Kusal Mendis-PSL 2026: పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ లో ( Pakistan Super League 2026 Tournament) రోజుకో వివాదం రాజు కుంటోంది. నసీమ్ షా పెట్టిన వివాదాస్పద పోస్టు నుంచి మొదలుకొని బాల్ టాంపరింగ్ వరకు రోజుకో వివాదమే పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ సందర్భంగా చోటు చేసుకుంటోంది. అయితే తాజాగా శ్రీలంక స్టార్ ఆటగాడు కుశాల్ మెండిస్ కు (Kusal Mendis) ఘోర అవమానం ఎదురయింది. ప్రస్తుతం పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్ ఆడుతున్న కుశాల్ మెండీస్ ను ఉద్దేశించి పాకిస్తాన్ రిపోర్టర్ ఓ వివాదాస్పదమైన ప్రశ్న అడిగి పరువు తీశాడు. ఐపీఎల్ ఆడిన నువ్వు..మళ్లీ PSL 2026 లీగ్ ఆడటానికి ఎందుకు వచ్చావ్ అంటూ నిలదీశారు. కొంచమైనా సిగ్గుందా ? అంటూ రిపోర్టర్ పరోక్షంగా ఫైర్ అయ్యారు. దీంతో ఎలాంటి ఆన్సర్ ఇవ్వకుండా తలదించుకున్నాడు కుశాల్ మెండిస్. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.
Also Read: Chahal Smoking: వివాదంలో యుజ్వేంద్ర చాహల్..సిగరేట్ తాగి, నడిరోడ్డుపైనే..ఏం బతుకురా నీది
పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ లో భాగంగా ఇప్పటి వరకు 19 మ్యాచ్ లు జరిగాయి. ఇక లేటెస్ట్ గా పెషావర్ జల్మీ vs లాహోర్ ఖలందర్స్ మధ్య బిగ్ ఫైట్ జరిగింది. ఇక ఈ టోర్నమెంట్ నేపథ్యంలో పెషావర్ జల్మీ తరఫున కుశాల్ మెండిస్ బరిలోకి దిగాడు. ఈ రెండు జట్ల మధ్య తాజాగా జరిగిన మ్యాచ్ లో 74 పరుగులతో రాణించాడు కుశాల్ మెండిస్. అంతే కాదు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు కూడా దక్కించుకున్నాడు. ఈ సందర్భంగా ప్రెస్ మీట్ లో పాల్గొన్నాడు కుశాల్ మెండిస్. ఈ నేపథ్యంలోనే కుశాల్ మెండిస్ పరువు తీసేలా పాకిస్తాన్ రిపోర్టర్ దారుణంగా వ్యవహరించాడు. గత ఏడాది జరిగిన ఐపీఎల్ సందర్భంగా పాకిస్తాన్, ఇండియా మధ్య ఉదృక్తతలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ సమయంలో పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్ ను మధ్యలోనే వదిలేసి ఐపీఎల్లోకి ఎంట్రీ ఇచ్చాడు కుశాల్ మెండిస్.
ఈ సందర్భంగా జోష్ బట్లర్ స్థానంలో గుజరాత్ టైటాన్స్ జట్టులో చేరాడు. అయితే, ఈ ఐపీఎల్ సందర్భంగా అతనికి అవకాశం రాకపోగా.. ఇప్పుడు మళ్లీ పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్లోకి ఎంట్రీ ఇచ్చాడు మెండిస్. దీనిపైనే తాజాగా రిపోర్టర్ నిలదీశారు. గత సంవత్సరం డబ్బులు ఎక్కువగా వస్తాయని ఐపీఎల్ లోకి జంప్ అయ్యావ్? ఇప్పుడు మళ్లీ పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్ లోకి రావడానికి సిగ్గుగా లేదా ? అంటూ దారుణంగా కుశాల్ మెండీస్ పరువు తీశాడు రిపోర్టర్. ఇక రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు ఆన్సర్ ఇవ్వకుండా నీళ్లు నమిలాడు. అయితే పక్కనే ఉన్న మరో ప్లేయర్, పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ గురించి మాత్రమే ప్రశ్నలు అడగాలని.. గతం గురించి అసలు అడగకూడదని సరి చెప్పాడు. ఇక ఈ సంఘటనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి.
Also Read: Vaibhav Sooryavanshi: బుమ్రా, హేజిల్‌వుడ్, భువనేశ్వర్ ఎవడైతే నాకేంటి ? కొడితే అవతల పడాల్సిందే
🚨How the hell they can ask such Question from a Professional cricketer, its totally their Choice, you clowns
• Journalist🗣️:- You withdrew from Pakistan Super League Year post Indo Pak War to join Gujrat Titans but PSL gave you respect, will You disrespect again
• Kusal… pic.twitter.com/ibQIdEuPt8
— SheR•ALI (@Sher__Ali) April 11, 2026