E-Paper
Advertisement

నా చేత‌కాని త‌నం వ‌ల్లే.. ఆ క్యాచ్ నేల పాలైంది – మాలిక్

నా చేత‌కాని త‌నం వ‌ల్లే.. ఆ క్యాచ్ నేల పాలైంది – మాలిక్
Advertisement

Shoaib Malik About Catch Miss: పాకిస్తాన్ క్రికెట్ జట్టు (Pakistan cricket team) గురించి సోషల్ మీడియాలో రక రకాల పోస్టులు వైరల్ అవుతూ ఉంటాయి. ఆ జట్టు బ్యాటింగ్ ఆర్డర్ లేదా ఫీలింగ్ గురించి దారుణంగా పోస్టులు పెడుతూ ఉంటారు. ముఖ్యంగా షోయబ్ మాలిక్ (Shoaib Malik), స‌యీద్ అజ్మల్ ( Saeed Ajmal) ఇద్దరూ మిస్ చేసిన ఓ క్యాచ్ ఇప్పటికీ వైరల్ అవుతూనే ఉంటుంది. ఈ ఒక్క ఇన్సిడెంట్ ను చూపించి పాకిస్తాన్ క్రికెట్ జట్టు సభ్యులంతా చెత్త ఫీల్డర్లే అనే స్టేట్మెంట్ ఇస్తూ ఉంటారు. అంతలా మాలిక్, అజ్మల్ మిస్ చేసిన క్యాచ్ వైరల్ అయింది. అయితే ఈ ఇన్సిడెంట్ పై తాజాగా స్వయంగా షోయబ్ మాలిక్ స్పందించారు. త‌న‌ చేత‌కాని త‌నం వ‌ల్లే.. ఆ క్యాచ్ నేల పాలైందంటూ మాలిక్ బాంబ్ పేల్చారు. ఇందులో స‌యీద్ అజ్మ‌ల్ త‌ప్పిదం ఏం లేదంటూ క్లారిటీ ఇచ్చారు.

నా చేత‌కాని త‌నం వ‌ల్లే.. ఆ క్యాచ్ నేల పాలైంది – మాలిక్

పాకిస్తాన్ వర్సెస్ వెస్టిండీస్ మధ్య జరిగిన మ్యాచ్ సందర్భంగా క్రిస్ గేల్ భయంకరమైన షాట్ ఆడాడు. అయితే బంతి ఎడ్జ్ కు తగిలి పైకి లేచింది. ఆ సమయంలో ఫీల్డింగ్ చేస్తున్న షోయబ్ మాలిక్, స‌యీద్ అజ్మల్ ఆ క్యాచ్ కోసం ప్రయత్నించారు. కానీ ఇద్దరి మధ్య బంతి నేలపాలైంది. ఈ సంఘటనపై తాజాగా షోయబ్ మాలిక్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ క్యాచ్ మిస్ కావడంలో తప్పంతా తనదేనని బాంబు పేల్చారు. బంతి గాల్లోకి లేచినప్పుడు.. నేను పట్టుకుంటానని గట్టిగా అరవక పోవడం కారణంగానే పెద్ద తప్పిదం జరిగిందని మాలిక్ కీలక వ్యాఖ్యలు చేశారు.

Advertisement

Tanveer Ahmed On IND VS PAK: అదరగొట్టిన ఇండియా, పాకిస్తాన్ మరో ఘోర ఓటమి…ఫిక్సింగ్ చేశారంటూ త‌న్వీర్ ఆరోప‌ణ‌లు

గేల్ కొట్టిన బంతి కిందకు వస్తున్న సమయంలో అజ్మల్ కింద కూర్చొని తన చేతులను ఒక పువ్వు ఆకారంలో పెట్టడని మాలిక్ చెప్పుకొచ్చాడు. ఆ పొజిషన్ చూసి అజ్మల్ చాలా సులువుగా క్యాచ్ పడతాడని తాను భావించినట్లు వివరించారు. దాంతో తానే క్యాచ్ పట్టకుండా వెనక్కి వెళ్ళానని పేర్కొన్నారు. కానీ చివరి క్షణంలో బంతి అజ్మల్ చేతులకు దూరంగా వెళ్లి పడినట్లు చెప్పుకొచ్చారు.

Advertisement

ఆ తర్వాత షోయబ్ మాలిక్ ను అజ్మల్ కూడా నిలదీశాడట. క్యాచ్ పట్టడానికి సిద్ధంగా ఉన్నప్పుడు… చివరికి నిమిషంలో చేతులు ఎందుకు వెనక్కి తీసుకున్నావ్ అని అజ్మల్ ప్రశ్నించినట్లు మాలిక్ తెలిపారు. ఇక ఆ తప్పిదాన్ని అప్పుడే తాను ఒప్పుకున్నానని.. కానీ ఇప్పటికీ సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారని సీరియస్ అయ్యారు. ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు ఇలాంటి సంఘటనలు చాలా కామన్ అని వ్యాఖ్యానించారు. ఇదే సంఘ‌ట‌న టీమిండియాతో జ‌రిగి ఉంటే, మ‌మ్మ‌ల్ని మ‌రింత ట్రోల్ చేసేవార‌ని తెలిపారు.

PCB confiscate mobile phones of Pakistan cricketers : పాకిస్తాన్ జ‌ట్టులో పెను ప్ర‌కంప‌న‌లు…ప్లేయ‌ర్ల మొబైల్ ఫోన్లను లాగేసుకున్న PCB

 

?utm_source=ig_web_copy_link&stkn=NTc4MTIwNjQ2YQ==

 

Related News

పాకిస్తాన్ జ‌ట్టు నుంచి పిలుపు..అంత‌లోనే ఫోన్ స్విచ్ ఆఫ్, పాస్ పోర్టు లేదు..కానీ కట్ చేస్తే

శార్దుల్ ఠాకూర్ కు బౌలింగ్ వ‌ద్ద‌ని మొత్తుకున్నా ధోని విన‌లేదు – హ‌ర్భ‌జ‌న్

వైభ‌వ్ సూర్య‌వంశీ మాములోడు కాదు.. లిఫ్ట్ లోనే అమ్మాయితో రొమాన్స్ ?

మ‌రో అమ్మాయితో శ్రేయాస్ అయ్య‌ర్ రిలేష‌న్‌..షాకింగ్ వీడియో వైర‌ల్

ఫైన‌ల్స్ లో చివ‌రి ఓవ‌ర్ వేయాల‌ని ధోని టార్చ‌ర్ చేశాడు

బీసీసీఐ డ‌బ్బుల‌తో కులుకుతూ, లండ‌న్ జ‌ల్సాలు..కోహ్లీపై కైఫ్ సీరియ‌స్‌

పాక్ డ్రెస్సింగ్ రూంలో టీమిండియా క్రికెట‌ర్లు న‌మాజ్ చేసేవాళ్లు !

Big Stories

Advertisement
×