E-Paper
Advertisement

టాటా మెగా ప్లాన్.. మూడు కళ్లు చెదిరే ప్రీమియం ఎలక్ట్రిక్ కార్లు వచ్చేస్తున్నాయ్!

టాటా మెగా ప్లాన్.. మూడు కళ్లు చెదిరే ప్రీమియం ఎలక్ట్రిక్ కార్లు వచ్చేస్తున్నాయ్!
Advertisement

Tata’s Upcoming Premium EVs 2026: ఇండియన్ ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్‌ లో టాటా మోటార్స్ ఇప్పటికే టాప్ లో కొనసాగుతోంది. అయినప్పటికీ, ఈ కంపెనీ మరింత పెద్ద ప్లాన్‌ తో ముందుకు వస్తోంది. ఈ ఏడాది ఎండింగ్ లో  మూడు కొత్త ప్రీమియం ఎలక్ట్రిక్ కార్లను మార్కెట్లోకి తీసుకురావాలని భావిస్తోంది. ఇందులో రెండు టాటా బ్రాండ్ కింద రానుండగా, మరో కొత్త ఈవీ స్పెషల్ అవిన్యా బ్రాండ్ కింద విడుదలయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే టాటా నెక్సాన్ EV, పంచ్ EV, కర్వ్ EV, హారియర్ EV లాంటి మోడళ్లతో మార్కెట్లో బలమైన స్థానం సంపాదించింది. ఇప్పుడు కొత్త ప్రీమియం సెగ్మెంట్‌ పై దృష్టి పెట్టిన కంపెనీ, ఎక్కువ రేంజ్, లేటెస్ట్ టెక్నాలజీ, లగ్జరీ ఫీచర్లతో కొత్త కార్లను తీసుకురానుంది.

⦿ టాటా సియెర్రా EV

ఈ కారు జూలై నుంచి సెప్టెంబర్ మధ్యలో విడుదలయ్యే అవకాశం ఉంది. మిడ్ సైజ్ ఎలక్ట్రిక్ SUVగా రానుంది. ఇప్పటికే ప్రదర్శించిన కొత్త సియెర్రా డిజైన్ ఆధారంగానే దీన్ని తయారు చేస్తున్నారు. ICE మోడల్‌ తో పోలిస్తే డిజైన్‌ లో పెద్దగా మార్పులు ఉండకపోయినా, ముందు భాగంలో కొంత కొత్త లుక్ ఇవ్వనున్నారు. సియెర్రా EVలో బాడీ కలర్ ఫ్రంట్ గ్రిల్, పూర్తి వెడల్పులో DRL లైట్లు, క్లీనర్ ఫ్రంట్ డిజైన్ లాంటి మార్పులు ఉండనున్నాయి. ఇంటీరియర్‌ లో కూడా లేటెస్ట్ డిజిటల్ ఫీచర్లు, ప్రత్యేకమైన డాష్‌ బోర్డ్ ఫంక్షన్లు ఇవ్వనున్నారు. ఫ్రంక్ స్టోరేజ్, బై డైరెక్షనల్ ఛార్జింగ్ లాంటి ఫీచర్లు కూడా ఉండనున్నాయి. ఈ SUV సింగిల్ మోటార్ రియర్ వీల్ డ్రైవ్, డ్యూయల్ మోటార్ ఆల్ వీల్ డ్రైవ్ వేరియంట్లలో రానుందని సమాచారం. ఒక్కసారి ఛార్జ్ చేస్తే సుమారు 600 కిలోమీటర్ల వరకు రేంజ్ అందించే అవకాశం ఉందని కంపెనీ వెల్లడించింది.

⦿ టాటా సఫారీ EV

Advertisement

అక్టోబర్ చివర్లో టాటా సఫారీ EV మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్న సఫారీ SUVకి పూర్తి ఎలక్ట్రిక్ వెర్షన్‌ గా రానుంది. డిజైన్ పరంగా చిన్న మార్పులు మాత్రమే ఉండనున్నాయి. క్లోజ్డ్ గ్రిల్, కొత్త అల్లాయ్ వీల్స్, ఏరోడైనమిక్ డిజైన్ ఉంటుంది. ఇంటీరియర్‌ లో కొత్త సాఫ్ట్‌ వేర్‌ తో కూడిన డిజిటల్ డిస్‌ ప్లేలు, ఆధునిక కనెక్టెడ్ ఫీచర్లు అందించే అవకాశం ఉంది. ఈ మోడల్‌ లో కూడా ఫ్రంక్, బై డైరెక్షనల్ ఛార్జింగ్ లాంటి ఫీచర్లు ఉంటాయని భావిస్తున్నారు. సఫారీ EVలో 65kWh, 75kWh బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లు ఉంటాయని భావిస్తున్నారు. సింగిల్ మోటార్, డ్యూయల్ మోటార్ వేరియంట్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఒకసారి పూర్తి ఛార్జ్ చేస్తే సుమారు 600 కిలోమీటర్ల వరకు ప్రయాణించే సామర్థ్యం ఉండొచ్చని సమాచారం.

⦿ కొత్త అవిన్యా EV

ఇక డిసెంబర్‌లో టాటా కొత్త అవినయ బ్రాండ్ కింద తొలి ప్రీమియం EVని విడుదలయ్యే అవకాశం ఉంది. పూర్తిగా కొత్త డిజైన్‌ తో రూపొందించిన స్పోర్ట్‌ బ్యాక్ మోడల్‌ గా ఉండనుంది. ఈ కారు ప్యూచరిస్టిక్ తరహా డిజైన్, మినిమలిస్ట్ ఇంటీరియర్, అధునాతన టెక్నాలజీతో రానుంది. అవిన్యా EV సుమారు 700 కిలోమీటర్ల వరకు రేంజ్ అందించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ మోడల్‌ తో టాటా మరింత ప్రీమియం EV సెగ్మెంట్‌ లోకి అడుగుపెట్టనుంది.

Advertisement

Read Also: ఒకే ఛార్జ్‌ తో 240 కిమీ రేంజ్.. భారత్‌లో అత్యధిక రేంజ్ ఇచ్చే 5 ఎలక్ట్రిక్ స్కూటర్లు!

Related News

వోక్స్‌ వ్యాగన్ కార్లపై కళ్లు ఆఫర్లు.. ఆ మోడల్ పై ఏకంగా రూ.6 లక్షల తగ్గింపు!

సింగిల్ ఛార్జ్ తో 243 కి.మీ రేంజ్.. సింపుల్ వేవ్ సూపర్ స్కూటర్ వచ్చేసింది!

2027లో కొత్త నెక్సాన్.. డిజైన్ నుంచి ఇంజిన్ వరకు అన్నీ మారనున్నాయా?

5 ఏళ్ల తర్వాత పజెరో రీఎంట్రీ.. కొత్త లుక్‌తో మిత్సుబిషి బిగ్ సర్‌ప్రైజ్!

EV కొనేముందు ఈ విషయం చెక్ చేశారా? లేదంటే ఇబ్బందులు తప్పవు!

టాటా దూకుడు.. మహీంద్రా జోరు! ఆగస్టు అమ్మకాల్లో ఎవరు టాప్?

హోండా కొత్త ఈ-స్కూటర్‌కు పేటెంట్.. స్పీడ్ ఎంతో తెలిస్తే వావ్ అనాల్సిందే!

100 కి.మీ స్పీడ్.. 200 కి.మీ రేంజ్.. ఆంపియర్ కొత్త ఎలక్ట్రిక్ బైక్‌కు పేటెంట్!

Big Stories

Advertisement
×