E-Paper
Advertisement

Ind VS Sa 1st Test: గిల్ తెలివిగా తప్పుకున్నాడు.. గంభీర్ బుక్ అయ్యాడు..!

Ind VS Sa 1st Test: గిల్ తెలివిగా తప్పుకున్నాడు.. గంభీర్ బుక్ అయ్యాడు..!
Advertisement

Ind VS Sa 1st Test: కలకత్తాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా సౌత్ ఆఫ్రికాతో జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా దారుణంగా ఓడిపోయిన విషయం తెలిసిందే. 124 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కూడా చేదించలేక టీమిండియా చెతికిలబడింది. రెండవ ఇన్నింగ్స్ లో భారత్ కేవలం 35 ఓవర్లలోనే కుప్పకూలింది. 93 పరుగులు మాత్రమే చేసి ఆల్ అవుట్ అయింది.

Also Read: Ganguly: మీరు అడిగిన పిచ్ ఇచ్చారు.. కానీ ఎందుకు గెలవలేదు రా..!

Advertisement

దీంతో సౌత్ ఆఫ్రికా 30 పరుగుల తేడాతో భారత్ పై గెలుపొందింది. ఈ ఓటమితో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పై మరోసారి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కానీ గంభీర్ మాత్రం మ్యాచ్ అనంతరం మీడియా సమావేశంలో.. తమ ఓటమికి గల కారణాలను వెల్లడించాడు. పిచ్ విషయంలో క్యూరేటర్ ని నిందించాల్సిన అవసరం లేదని.. తాము కోరుకున్న విధంగానే ఈ వికెట్ ఉందని తెలిపాడు. కానీ తమ ఆటగాళ్లే పిచ్ కి తగ్గట్లుగా ఆడలేకపోయారని తెలిపాడు.

గిల్ కారణంగానే భారత్ ఓడిపోయిందా..?

టీమిండియా కెప్టెన్ గిల్ ఈ టెస్ట్ మ్యాచ్ లోని రెండవ రోజు మెడ నొప్పి కారణంగా రిటైర్డ్ హర్ట్ అయిన విషయం తెలిసిందే. ఈ మెడనొప్పి కారణంగా రెండవ ఇన్నింగ్స్ లో కూడా అతడు అందుబాటులోకి రాలేదు. అయితే దీనికి కారణం ఫిట్నెస్ లేకపోవడమేనని క్రికెట్ అభిమానులు విమర్శిస్తున్నారు. ఆడింది కేవలం మూడు బంతులు మాత్రమేనని.. అప్పుడే రిటైర్డ్ అవ్వడంతో అభిమానులు ఫైర్ అవుతున్నారు. అసలు ఫిట్నెస్ లేకుండా బరిలోకి ఎందుకు దిగాడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వ్యక్తిని జట్టులోకి ఎంపిక చేయడమే కాకుండా.. ఏకంగా కెప్టెన్ ని చేశారని కామెంట్స్ చేస్తున్నారు. ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే, టి-20 సిరీస్ లలో కూడా దారుణంగా విఫలమై అభిమానులను నిరాశపరిచాడని ట్రోలింగ్ చేస్తున్నారు. పేరుకు టాప్ బ్యాటర్ కానీ క్రీజ్ లోకి దిగాక బౌలర్ల కంటే అద్వానంగా ఆడుతున్నాడని మండిపడుతున్నారు. హెడ్ కోచ్ గౌతమ్ గంబీర్ మాత్రం ఇతడిని వెనకేసుకొస్తున్నాడని.. వెంటనే ఇతడిని తొలగించి రిషబ్ పంత్ ని కెప్టెన్ గా నియమించాలని డిమాండ్ చేస్తున్నారు.

Advertisement

 

ఇరుక్కున్న గంభీర్:

కొందరు క్రీడాభిమానులు ఈ పిచ్ ని అర్థం చేసుకొని.. మెడ నొప్పి పేరుతో గిల్ మెల్లిగా సైడ్ అయ్యాడని.. దీంతో గౌతమ్ గంభీర్ ఇరుక్కుపోయాడని కామెంట్స్ చేస్తున్నారు. క్యూరేటర్ గౌతమ్ గంభీర్ కి కావలసిన విధంగానే పిచ్ రెడీ చేసి ఇచ్చారని.. అయినప్పటికీ ఇండియా ఓడిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్ గా బాధ్యతలు తీసుకున్న తర్వాత గత ఏడదిన్నరలో దారుణ పరాజేయాలని ఎదుర్కొంటుందని మరి కొంతమంది మండిపడుతున్నారు.

Also Read: Vaibhav Suryavanshi: 200 పరుగులు చేసినా, మా అయ్య ఊరుకోడు

గంభీర్ హెడ్ కోచ్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్, 2024లో ఒక్క వన్డే లో కూడా విజయం సాధించలేక 45 ఏళ్ల చెత్త రికార్డు, 36 ఏళ్ల తర్వాత స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో టెస్ట్ సిరీస్, 12 సంవత్సరాల తర్వాత ఆస్ట్రేలియా చేతిలో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ, డబ్ల్యూటీసీ ఫైనల్ లో అర్హత కూడా సాధించలేకపోవడం.. ఇలా గంభీర్ హెడ్ కోచ్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత భారత జట్టుకి వరించిన విజయాల కంటే దక్కిన అవమానాలు, పరాభవాలే ఎక్కువ అని ట్రోలింగ్ చేస్తున్నారు. అంతేకాకుండా బ్యాటింగ్ ఆర్డర్ లో రకరకాల ప్రయోగాలు చేస్తూ ఓటమికి ప్రధాన కారణంగా నిలుస్తున్నాడని అంటున్నారు.

Related News

విండీస్, టీమిండియా మ్యాచ్ రద్దు… వ‌ర్షం ప‌డి బ‌తికిపోయారంటూ తన్వీర్ అహ్మద్ కామెంట్!

పాకిస్తాన్ జట్టులో ప్రకంపనలు..కోచ్ మైక్ హెసన్ కాలర్ పట్టుకున్న షాహీన్ అఫ్రిది

ముస్లిం క్రికెట‌ర్ల‌కు టీమిండియాలో ఛాన్స్ ఇవ్వ‌రు కానీ పాకిస్తాన్ వ‌చ్చేయ్ !

ఇస్లామాబాద్ లో హై టెన్ష‌న్‌…ఇంగ్లాండ్ క్రికెట‌ర్లు బ‌స చేస్తున్న హోట‌ల్ ద‌గ్గ‌ర భారీ బ్లాస్ట్ !

ప్రీతి జింటా లాగా సొట్ట బుగ్గలేసుకుని, వీడేం వికెట్ కీపింగ్ చేస్తాడురా నాయ‌నా ?

పాకిస్తాన్ అంటేనే ఎగిరెగిరి ప‌డ‌తారు, కానీ సిగ్గు లేకుండా మాతో మ్యాచ్ లు ఆడ‌తారు!

ద‌రిద్రుడు అగార్క‌ర్ పోయినా రాత మార‌లేదే…ష‌మీ, భువీల‌ను న‌ట్టేట ముంచారు క‌ద‌రా?

విండీస్ పై చివ‌రి మ్యాచ్ ఆడేశాడు…ఇక ర‌వీంద్ర జ‌డేజా రిటైర్మెంట్ ఇవ్వాల్సిందే

Big Stories

Advertisement
×