E-Paper
Advertisement

KKR: అన్ని జట్లు తోపు ప్లేయర్లను కొనుగోలు చేస్తే, KKR మాత్రం కోచ్ లను తెచ్చుకుంటుంది.. వీళ్ళు ఏంటో, వీళ్ళ కట్టుబాట్లు ఏంటో

KKR: అన్ని జట్లు తోపు ప్లేయర్లను కొనుగోలు చేస్తే, KKR మాత్రం కోచ్ లను తెచ్చుకుంటుంది.. వీళ్ళు ఏంటో, వీళ్ళ కట్టుబాట్లు ఏంటో
Advertisement

KKR: టి-20 లీగ్ లలో అత్యంత ఆదరణ పొందిన వాటిల్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ {IPL} ముందు వరుసలో ఉంటుందని చెప్పొచ్చు. దాదాపు రెండు లేదా మూడు నెలలు క్రికెట్ అభిమానులకు ఈ ఐపిఎల్ కనువిందు చేస్తుంది. ఒక్క పాకిస్తాన్ మినహా భారత్ సహా దాదాపు అన్ని టెస్ట్ హోదా దేశాలకు చెందిన ఆటగాళ్లు ఈ ఐపీఎల్ ఆడేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. ఇక్కడ వేలం కోసం తమ పేర్లను నమోదు చేసుకుంటారు. ఇప్పటివరకు 18 సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకున్న ఐపిఎల్.. ఇప్పుడు 19వ సీజన్ 2026 కోసం సిద్ధమవుతోంది.

Also Read: IND vs SA 1st test: 5 వికెట్లతో రెచ్చిపోయిన బుమ్రా.. సౌతాఫ్రికా ఆలౌట్.. స్కోర్ ఎంతంటే

Advertisement

రాబోయే సీజన్ కోసం మినీ వేలం ఈ ఏడాది డిసెంబర్ లో జరగనుంది. అంతకుముందు అన్ని జట్లు తమ వద్ద ఉంచుకున్న ఆటగాళ్ల జాబితాను విడుదల చేస్తాయి. రిటెన్షన్ జాబితా నవంబర్ 15న ప్రత్యక్షంగా ప్రసారం చేస్తుంది. అంటే ఏ జట్టు ఏ ఆటగాడిని విడుదల చేసిందో..? ఎవరిని తమతో ఉంచుకోవాలని నిర్ణయించుకుందో..? అందరికీ తెలుస్తుంది. ఇప్పటికే కొన్ని జట్లు కీలక ఆటగాళ్లని వదులుకొని.. మరి కొంతమంది కీలక ఆటగాళ్లపై కన్నేశాయి. ఇలా దాదాపు అన్ని ఫ్రాంచైజీలు ఆటగాళ్ల కొనుగోలు కోసం వ్యూహాలు రచిస్తుంటే.. కలకత్తా నైట్ రైడర్స్ మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది.

 

కోచింగ్ సిబ్బందిపై కన్నేసిన కేకేఆర్:

Advertisement

ఐపీఎల్ లోని అన్ని జట్లు తోపు ప్లేయర్లను కొనుగోలు చేసేందుకు వ్యూహాలు రచిస్తుంటే.. కేకేఆర్ మాత్రం కోచ్ లను తెచ్చుకుంటుంది. కేకేఆర్ కోచ్ ల నియామకాలపై దృష్టి సారిస్తే.. ఈ ఏడాది మార్చి నెలలో కలకత్తా నైట్ రైడర్స్ జట్టు మెంటార్ గా వెస్టిండీస్ మాజీ కెప్టెన్ డ్వెన్ బ్రావో సెలెక్ట్ అయ్యాడు. ఆ తర్వాత ఈ ఏడాది అక్టోబర్ లో కలకత్తా నైట్ రైడర్స్ తమ జట్టుకు ప్రధాన కోచ్ గా అభిషేక్ నాయర్ ని నియమించింది. 2024లో కేకేఆర్ టైటిల్ గెలిచిన సమయంలో అభిషేక్ నాయర్ కోచింగ్ స్టాఫ్ లో సభ్యుడు. ఇతడు చాలాకాలంగా కేకేఆర్ కోచింగ్ స్టాఫ్ లో సభ్యుడుగా ఉన్నాడు. అసిస్టెంట్ కోచ్ గా కూడా సేవలు అందించాడు. రింకు సింగ్, హర్షిత్ రానా వంటి యంగ్ ప్లేయర్స్ ని వెలికి తీయడంలో ఈయనది కీలకపాత్ర. ఈ క్రమంలో ఇతడిని ప్రధాన కోచ్ గా నియమించారు.

