E-Paper
Advertisement

Healthy Foods For Children: పరీక్షల సమయంలో పిల్లల జ్ఞాపకశక్తి‌ని పెంచే బెస్ట్ ఫుడ్స్ ఇవే!

Healthy Foods For Children: పరీక్షల సమయంలో పిల్లల జ్ఞాపకశక్తి‌ని పెంచే బెస్ట్ ఫుడ్స్ ఇవే!
Advertisement

Healthy Foods For Children: పిల్లలు పరీక్షల సమయంలో సరిగ్గా తినకుండా తెగ టెన్షన్ పడిపోతుంటారు. ఎగ్జామ్స్ అనగానే వారిలో భయం మొదలవ్వడంతో తిండి మానేస్తుంటారు. అలాగే మార్కులు తక్కువగా వస్తాయేమోననే భయంతో తీవ్ర ఒత్తిడికి లోనవుతారు. అందుకే.. పిల్లల్లో ఒత్తిడిని తగ్గించడానికి తల్లిదండ్రులు బాధ్యత తీసుకుని, పరీక్షల సమయంలో పోషకాలతో కూడిన మంచి ఆహారం అందివ్వాలని చెబుతారు నిపుణులు. అప్పుడే వారిలో భయం తొలగిపోయి జ్ఞాపకశక్తి పెరుగుతుంది. ఈ నేపథ్యంలో పరీక్షలప్పుడు పిల్లలకు ఎలాంటి ఆహారం ఇవ్వాలో తెలుసుకుందాం.

పోషకాలతో నిండిన ఆహారం:

బయట దొరికే ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్ వంటివి కాకుండా.. ఇంట్లో వండిన ఆహారాన్నే పిల్లలకు అందించాలి. ముఖ్యంగా విద్యార్థులు ఎగ్జామ్స్ సమయంలో తమ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. తినే సమయంలో అసలు పరీక్షల గురించి ఆలోచించకూడదు. ప్రశాంతంగా తినాలి. లేదంటే.. ఎగ్జామ్ హాల్లో నీరసించి పోతారు.

వెబిటబుల్స్ సలాడ్ ఉత్తమం:

Advertisement

పిల్లలు అడుగుతున్నారు కదాని.. ఎక్కువగా స్వీట్లు, శీతల పానీయాలు, పానీపూరి, చాక్లెట్లు కొనివ్వకూడదు. అల్పాహారంగా ఇడ్లీ, దోశె, అటుకులు వంటివి పెట్టొచ్చు. మధ్యాహ్నం అన్నంలో పప్పు, కూరగాయల సలాడ్ తీసుకుంటే ఇంకా మంచిది. రాత్రి అన్నం బదులుగా చపాతి, జొన్నరొట్టె, మసాలా లేని, నూనె తక్కువగా ఉండే కూరలను పెట్టండి. పరీక్షల సమయంలో సమతుల ఆహారం చాలా అవసరం.

Read Also: రాత్రి 7 గంటల్లోపు డిన్నర్ చేస్తే ఎన్ని ప్రయోజనాలో.. తెలిస్తే అస్సలు మిస్ చేయరు!

సూర్యరశ్మి అవసరం:

Advertisement

ఆహారం జ్ఞాపశక్తిపై ప్రభావం చూపిస్తుందన్న విషయం మరచిపోవద్దు. ప్రతిరోజూ ఖచ్చితంగా విటమిన్ డి కోసం సూర్యకిరణాలు తాకేలా పిల్లల్ని కాసేపు ఎండలో కూర్చోమని చెప్పాలి. డి విటమిన్ మెదడు పనితీరుపై ప్రభావం చూపిస్తుంది. అలాగే స్కూల్లో విద్యార్థులతో కలిసి భోజనం చేయడంవల్ల వారిలో ఆత్మవిశ్వాసం బలపడుతుంది.

ఆత్మవిశ్వాసమే బలమని చెప్పండి:

ఎగ్జామ్స్ టైంలో ఆందోళన చెందకుండా వేళకు భోజనం చేయమని సూచనలు ఇవ్వండి. ఆత్మవిశ్వాసమే బలమని వారికి నమ్మకం కలిగించాలి. పిల్లల ఒత్తిడిని జయించడం కూడా తల్లిదండ్రులు చేతుల్లోనే ఉంటుంది. పరీక్షల సమయంలో పిల్లలతో ఎక్కువ సమయం గడుపుతూ వారి అవసరాలను గుర్తించి ఎప్పటికప్పుడు వాటిని తీరుస్తుండాలి.

అలాంటి సమయంలో:

విద్యార్థులు కొన్నిసార్లు వేళకి ఆహారం తీసుకోరు. అలాంటి సమయంలో వారికి ఇష్టమైన వంటలు చేసిపెట్టాలి. పరీక్షల సమయంలో పిల్లల ఆరోగ్యం ఎంతో ముఖ్యం. శరీరానికి సరిపడ నీరు తాగమని చెప్తుండాలి. పిల్లలకు ఎగ్జామ్స్ సమయంలో మాత్రమే కాదు.. మొదటి నుంచీ వారికి ఆరోగ్యకరమైన ఆహారం అందిచండం వల్ల పిల్లలు హెల్దీగా పెరుగుతారు.

Read Also: గంటల తరబడి కంప్యూటర్‌తో కుస్తీ.. అనారోగ్యానికి భారీ మూల్యం చెల్లించక తప్పదు!

Related News

LED ఫేస్ మాస్క్ ముఖంపై ముడతలు తగ్గిస్తుందని ప్రచారం.. నిజంగా పనిచేస్తుందా?

సండే స్పెషల్.. ఎప్పుడూ ఒకేలా కాకుండా మటన్‌ను ఇలా గ్రీన్‌గా వండి చూడండి.. వేళ్లు నాకేస్తారు!

అరకు ఫేమస్ బొంగు చికెన్.. తింటే జీవితంలో ఆ రుచిని మర్చిపోరు, ఎలా చేయాలో తెలుసా?

జంక్ ఫుడ్ తింటే క్యాన్సర్ రాదా? 4.6 లక్షల మందిపై జరిగిన అధ్యయనంలో షాకింగ్ విషయాలు!

మీ పిల్లాడు ఆలస్యంగా మాట్లాడుతున్నాడా? త్వరగా మాట్లాడేందుకు డాక్టర్ చెప్పిన టిప్స్ ఇవే

మీ జీవిత భాగస్వామిలో బలహీనతలే కాదు ఈ మంచి లక్షణాలు కూడా గమనించండి.. రిలేషన్‌షిప్‌లో చాలా ముఖ్యం

ఉదయం లేవగానే గర్ల్‌ఫ్రెండ్‌‌తో చాటింగ్ చేస్తున్నారా? ఈ 5 విషయాలు చెబితే బ్రేకప్ ప్రమాదం

52 ఏళ్ల వయసులో తల్లి కాబోతున్న ప్రముఖ నటి.. ఆ వయసులో గర్భం దాల్చడం ఆరోగ్యకరమేనా?

Big Stories

Advertisement
×