E-Paper
Advertisement

Shreyas Iyer: ఒకే త‌ర‌హాలోనే శ్రేయ‌స్ అయ్య‌ర్ ఎందుకు ఔట్ అవుతున్నాడు ? బ‌య‌ట‌ప‌డ‌టం ఎలా

Shreyas Iyer: ఒకే త‌ర‌హాలోనే శ్రేయ‌స్ అయ్య‌ర్ ఎందుకు ఔట్ అవుతున్నాడు ? బ‌య‌ట‌ప‌డ‌టం ఎలా
Advertisement

Shreyas Iyer:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ (Indian Premier League 2026 Tournament) నేపథ్యంలో పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) విధానం పై సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వస్తున్నాయి. 2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్ నుంచి మొదలుకొని ఇప్పటి వరకు ఒకే తీరులో శ్రేయస్ అయ్యర్ ఔట్ అయ్యాడు. అయితే అతని వీక్నెస్ తెలుసుకున్న ప్రత్యర్థి బౌలర్లు.. దానికి తగ్గట్టుగానే బంతులు సంధించారు. ఈ క్రమంలోనే నిన్న కెప్టెన్ శ్రేయస్ అయ్యర్… రసిక్ బౌలింగ్ లో గతంలో ఔట్ అయిన విధంగానే వికెట్ సమర్పించుకున్నాడు. శ్రేయ‌స్ అయ్య‌ర్ వికెట్ కోల్పోయిన నేప‌థ్యంలో ప్ర‌తీ మ్యాచ్ పంజాబ్ కింగ్స్ ఓట‌మి పాలైంది.

Also Read: బంగ్లాదేశ్ ప్లేయ‌ర్ల‌కు ఫీల్డింగ్ నేర్పిస్తోన్న రిజ్వాన్‌…కీపింగ్ చేత‌కానోడు ట్రైనింగ్ ఇవ్వ‌డం ఏంటి అంటూ ట్రోల్స్‌

ఒకే త‌ర‌హాలోనే శ్రేయ‌స్ అయ్య‌ర్ ఎందుకు ఔట్ అవుతున్నాడు ?

Advertisement

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ లో భాగంగా నిన్న పంజాబ్ కింగ్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య కీలక మ్యాచ్ జరిగింది. తప్పక గెలవాల్సిన ఈ మ్యాచ్ లో దారుణంగా ఓడిపోయింది పంజాబ్ కింగ్స్. రాయ‌ల్స్ ఛాలెంజ‌ర్స్‌ బెంగళూరు చేతిలో 23 పరుగులు తేడాతో ఓటమిపాలైంది. అయితే ఈ మ్యాచ్ లో శ్రేయస్ అయ్యర్ రసిక్ వేసిన అద్భుతమైన బంతికి జీతేష్ శర్మకు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. గతంలో కూడా ఇదే తరహాలో శ్రేయస్ అయ్యర్ ఔటైన‌ దాఖలాలు ఉన్నాయి. ఒకే రకమైన షాట్లు ఆడి ఔట్ అవుతున్నాడు అయ్యర్. ముఖ్యంగా షార్ట్ బాల్స్, ఒకే విధమైన లైన్ అండ్ లెంగ్త్ వస్తున్న బంతులను ఎదుర్కోవడంలో విఫలమవుతున్నాడు శ్రేయస్ అయ్యర్. కొన్నిసార్లు షార్ట్ డెలివరీ లెగ్ సైడ్ వస్తే, అద్భుతంగా సిక్సర్లు లేదా బౌండరీలు సాధిస్తున్నాడు.

కానీ ఆఫ్ సైడ్ వచ్చిన బంతులను ఎదుర్కోలేక సతమతమవుతున్నాడు. వికెట్లను వదిలేసి శ్రేయస్ అయ్యర్ వాటిని ఎదుర్కోవడం వల్ల క్లీన్ బౌల్డ్, లేదా వికెట్ కీపర్ క్యాచ్ ఇచ్చి ఔట్ కావడం చూస్తున్నాం. కానీ ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవెన్ స్మిత్ కూడా అచ్చం శ్రేయస్ అయ్యర్ లాగే బ్యాటింగ్ చేస్తాడు. కానీ స్టీవ్ స్మిత్ తెలివిగా వికెట్లను కవర్ చేసి బ్యాటింగ్ చేస్తాడు. బంతి ప‌డ‌గానే ఆఫ్ సైడ్ వ‌చ్చేస్తాడు. దానివల్ల ఈ బంతులను అవలీలగా ఎదుర్కొంటాడు. కానీ శ్రేయ‌స్ అయ్యర్ వికెట్లను వదిలి వెనక్కి జరిగే ఆడడం కారణంగా ఔట్ అవుతున్నాడు. ఈ విషయాన్ని గమనించిన బౌలర్లు, శ్రేయస్ అయ్యర్ ను టార్గెట్ చేస్తున్నారు. 2023 ఫైనల్, ఐపీఎల్ 2025 ఫైనల్, ఇక నిన్న బెంగళూరు చేతిలో కూడా అయ్యాడు. ఈ సమస్యను స్టీవ్ స్మిత్ లాగా అధిగమిస్తే, కచ్చితంగా భారీ స్కోర్ సాధించే అవకాశాలు ఉంటాయి. అతనిలాగా శ్రేయస్ అయ్యర్ ఆడాలని ఫ్యాన్స్ కోరుతున్నారు.

Advertisement

Also Read: Tanveer Ahmed: ఫాతిమా సనా లాగా 15 బంతుల్లో కోహ్లీ 50 ప‌రుగులు చేస్తే, న‌*గ్నంగా తిరుగుతా !Indian Premier League 2026 Tournament

 

 

 

 

Related News

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

గంభీర్ వెనక కోహ్లీ కుప్పిగంతులు..అస‌భ్యక‌రంగా చేతులు చూపిస్తూ డ్యాన్స్

లార్ట్స్ మైదానంలో ఈ గంట కొట్ట‌డానికి కార‌ణం ఏంటి? దీని వెనుక ఉన్న‌ర‌హ‌స్యం

Big Stories

Advertisement
×