Shubman Gill: టీమిండియా వన్డే కెప్టెన్ శుభ్‌మన్ గిల్ కు ( Shubman Gill) మరో ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. మొన్నటి వరకు మెడనొప్పి కారణంగా జట్టుకు దూరమైన శుభ్‌మన్ గిల్… ఇప్పుడు మరోసారి అనారోగ్యం బారిన పడ్డాడు. తాజాగా శుభ్‌మన్ గిల్ ఫుడ్ పాయిజన్ (Shubman Gill food poision) అయినట్లు తెలుస్తోంది. దీంతో విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా సిక్కింతో జరిగే మ్యాచ్ కు దూరమయ్యాడు శుభ్‌మన్ గిల్. ఈ మేరకు పంజాబ్ జట్టుకు సంబంధించిన కోచ్ సందీప్ శర్మ వెల్లడించారు. తీవ్ర అనారోగ్యం కారణంగా సిక్కింతో జరిగే మ్యాచ్ కు శుభ్‌మన్ గిల్ దూరమైనట్లు వివరించారు. దీంతో శుభ్‌మన్ గిల్ ఫాన్స్ టెన్షన్ పడుతున్నారు. ప్రస్తుతం గిల్ ఆసుపత్రిలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక గిల్ ఆనారోగ్యంపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
Also Read: Sai Sudharsan Injury: విరిగిన పక్కటెముక.. పెను ప్రమాదంలో సాయి సుదర్శన్..ఐపీఎల్ 2026 నుంచి ఔట్ ?
మొన్నటి వరకు మెడ నొప్పి కారణంగా టీమిండియా జట్టుకు గిల్ ( Shubman Gill) దూరమైన సంగతి తెలిసిందే. అయితే మెడ నొప్పి నుంచి బయటపడిన గిల్, విజయ్ హజారే టోర్నమెంట్లో ఆడుతున్నాడు. కానీ ఇంతలోనే గిల్మ కు మరో ఊహించని పరిణామం ఎదురైంది. జైపూర్ వేదికగా సిక్కిం జట్టుతో జరగాల్సిన మ్యాచ్ కు చివరి క్షణంలో గిల్ ను తప్పించారు. ఈ మ్యాచ్ ఆడేందుకు నిన్ననే జైపూర్ చేరుకున్నాడు గిల్. కానీ రాత్రి తిన్న ఫుడ్ బెడిసి కొట్టడంతో ఫుడ్ పాయిజన్ జరిగిందట.
దీంతో సిక్కింతో జరిగే మ్యాచ్ కు దూరమయ్యాడు గిల్. ఈ మేరకు పంజాబ్ జట్టుకు సంబంధించిన కోచ్ సందీప్ శర్మ అధికారిక ప్రకటన చేశాడు. శుక్రవారం రోజునే మ్యాచ్ కోసం జైపూర్ కు గిల్ చేరుకున్నాడని తెలిపారు. అయితే రాత్రి సమయంలో గిల్ తీసుకున్న ఫుడ్ బెడిసి కొట్టిందని వివరించారు. ఈ నేపథ్యంలోనే అతడు ఆసుపత్రిలో జాయిన్ అయి రెస్ట్ తీసుకుంటున్నాడని కోచ్ సందీప్ శర్మ క్లారిటీ ఇచ్చారు. ఈ న్యూస్ బయటకు రావడంతో గిల్ అభిమానులు టెన్షన్ పడుతున్నారు. మొన్నటి వరకు మెడ నొప్పితో బాధపడిన గిల్, ఇప్పుడు ఇలా కావడం దారుణం అంటున్నారు.
జనవరి 11వ తేదీ నుంచి టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ ( Team India vs New Zealand ) జట్ల మధ్య 3 వన్డేల సిరీస్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఇవాళ సాయంత్రం లేదా రేపు టీమిండియా జట్టును ప్రకటించనున్నారు. అయితే గిల్ ఆరోగ్యం బాగుంటే ఈ టోర్నమెంట్ కు కెప్టెన్ గా అతడు కొనసాగే ఛాన్సులు ఉన్నాయి. లేకపోతే గిల్ఈ టోర్నమెంట్ కు దూరం అవుతాడు.
Also Read: Ravichandran Ashwin: టీ20 వరల్డ్ కప్ 2026 కంటే సీరియల్స్ చూడటం బెటర్..టీమిండియా ఆడటం దండగే
🚨 REPORTS 🚨
Shubman Gill missed the Vijay Hazare Trophy match against Sikkim due to illness. ❌
(Source: Sportstar)#Cricket #Gill #VHT pic.twitter.com/iUZnjbnJKl
— Sportskeeda (@Sportskeeda) January 3, 2026