజాగా పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. షాన్ మసూద్ వ్యక్తిగా మంచి వాడని.. కానీ కెప్టెన్ గా విఫలమయ్యాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. కెప్టెన్ స్థాయి ఆటను షాన్ మసూద్ ( Shan MAsood) ప్రదర్శించడం లేదని ఫైర్ అయ్యారు. పాకిస్తాన్ టెస్ట్ కెప్టెన్ గా అతడు పనికిరాడు అని విమర్శలు చేశారు. షాన్ మసూద్ ను కెప్టెన్ చేసిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డుపై మండిపడ్డారు. చేతకాని దద్దమ్మలను కెప్టెన్ చేస్తే పాకిస్తాన్ ఎక్కడ గెలుస్తుందని నిలదీశారు.
షాన్ మసూద్ కెప్టెన్ గా పనికి వస్తాడు కావచ్చు… కానీ టెస్టులకు మాత్రం అస్సలు సరిపోడని విమర్శలు చేశారు. నాయకత్వ లక్షణాలు అతనికి లేవని చురకలు అంటించారు. షాన్ మసూద్ నేతృత్వంలో పాకిస్తాన్ వరుసగా టెస్ట్ మ్యాచ్ లు ఓడిపోతుందని అసహనం వ్యక్తం చేశారు. ఇది ఇలా ఉండగా బంగ్లాదేశ్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ ఉత్కంఠ భరితంగా సాగుతోంది. ఇందులో మొదటి ఇన్నింగ్స్ లో బంగ్లాదేశ్ 413 పరుగులు సాధించింది. అటు పాకిస్తాన్ మొదటి ఇన్నింగ్స్ లో 386 పరుగులకు ఆల్ అవుట్ అయింది. ప్రస్తుతం రెండో ఇన్నింగ్స్ బంగ్లాదేశ్ ఆడుతోంది. మూడు వికెట్ల నష్టానికి 152 పరుగులు సాధించింది బంగ్లాదేశ్. ఇక ఈ మ్యాచ్ లో ఒకే రోజు మిగిలి ఉన్న తరుణంలో మ్యాచ్ డ్రా అవుతుందని అంటున్నారు.
🚨Shoaib Akhtar on Shan Masood’s captaincy 🗣️
They’ve completely ignored merit. He’s fine as a captain, but honestly, on the field he doesn’t bring much impact. It feels like he was chosen more for being a good person than for leadership performance. pic.twitter.com/1d7537Lxuz
— Talha Nawaz (@TalhaDigital007) May 11, 2026