E-Paper
Advertisement

లిఫ్ట్ లోనే కావ్య పాప‌కు ప్ర‌పోజ్ చేసిన SRH ఫ్యాన్..తండ్రి చూస్తుండానే, ఏం గుండెరా అది

లిఫ్ట్ లోనే కావ్య పాప‌కు ప్ర‌పోజ్ చేసిన SRH ఫ్యాన్..తండ్రి చూస్తుండానే, ఏం గుండెరా అది
Advertisement

SRH VS RR:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ లో ( Indian Premier League 2026 Tournament) భాగంగా నిన్న రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ ( Sunrisers Hyderabad vs Rajasthan Royals) జట్ల మధ్య బిగ్ ఫైట్ జరిగింది. అయితే ఈ మ్యాచ్ లో అద్భుతంగా రాణించిన స‌న్ రైజ‌ర్స్‌ హైదరాబాద్, రెండో విజయాన్ని నమోదు చేసుకుంది. రాజస్థాన్ రాయల్స్ పై 57 పరుగుల తేడాతో విక్టరీ అందుకుంది హైదరాబాద్. అయితే ఈ మ్యాచ్ అనంతరం ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. లిఫ్టులో వెళుతోన్న కావ్య పాపకు, ఓ SRH అభిమాని ఫ్లవర్ ఇచ్చి ప్రపోజ్ చేశాడు. పక్కన ఆమె తండ్రి కళానిధి మారన్ ఉన్నప్పటికీ ఏ మాత్రం మనోడు భయపడకుండా తెగించేశాడు. అయితే సదరు SRH అభిమాని ఇచ్చిన ఫ్లవర్ ను తీసుకున్న కావ్య పాప, చిన్నగా స్మైల్ ఇచ్చింది. దీంతో ఈ లిఫ్ట్ వీడియో వైరల్ గా మారింది.

Also Read: ఐపీఎల్ నుంచి PSLలోకి రావ‌డానికి సిగ్గు అనిపించలేదా ? కుశాల్ మెండిస్ ప‌రువు తీసిన పాక్ రిపోర్ట‌ర్‌

లిఫ్ట్ లోనే కావ్య పాప‌కు ప్ర‌పోజ్ చేసిన SRH ఫ్యాన్

Advertisement

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ లో భాగంగా సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఇందులో అద్భుతంగా రాణించిన హైదరాబాద్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే హైదరాబాద్ గెలిచిన నేపథ్యంలో కావ్య పాప చాలా జోష్ లో కనిపించింది. వైభవ్ సూర్య వంశీ వికెట్ పడినప్పటి నుంచి మొదలుకొని మ్యాచ్ అయిపోయే వరకు.. కావ్య ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అయితే మ్యాచ్ అయిపోయిన తర్వాత, హోటల్ కు వెళ్తున్న క్రమంలో లిఫ్టులో ఎక్కారు కావ్య పాప. స‌న్ రైజ‌ర్స్ ఓన‌ర్ కావ్య పాపతో త‌న తండ్రి కళానిధి మారన్ కూడా ఉన్నారు. ఈ సందర్భంగా లిఫ్టులో వాళ్లు వెళ్తుండగా హైదరాబాద్ జట్టుకు సంబంధించిన ఓ అభిమాని, పువ్వు ఇచ్చి ప్రపోజ్ చేశాడు. అయితే హైదరాబాద్ గెలిచినందుకు గాను కంగ్రాట్స్ చెబుతున్నాడు అనుకుని, ఆ పువ్వు తీసుకొని స్మైల్ ఇచ్చింది కావ్య. ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. కావ్య తండ్రి కళానిధి మారన్ ముందే ఫ్లవర్ ఇచ్చిన స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ అభిమాని గుండె పెద్ద‌ది రా అంటూ కామోంట్స్ చేస్తున్నారు.

57 పరుగుల తేడాతో హైదరాబాద్ విజయం

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో సన్రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మధ్య ఉప్పల్ వేదికగా మ్యాచ్ జరిగింది. ఇందులో 57 పరుగుల తేడాతో హైదరాబాద్ విక్టరీ కొట్టింది. ఈ మ్యాచ్ లో హైదరాబాద్ 216 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని చేదించే క్రమంలో తడబడిన రాజస్థాన్ రాయల్స్, ఓటమిపాలైంది. 19 ఓవర్లలో 159 పరుగులకు ఆల్ అవుట్ అయింది రాజస్థాన్ రాయల్స్. ఈ క్ర‌మంలో 57 పరుగుల తేడాతో హైదరాబాద్ విజ‌యం సాధించింది.

Advertisement

 

Also Read: Rohit VS Bumrah: ముంబైలో చీలిక‌..రోహిత్ శ‌ర్మ‌ను బండ బూతులు తిట్టిన బుమ్రా, రూ.50 లక్ష‌ల ఫైన్‌

 

 

Related News

విజయ్ మాల్యాతో మందుకొట్టిన ధోనీ, రిషబ్ పంత్..షాకింగ్ వీడియో వైర‌ల్ !

డ్రెస్సింగ్ రూంలో త‌న్నుకున్న పాకిస్తాన్ క్రికెట‌ర్లు..!

ఐర్లాండ్ చేతిలో టీమిండియానే వైట్ వాష్ అయింది, అందుకే పాకిస్తాన్ ఓడిపోతోంది

ఎవ‌రెంత గింజుకున్నా, నేను రాజీనామా చేయ‌ను..న‌ఖ్వీ సంచ‌ల‌నం

ఒరేయ్ న‌ఖ్వీ? పాకిస్తాన్ జ‌ట్టును 9వ స్థానానికి దిగ‌జార్చావ్ క‌ద‌రా !

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ఇండియాను వైట్ వాష్ చేస్తాం…రికీ పాంటింగ్ హెచ్చరిక

రిజ్వాన్ చేత‌కాని ద‌ద్ద‌మ్మ‌…భ‌విష్య‌తుల్లో పాకిస్తాన్ తరఫున మళ్లీ ఆడ‌కుండా చేస్తా

రెండు టైటిల్స్ గెలిచినా, RCB ప్లేయ‌ర్లను జంతువుల కంటే హీనంగా చూస్తున్నారు

Big Stories

Advertisement
×