Steve Smith: పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Pakistan Super League 2026 Tournament) చాలా ఉత్కంఠ భరితంగా సాగుతున్న సంగతి తెలిసిందే. ఈ టోర్నమెంట్ లో ప్రస్తుతం నాకౌట్ మ్యాచ్ లు జరుగుతున్నాయి. ఇక ఈ పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ లో భాగంగా నిన్న ఎలిమినేటర్ వన్ మ్యాచ్ ముల్తాన్ సుల్తాన్స్ వర్సెస్ హైదరాబాద్ కింగ్స్ మెన్ ( Multan Sultans vs Hyderabad Kingsmen) మధ్య జరిగింది. ఇందులో అద్భుతంగా రాణించిన హైదరాబాద్ కింగ్స్ మెన్ ఎనిమిది వికెట్ల తేడాతో విజయమందుకుంది. అయితే ఈ మ్యాచ్ లో ముల్తాన్ సుల్తాన్స్ ఆటగాడు స్టీవ్ స్మిత్ (STEVE SMITH ) తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయాడు. డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్లిన తర్వాత బ్యాట్ నేలకేసి కొట్టాడు స్టీవ్ స్మిత్. తన వికెట్ కోల్పోయిన తర్వాత ఆగ్రహం వ్యక్తం చేసిన స్టీవ్ స్మిత్, కట్టలు తెంచుకున్న కోపంతో ఊగిపోయాడు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంటుకు పోటీగా కొనసాగుతున్న పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 చాలా ఉత్కంఠ భరితంగా సాగుతోంది. ప్రస్తుతం నాకౌట్ మ్యాచ్ లు జరుగుతుండగా.. ముల్తాన్ సుల్తాన్స్ వర్సెస్ హైదరాబాద్ కింగ్స్ మెన్ మధ్య ఎలిమినేటర్ 1 మ్యాచ్ జరిగింది. అయితే ఈ మ్యాచ్ లో ముల్తాన్ సుల్తాన్స్ మొదటి బ్యాటింగ్ చేసింది. ఈ నేపథ్యంలో ఓపెనర్ గా బరిలోకి దిగిన స్టీవ్ స్మిత్ 13 పరుగులకు ఔట్ అయ్యాడు. మహమ్మద్ అలీ బౌలింగ్ లో స్టీవ్ స్మిత్ భారీ షాట్ ఆడాడు. ఈ క్రమంలో మాజ్ సదాకత్ క్యాచ్ అందుకున్నాడు. అయితే, స్టీవ్ స్మిత్ ఔట్ అయిన తరుణంలో క్యాచ్ అందుకున్న మాజ్ సదాకత్ ఓవరాక్షన్ చేసాడు. పెవిలియన్ కు వెళ్లిపో అంటూ రెచ్చగొట్టాడు. దీంతో స్మిత్ ఆగ్రహానికి లోనైయ్యాడు. డ్రెస్సింగ్ రూంలోకి వెళ్లిన తర్వాత బ్యాట్ నేల కేసి కొట్టాడు. ఈ సంఘటన వైరల్ గా మారింది.
లాహూర్ లోని గడాఫీ వేదికగా ముల్తాన్ సుల్తాన్స్ వర్సెస్ హైదరాబాద్ కింగ్స్ మెన్ ( Multan Sultans vs Hyderabad Kingsmen) మధ్య మ్యాచ్ జరిగింది. ఇందులో అద్భుతంగా రాణించిన హైదరాబాద్ 8 వికెట్ల తేడాతో విజయాన్ని నమోదు చేసుకుంది. మొదట ముల్తాన్ సుల్తాన్స్ బ్యాటింగ్ చేసి 159 పరుగులు సాధించింది. ఇక ఈ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో అద్భుతంగా రాణించిన హైదరాబాద్ (Hyderabad Kingsmen) ) విజయాన్ని నమోదు చేసుకుంది. 15.2 ఓవర్లలో లక్ష్యాన్ని చేదించి విజయకేతనం ఎగురవేసింది హైదరాబాద్.
🚨 STEVE SMITH IN FULL ANGRY MODE. 😳
– Steve Smith lost his control while he was going to the dressing room.
– He threw his bat in anger because Maaz Sadaqat showed him aggression after dismissing him. 👀 pic.twitter.com/noT2WYkVGR
— Abdullah. (@Abdullahh_56) April 29, 2026