E-Paper
Advertisement

Papaya Benefits: బొప్పాయిని ఉదయాన్నే ఎందుకు తినాలి ? ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారు ?

Papaya Benefits: బొప్పాయిని ఉదయాన్నే ఎందుకు తినాలి ? ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారు ?
Advertisement

Papaya Benefits: బొప్పాయి తినడం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయి. బొప్పాయిలో విటమిన్ ఎ, సి,ఇ ఉంటాయి. అంతే కాకుండా పొటాషియం, ఫోలేట్, మెగ్నీషియం, కాల్షియం వంటి ఖనిజాలు, ఫైబర్ , యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా లభిస్తాయి. ఇవి రోగ నిరోధకశక్తిని పెంచడంతో పాటు కంటి చూపును కూడా మెరుగుపరుస్తాయి. రక్తపోటును నియంత్రించడంలో కూడా ఇవి ఉపయోగపడతాయి. బొప్పాయిలో ఉండే ఈ పోషకాలు అనేక ఆరోగ్య సమస్యలు కూడా రాకుండా చేస్తాయి. ఇదెలా ఉంటే బొప్పాయిని ఖాళీ కడుపుతో తినడం వల్ల అద్భుత ప్రయోజనాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

ఖాళీ కడుపుతో బొప్పాయి తినడం వల్ల కలిగే 5 గొప్ప ప్రయోజనాలు:

Advertisement

జీర్ణవ్యవస్థను బలపరుస్తుంది:
బొప్పాయి జీర్ణక్రియకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇందులో ఉండే పపైన్ ఎంజైమ్ ఆహారాన్ని సులభంగా జీర్ణం చేయడానికి సహాయ పడుతుంది. ఖాళీ కడుపుతో బొప్పాయి తినడం వల్ల మలబద్ధకం, గ్యాస్ , ఆమ్లత్వం వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. మలబద్దకంతో ఇబ్బంది పడే వారు ఉదయం ఖాళీ కడుపుతో బొప్పాయి తినడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది.

బరువు తగ్గడానికి మేలు:
మీరు బరువు తగ్గాలని ప్రయత్నిస్తుంటే.. ఖాళీ కడుపుతో బొప్పాయిని తీసుకోవడం ప్రయోజనకరంగా ఉంటుంది. బొప్పాయిలో కేలరీలు తక్కువగా అంతే కాకుండా ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది మిమ్మల్ని ఎక్కువసేపు కడుపు నిండి ఉండేలా చేస్తుంది. ఇది ఆకలిని అరికట్టడానికి , అతిగా తినకుండా నిరోధించడానికి కూడా ఇది ఎంతగానో సహాయ పడుతుంది.

Advertisement

రోగనిరోధక శక్తిని బలోపేతం:
బొప్పాయిలో విటమిన్ సి, విటమిన్ ఎ , యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఖాళీ కడుపుతో దీనిని తీసుకోవడం వల్ల శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. మారుతున్న సీజన్లలో జలుబు, వైరల్ ఇన్ఫెక్షన్లను నివారించడంలో ఈ పండు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. తరచూ వ్యాధుల బారిన పడే వారు దీనిని ప్రతి రోజు తినడం వల్ల కూడా మంచి ఫలితాలు ఉంటాయి.

Also Read: తక్కువ తిని.. ఎక్కువ నడిచినా బరువు తగ్గట్లేదా? కారణం ఇదేనట!

చర్మాన్ని మెరిసేలా చేస్తుంది:
ఖాళీ కడుపుతో బొప్పాయి తినడం వల్ల కలిగే ప్రభావాలు చర్మంపై స్పష్టంగా కనిపిస్తాయి. బొప్పాయిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు చర్మాన్ని లోపలి నుంచి పోషిస్తాయి. క్రమం తప్పకుండా దీనిని తీసుకోవడం వల్ల మొటిమలు, మచ్చలు , ముడతలు తగ్గుతాయి. అంతే కాకుండా చర్మం కూడా సహజంగా మెరుస్తుంది.

గుండె ఆరోగ్యానికి మేలు:
బొప్పాయిలో ఫైబర్ , పొటాషియం పుష్కలంగా ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్‌ను నియంత్రించడంలో సహాయ పడతాయి. ఖాళీ కడుపుతో బొప్పాయి తినడం వల్ల రక్తపోటు సమతుల్యం అవుతుంది. అంతే కాకుండా ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

ఎలా తినాలి ?
డైలీ ఒక గిన్నెడు తాజా, పండిన బొప్పాయి తినండి. ఆ తర్వాత.. మీ శరీరం దానిలోని పోషకాలను గ్రహించగలిగేలా కనీసం 30 నిమిషాల పాటు వేరే ఏమీ తినకండి.

Related News

మరణం తర్వాత శరీరంలోని ఏ అవయవం ఎంతసేపు జీవించి ఉంటుంది? ఈ విషయాలు తెలుసా

జీవితంలో ఎప్పుడూ తప్పుడు నిర్ణయాలు తీసుకోరు, మోసపోరు.. చాణక్యుడు చెప్పిన ఈ నీతి సూత్రాలు పాటిస్తే

తక్కువ స్థలంలో కిచెన్ గార్డెన్‌.. ఇంట్లోనే కూరగాయలు పండించడం మరింత సులభం

రాత్రి ఆలస్యంగా నిద్రపోయి ఉదయం త్వరగా లేస్తున్నారా? మీ శరీరానికి కలిగే నష్టాలివే

పిల్లలు రాత్రి ఏ సమయం కల్లా నిద్రపోవాలి? టైమ్‌కు నిద్రపోకపోతే మెదడుపై ప్రభావం

రక్తపోటు పెరగడానికి మౌత్ వాష్ కూడా ఒక కారణమేనా.. తాజా రీసెర్చ్ ఏం చెబుతోంది?

గ్రీన్ టీ తాగుతున్నా బరువు తగ్గట్లేదా? అయితే మీరు ఈ 5 తప్పులు చేస్తున్నట్టే!

గుండెపోటు వెనక అసలు విలన్ ప్లాస్టిక్కేనా? మెడికల్ హిస్టరీలోనే షాకింగ్ నిజాలు!

Big Stories

Advertisement
×