E-Paper
Advertisement

పాకిస్తాన్ జ‌ట్టులో పెను ప్ర‌కంప‌న‌లు…ప్లేయ‌ర్ల మొబైల్ ఫోన్లను లాగేసుకున్న PCB

పాకిస్తాన్ జ‌ట్టులో పెను ప్ర‌కంప‌న‌లు…ప్లేయ‌ర్ల మొబైల్ ఫోన్లను లాగేసుకున్న PCB
Advertisement

PCB confiscate mobile phones of Pakistan cricketers :  ఇంగ్లాండ్ గడ్డపై ( England) దారుణంగా ఓడిపోయిన పాకిస్తాన్ క్రికెట్ జట్టులో కీలక మార్పులు జరుగుతున్నాయి. రెండు టెస్టుల్లో వరుసగా ఓడిపోయిన క్రమంలో సిరీస్ ను పాకిస్తాన్ కోల్పోయింది. ఇప్పుడు ఇంగ్లాండ్ చేతిలో వైట్ వాష్ ప్రమాదాన్ని కొని తెచ్చుకుంది పాకిస్తాన్ క్రికెట్ జట్టు. ఇలాంటి క్రమంలో పాకిస్తాన్ క్రికెట్ జట్టులో మరోసారి పెను ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. తాజాగా పాకిస్తాన్ క్రికెటర్ల మొబైల్స్ PCB లాగేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. కొంతమంది సీనియర్ క్రికెటర్లకు సంబంధించిన మొబైల్స్ తీసుకొని ఇప్పటికే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు విచారణ కూడా మొదలుపెట్టిందని అంటున్నారు. ఈ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

పాకిస్తాన్ జ‌ట్టులో ప్ర‌కంప‌న‌లు..ప్లేయ‌ర్ల ఫోన్లను లాగేసుకున్న PCB

ఇంగ్లాండ్ గడ్డపై పాకిస్తాన్ పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. మూడు టెస్టుల సిరీస్ లో భాగంగా ఇంగ్లాండ్ కు వెళ్లిన పాకిస్తాన్ కు ఘోర అవమానం ఎదురైంది. ఈ టోర్నమెంట్లో ఇప్పటికే రెండు టెస్టులు ఓడిపోయిన పాకిస్తాన్ సిరీస్ కోల్పోయింది. మూడో టెస్టు ఎడ్జ్ బస్టన్ వేదికగా సెప్టెంబర్ 9వ తేదీన ప్రారంభం కానుంది. అయితే ఈ టెస్ట్ ప్రారంభం కంటే ముందే పాకిస్తాన్ జట్టులో కీలక పరిణామం చోటు చేసుకుంది. పాకిస్తాన్ ప్లేయర్లకు సంబంధించిన మొబైల్స్ అన్నీ కూడా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు యాజమాన్యం లాగేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ న్యూస్ ను పాకిస్తాన్ దేశానికి చెందిన ఓ ప్రముఖ ఛానల్ లో ప్రత్యేక కథనంగా ప్రచూరించింది.

Advertisement

Tanveer Ahmed cooked Pakistan cricket team: బాబ‌ర్ లేక‌పోతే ఇంత దారుణంగా ఓడిపోతారా ? ఇక అంద‌రూ వెళ్లి బావిలో దూకండి

పాకిస్తాన్ ప్లేయర్ల మొబైల్స్ లాగేసుకొని.. ఓ విషయంపై పీసీబీ అధికారులు విచారణ చేపడుతున్నారట. అయితే.. ఏ విషయంపై మొబైల్స్ లాగేసుకున్నారు అనే దాని పైన మాత్రం క్లారిటీ లేదు. మొబైల్స్ మాత్రం తీసుకున్నది వాస్తవమేనని తెలుస్తోంది. దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. అయితే ఈ న్యూస్ బయటకు వచ్చిన నేపథ్యంలో రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి.

Advertisement

ఇంగ్లాండ్ చేతిలో కావాలనే ఓడిపోయేలా పాకిస్తాన్ ప్లేయర్లు ( Pakistan Players) అమ్ముడుపోయారని… మొబైల్ ఫోన్స్ ( Mobile phones) ద్వారా ఫిక్సింగ్ జరిగి ఉంటుందని కొంతమంది అంటున్నారు. అందుకే అనుమానం వచ్చిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు… మొబైల్స్ లాగేసుకున్నట్లు చెబుతున్నారు. కాగా ఇప్పటికే రెండు టెస్టులు ఓడిపోయిన కోపంతో ఉన్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు… ఏకంగా ఏడు మంది క్రికెటర్ల పై వేటు వేసింది. ఏడుగురు క్రికెటర్లను స్వదేశానికి మళ్లీ రప్పించింది. వాళ్ల స్థానంలో కొత్త వాళ్లను ఇంగ్లాండ్ కు పంపింది. ఇద్దరు కోర్సులపై కూడా వేటు వేసింది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు.

Nasser Hussain slams Mohammad Rizwan: ఒరేయ్ మెంట‌లోడా..టెయిలెండర్స్ కు బ్యాటింగ్ అప్ప‌గించి, చేతులు దులుపుకుంటావా ? రిజ్వాన్ పై విమ‌ర్శ‌లుPCB confiscate mobile phones of Pakistan cricketers

Related News

అదరగొట్టిన ఇండియా, పాకిస్తాన్ మరో ఘోర ఓటమి…ఫిక్సింగ్ చేశారంటూ త‌న్వీర్ ఆరోప‌ణ‌లు

55 ప‌రుగుల‌కే పాకిస్తాన్ ఆలౌట్…ఫాతిమా స‌నా పాత వీడియో వైర‌ల్

PCBలో ఆర్థిక సంక్షోభం.. PSL ఆడే ప్లేయ‌ర్ల జీతాలు భారీగా త‌గ్గింపు ?

సచిన్ వికెట్ తీయాలంటే.. ఆ దేవుడిని పూజించాల్సిందే..బ్రెట్ లీ కామెంట్స్ వైరల్

పాకిస్తాన్ జ‌ట్టులో అంద‌రూ క‌ట్టప్ప‌లే..అందుకే సంక‌నాకిపోతున్నారు

టీమిండియా తిక్క కుదరాలంటే, నఖ్వీకి ఐసీసీ చైర్మన్ పదవి ఇవ్వండి..!

వివాదంగా మారిన టీమిండియా జెర్సీ..కాషాయ రంగుపై విమ‌ర్శ‌లు !

Big Stories

Advertisement
×