E-Paper
Advertisement

Lungi Ngidi injury: కేవ‌లం 11 నిమిషాలే, ఇండియా తడాఖా ఏంటో చూపించిన‌ ఢిల్లీ పోలీసులు, గ్రీన్ కారిడార్ వేసి మరీ

Lungi Ngidi injury: కేవ‌లం 11 నిమిషాలే, ఇండియా తడాఖా ఏంటో చూపించిన‌ ఢిల్లీ పోలీసులు, గ్రీన్ కారిడార్ వేసి మరీ
Advertisement

Lungi Ngidi injury: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 20026 Tournament) చాలా రసవత్తరంగా సాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ టోర్నమెంట్ లో సగం మ్యాచులు పూర్తయ్యాయి. ఇవాళ శనివారం కావడంతో రెండు మ్యాచ్ లు జరిగాయి. అయితే ఇందులో ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ ( Delhi Capitals vs Punjab Kings) మధ్య మ్యాచ్ జరగగా.. లుంగీ ఎంగిడీ తీవ్రంగా గాయపడ్డాడు. పంజాబ్ ఆటగాడు ప్రియాంష్ ఆర్య ఇచ్చిన ఓ క్యాచ్‌ అందుకోబోయి తలకు దెబ్బ తగిలించుకున్నాడు. వెనకాలకు లుంగీ ఎంగిడీ ( Lungi Ngidi) పడడంతో.. అతని తలకు తీవ్రమైన గాయమైంది. దీంతో వెంటనే అలర్ట్ అయిన వైద్యులు.. ఢిల్లీలోని లోకల్ ఆసుపత్రికి తరలించారు.

Also Read: Inzamam-ul-Haq: Inzamam-ul-Haq: 30 బంతుల్లో కోహ్లీ అర్ధ శ‌త‌కం చేస్తే, బాబర్ మాత్రం సెంచ‌రీ చేస్తాడు

కేవలం 11 నిమిషాల్లోనే ఆసుపత్రికి తరలించిన ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు

Advertisement

ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మధ్య అరుణ్ జైట్లీ వేదికగా మ్యాచ్ జరిగింది. ఢిల్లీ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ సందర్భంగా లుంగీ ఎంగిడీ ( Lungi Ngidi injury) తీవ్రంగా గాయపడ్డాడు. అయితే అరుణ్ జైట్లీ స్టేడియం ( Arun Jaitley Stadium, Delhi) నుంచి స్థానికంగా ఉన్న మ్యాక్స్ ఆసుపత్రికి లుంగీ ఎంగిడీని కేవలం 11 నిమిషాల్లోనే ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు తరలించారు. వాస్తవంగా ఢిల్లీలో విపరీతమైన ట్రాఫిక్ ఉంటుంది. ఈ సంఘటన సాయంత్రం జరిగిన నేపథ్యంలో ట్రాఫిక్ మరింత ఎక్కువగానే పెరిగింది. అయితే ఐపీఎల్ ప్లేయర్ కు గాయమైంది అన్న వార్త రాగానే.. గ్రీన్ కారిడార్ ( ట్రాఫిక్ అడ్డంకులు లేకుండా చేయ‌డం Green Corridor) ఏర్పాటు చేశారు. స్టేడియం నుంచి రాజేంద్రనగర్ లో ఉన్న మ్యాక్స్ ఆసుపత్రి వరకు గ్రీన్ కారిడార్‌ ఏర్పాటు చేసిన ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు… లుంగీ ఎంగిడీ ఉన్న అంబులెన్స్ ను కేవలం 11 నిమిషాల్లోనే తరలించారు.

లుంగీ ఎంగిడీ హెల్త్ అప్డేట్

ఎక్కడికక్కడ ట్రాఫిక్ ను ఆపేసిన పోలీసులు.. కేవలం అంబులెన్స్ కు మాత్రమే దారి ఇచ్చారు. ఇలా 11 నిమిషాల్లో అతని ఆసుపత్రికి తరలించిన నేపథ్యంలో… లుంగీ ఎంగిడీ బతికి బయటపడ్డాడు. అతని ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని వైద్యులు ప్రకటన చేశారు. దీంతో బీసీసీఐ పెద్దలతో పాటు ఢిల్లీ క్యాపిటల్స్ ఊపిరి పీల్చుకుంది. ఒకవేళ ఆ ట్రాఫిక్ లో చిక్కుకొని లుంగీ ఎంగిడీకి ఏదైనా ప్రమాదం జరిగి ఉంటే.. అంతర్జాతీయంగా ఇండియా పరువు పోయేది. ఈ నేపథ్యంలో ఢిల్లీ పోలీసులను మెచ్చుకుంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇక ఈ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ మొదట బ్యాటింగ్ చేసి, నిర్ణీత 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 264 పరుగులు సాధించిన సంగతి తెలిసిందే. అయితే ఈ లక్ష్యాన్ని పంజాబ్ కింగ్స్ అవలీలగా చేదించింది. కేవలం 18.5 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 265 పరుగులు చేసి విజయం సొంతం చేసుకుంది.

Advertisement

Also Read: Digvesh Vs Bishnoi: దిగ్వేష్ ను ట్రోల్ చేసిన‌ రవి బిష్ణోయ్..ఇక జ‌న్మ‌లో ఓవ‌రాక్ష‌న్ చేయ‌డు Digvesh Vs Bishnoi

 

 

Related News

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

గంభీర్ వెనక కోహ్లీ కుప్పిగంతులు..అస‌భ్యక‌రంగా చేతులు చూపిస్తూ డ్యాన్స్

లార్ట్స్ మైదానంలో ఈ గంట కొట్ట‌డానికి కార‌ణం ఏంటి? దీని వెనుక ఉన్న‌ర‌హ‌స్యం

రోహిత్ శ‌ర్మ‌, కోహ్లీ ఇద్ద‌రూ టీమిండియాకు హార్ట్ బీట్ లాంటోళ్లు..వాళ్ల‌ను ట‌చ్ చేయెద్దు

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 ఫైన‌ల్ మ్యాచ్ టైమింగ్స్ ఇవే..ఇండియాలో లైవ్ ఎప్పుడంటే ?

Big Stories

Advertisement
×