E-Paper
Advertisement

Shubman Gill father: సారాతో పెళ్లి రూమ‌ర్స్‌.. గిల్ తండ్రి అదిరిపోయే ఆన్స‌ర్‌, వీడియో వైర‌ల్‌

Shubman Gill father: సారాతో పెళ్లి రూమ‌ర్స్‌.. గిల్ తండ్రి అదిరిపోయే ఆన్స‌ర్‌, వీడియో వైర‌ల్‌
Advertisement

Shubman Gill father: టీమిండియా యువ క్రికెటర్ శుభ్ మాన్ గిల్ దేశంలో అత్యుత్తమ బ్యాటింగ్ ప్రతిభ కలిగిన ఆటగాళ్లలో ఒకరిగా స్థానం సంపాదించుకున్నాడు. అతడి నైపుణ్యం మాత్రమే కాదు.. అతడి వ్యక్తిగత జీవితం కూడా తరచూ వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. గత కొంతకాలంగా గిల్.. క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్ మధ్య ఉన్న అనుబంధం గురించి పలు ఊహాగానాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి.

Also Read: KKR: అన్ని జట్లు తోపు ప్లేయర్లను కొనుగోలు చేస్తే, KKR మాత్రం కోచ్ లను తెచ్చుకుంటుంది.. వీళ్ళు ఏంటో, వీళ్ళ కట్టుబాట్లు ఏంటో

Advertisement

గిల్ ఆడే ప్రతి మ్యాచ్ కి క్రమం తప్పకుండా సారా టెండూల్కర్ హాజరు కావడం, అతడు హాఫ్ సెంచరీ చేసినా, సెంచరీ కొట్టినా చప్పట్లు కొడుతూ ఆనందాన్ని వ్యక్తం చేయడం, అవుట్ అయిన సందర్భంలో నిరాశగా ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అలాగే వీరు సోషల్ మీడియాలో ఒకరిని ఒకరి ఫాలో కావడం, కొన్ని సందర్భాలలో కలిసి తిరుగుతూ కెమెరాకి చిక్కడంతో ఈ వార్తలు నిజమేనన్న ఊహగానాలు వెలువడ్డాయి. ఇక ఇటీవల వీరిద్దరికీ సంబంధించిన మరో వార్త కూడా వైరల్ అయింది. వీరి పెళ్లి డేట్ కూడా ఫిక్స్ అయినట్లు పలు కధనాలు వెలువడ్డాయి. కానీ వీటిపై అటు సచిన్ టెండూల్కర్ కుటుంబం కానీ.. ఇటు గిల్ ఫ్యామిలీ కానీ ఎలాంటి ప్రకటన చేయకపోవడం గమనార్హం.

గిల్ పెళ్లి రూమర్స్ పై తండ్రి ఆన్సర్:

ప్రస్తుతం భారత్ – దక్షిణాఫ్రికా మధ్య రెండు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా తొలి టెస్ట్ మ్యాచ్ తొలి రోజు కలకత్తాలోని ఈడెన్ గార్డెన్స్ లో మైదానం బయట జరిగిన ఓ చిన్న సంఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఈ మ్యాచ్ ని ప్రత్యక్షంగా చూసేందుకు హాజరయ్యారు గిల్ తండ్రి లక్వీందర్ సింగ్. ఈ సమయంలో ఓ ప్రేక్షకుడు కాస్త అత్యుత్సాహం ప్రదర్శించాడు. స్టాండ్స్ లో ఓ చిన్నారితో కలిసి కూర్చున్న గిల్ తండ్రి లక్విందర్ సింగ్ ని.. ఓ ప్రేక్షకుడు మొదట నమస్కారం అంటూ పలకరించాడు. ఆ తరువాత వెంటనే.. ” అంకుల్ జి, గిల్ భాయ్ కి పెళ్లి ఎప్పుడు చేస్తున్నారు..? సారా మేడమ్ తోనే చేస్తున్నారు కదా..? అంటూ గిల్ – సారా గురించి సరదాగా ప్రశ్నించాడు. అతడి ప్రశ్నకు గిల్ తండ్రి అదిరిపోయే ఆన్సర్ ఇచ్చాడు.

Advertisement

Also Read: Shubman Gill: WTC ఫైనల్‌లో టాస్ గెలుస్తాం

నా కుమారుడు పైనే ఆధారపడి ఉంది:

ఆ అభిమాని వేసిన ప్రశ్నకు లక్వీందర్ సింగ్ చాలా శాంతంగా స్పందిస్తూ.. “ఆ నిర్ణయం పూర్తిగా నా కుమారుడి పైనే ఆధారపడి ఉంది” అంటూ ఎలాంటి హామీ ఇవ్వకుండా విషయాన్ని తెలివిగా దాటవేశారు. ఈ ఘటనతో ఆటగాళ్ల గురించి, మైదానం బయట వారి జీవితం గురించి అభిమానులు ఎంత ఆసక్తి చూపిస్తారనేది తెలుస్తోంది. నిజంగా చెప్పాలంటే మన దేశంలో క్రికెటర్లకు, వారి కుటుంబాలకు కొంచెం ప్రైవసి ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇలాంటి వ్యవహారాల వల్లే విరాట్ కోహ్లీ కూడా కొంతకాలం భారత్ నుంచి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడేమోనన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

Related News

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 ఫైన‌ల్ మ్యాచ్ టైమింగ్స్ ఇవే..ఇండియాలో లైవ్ ఎప్పుడంటే ?

రెండు మ్యాచ్ ల‌కే గాయ‌ప‌డ్డ బుమ్రాతో వ‌ర‌ల్డ్ క‌ప్ గెలుస్తారా? గ‌వాస్క‌ర్ సీరియ‌స్‌

2027 వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్..త‌న డ్రీమ్ టీమిండియాను ప్ర‌క‌టించిన ర‌విశాస్త్రి

శ్రీలంక‌లో షాహీన్ అఫ్రిదికి ఘోర అవ‌మానం…ప్రీమియ‌ర్ బౌల‌ర్ కాస్త..మీడియం అయ్యాడు

టీమిండియా చాలా వీక్ గా ఉంది..పాకిస్తాన్ మ‌హిళ‌ల చేతిలో కూడా ఓడిపోవ‌డం ఖాయం!

రోహిత్ శ‌ర్మ‌ కూడా స్లాగ‌రే..గుడ్డిగా బ్యాట్ ఊపితే, వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వ‌లేరు

గంభీర్ ను వెధ‌వ‌ను చేసేందుకు రోహిత్ శ‌ర్మ PR స్టంట్..రిటైర్మెంట్, బొక్కా లేదు

దక్షిణాఫ్రికాలో వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వాలంటే, రోహిత్ శ‌ర్మ ఉండాల్సిందే

Big Stories

Advertisement
×