 

కేకేఆర్ కీలక నిర్ణయం:

ఇక తాజాగా కేకేఆర్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. అసిస్టెంట్ కోచ్ గా ఆస్ట్రేలియా దిగ్గజ ఆల్ రౌండర్ షేన్ వాట్సన్ ని నియమించింది. ఈ విషయాన్ని కేకేఆర్ సీఈవో వెంకీ మైసూర్ తెలిపారు. దీంతో కేకేఆర్ హెడ్ కోచ్ అభిషేక్ నాయర్ తో కలిసి షేన్ వాట్సన్ పని చేయబోతున్నాడు. ఐపీఎల్ లో ఆటగాడిగా మరియు కోచ్ గా వాట్సన్ తన సేవలను అందించాడు. ఐపీఎల్ ప్రారంభ సీజన్ లో రాజస్థాన్ రాయల్స్ కి, రాజస్థాన్ రాయల్స్ టైటిల్ గెలవడంలో కీలకపాత్ర పోషించడమే కాకుండా.. ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డుని సైతం గెలుచుకున్నాడు.

Also Read: Shubman Gill: WTC ఫైనల్‌లో టాస్ గెలుస్తాం

2013లో కూడా ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు అందుకున్నాడు. అలాగే 2018 లో చెన్నై సూపర్ కింగ్స్ ఛాంపియన్ గా నిలవడంలో కీలకపాత్ర పోషించాడు. ఇక ఐపీఎల్ లో రిటైర్మెంట్ అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్ కి అసిస్టెంట్ కోచ్ గా పనిచేశాడు. ఇప్పుడు కేకేఆర్ కోచింగ్ స్టాఫ్ లో జాయిన్ అయ్యాడు. అయితే ఇప్పుడు మరో కోచ్ పై కన్నేసింది కలకత్తా నైట్ రైడర్స్. బౌలింగ్ కోచ్ గా టీమ్ సౌథి ని నియమించుకుందట కేకేఆర్. అయితే ఈ విషయంపై ఇంకా అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు. ఇలా అన్ని జట్లు ఆటగాళ్లపై దృష్టి సారిస్తే.. కేకేఆర్ మాత్రం కోచ్ లపై ఫోకస్ చేసింది.

Related News

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

గంభీర్ వెనక కోహ్లీ కుప్పిగంతులు..అస‌భ్యక‌రంగా చేతులు చూపిస్తూ డ్యాన్స్

లార్ట్స్ మైదానంలో ఈ గంట కొట్ట‌డానికి కార‌ణం ఏంటి? దీని వెనుక ఉన్న‌ర‌హ‌స్యం

రోహిత్ శ‌ర్మ‌, కోహ్లీ ఇద్ద‌రూ టీమిండియాకు హార్ట్ బీట్ లాంటోళ్లు..వాళ్ల‌ను ట‌చ్ చేయెద్దు

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 ఫైన‌ల్ మ్యాచ్ టైమింగ్స్ ఇవే..ఇండియాలో లైవ్ ఎప్పుడంటే ?

రెండు మ్యాచ్ ల‌కే గాయ‌ప‌డ్డ బుమ్రాతో వ‌ర‌ల్డ్ క‌ప్ గెలుస్తారా? గ‌వాస్క‌ర్ సీరియ‌స్‌

Big Stories

Advertisement
×