E-Paper
Advertisement

Rohit VS Bumrah: ముంబైలో చీలిక‌..రోహిత్ శ‌ర్మ‌ను బండ బూతులు తిట్టిన బుమ్రా, రూ.50 లక్ష‌ల ఫైన్‌

Rohit VS Bumrah: ముంబైలో చీలిక‌..రోహిత్ శ‌ర్మ‌ను బండ బూతులు తిట్టిన బుమ్రా, రూ.50 లక్ష‌ల ఫైన్‌
Advertisement

Rohit VS Bumrah:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament) నేపథ్యంలో ఇవాళ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ ముంబై ఇండియన్స్ ( Mumbai Indians vs Royal Challengers Bengaluru) మధ్య బిగ్ ఫైట్ జరగనుంది. ముంబై వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ కంటే ముందు కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ముంబై ఇండియన్స్ జట్టులో చీలిక వచ్చినట్లు తెలుస్తోంది. రోహిత్ శర్మ అలాగే బుమ్రా మధ్య గొడవలు జరిగినట్లు నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. బుమ్రా (Bumrah) బౌలింగ్ లో సిక్స్ లు కొట్టినందుకు ఈ ఘటన జరిగినట్లు చెబుతున్నారు. దీంతో ఈ న్యూస్ హాట్ టాపిక్ అయింది.

Also Read: ఐపీఎల్ నుంచి PSLలోకి రావ‌డానికి సిగ్గు అనిపించలేదా ? కుశాల్ మెండిస్ ప‌రువు తీసిన పాక్ రిపోర్ట‌ర్‌

రోహిత్ శర్మను బండ బూతులు తిట్టిన బుమ్రా

Advertisement

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament) నేపథ్యంలో ఇవాళ బెంగళూరు వర్సెస్ ముంబై మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ ప్రారంభం కంటే ముందు ఇవాళ ఉదయం ముంబై ఇండియన్స్ ప్లేయర్లు ప్రాక్టీస్ చేశారు. ఈ క్రమంలో బుమ్రా వేసిన ఓవర్ లో మూడు సిక్సర్లు కొట్టాడు రోహిత్ శర్మ. దీంతో అసహనం వ్యక్తం చేసిన బుమ్రా , రోహిత్ శర్మను ( Rohit Sharma) పచ్చి బూతులు తిట్టాడు. ఈ మేరకు నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. అయితే ఇద్దరి మధ్య గొడవ జరుగుతున్న నేపథ్యంలో హార్దిక్ పాండ్యా చొరవ తీసుకున్నట్లు తెలుస్తోంది.

అయితే ఈ సంఘటనలో క్రమశిక్షణ రాహిత్యానికి బుమ్రా పాల్పడ్డాడని.. భారత క్రికెట్ నియంత్రణ మండలి సీరియస్ అయినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే బుమ్రా పై రూ. 50 లక్షల జరిమానా విధించినట్లు కథనాలు వస్తున్నాయి. దీనిపై ఇప్పటి వరకు అధికారిక ప్రకటన రాలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం ప్రచారం జోరుగా సాగుతోంది. ఇది ఇలా ఉండగా ఇవాళ ముంబై ఇండియన్స్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్ ఉన్న నేపథ్యంలో హార్దిక్ పాండ్యా సేన టాస్ గెలిచింది. ఈ క్రమంలో బౌలింగ్ ముందుగా చేసేందుకు నిర్ణయం తీసుకుంది ముంబై. ఈ క్ర‌మంలో బెంగళూరు మొద‌ట‌ బ్యాటింగ్ చేయనుంది.

Advertisement

 

ఆర్సీబీ వ‌ర్సెస్ ముంబై జ‌ట్లు

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ప్లేయింగ్ XI): ఫిలిప్ సాల్ట్, విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్, రజత్ పాటిదార్(సి), టిమ్ డేవిడ్, జితేష్ శర్మ(w), రొమారియో షెపర్డ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, జాకబ్ డఫీ, సుయాష్ శర్మ

ముంబై ఇండియన్స్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ, ర్యాన్ రికెల్టన్(w), సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా(c), నమన్ ధీర్, మిచెల్ సాంట్నర్, శార్దూల్ ఠాకూర్, ట్రెంట్ బౌల్ట్, మయాంక్ మార్కండే, జస్ప్రీత్ బుమ్రా

Also Read: Tanveer Ahmed: వైభ‌వ్ సూర్యవంశీ “ఇల్లీగ‌ల్ డ్ర‌గ్స్” తీసుకున్నాడు, వెంట‌నే విచార‌ణ చేయండి

 

 

Related News

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

గంభీర్ వెనక కోహ్లీ కుప్పిగంతులు..అస‌భ్యక‌రంగా చేతులు చూపిస్తూ డ్యాన్స్

లార్ట్స్ మైదానంలో ఈ గంట కొట్ట‌డానికి కార‌ణం ఏంటి? దీని వెనుక ఉన్న‌ర‌హ‌స్యం

రోహిత్ శ‌ర్మ‌, కోహ్లీ ఇద్ద‌రూ టీమిండియాకు హార్ట్ బీట్ లాంటోళ్లు..వాళ్ల‌ను ట‌చ్ చేయెద్దు

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 ఫైన‌ల్ మ్యాచ్ టైమింగ్స్ ఇవే..ఇండియాలో లైవ్ ఎప్పుడంటే ?

రెండు మ్యాచ్ ల‌కే గాయ‌ప‌డ్డ బుమ్రాతో వ‌ర‌ల్డ్ క‌ప్ గెలుస్తారా? గ‌వాస్క‌ర్ సీరియ‌స్‌

2027 వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్..త‌న డ్రీమ్ టీమిండియాను ప్ర‌క‌టించిన ర‌విశాస్త్రి

Big Stories

Advertisement
×