Kavya Maran : సాధారణంగా క్రికెట్ లో రకరకాల సంఘటనలు చోటు చేసుకుంటాయి. ముఖ్యంగా సన్ రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్య మారన్ వల్ల చాలా మంది కీలక ఆటగాళ్లకు నష్టం జరుగుతుంది. వారిలో ప్రధానంగా సన్ రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్య మారన్ పలువురు కీలక ఆటగాళ్లను మోసం చేసింది. వారిలో SRH జట్టుకు కెప్టెన్లుగా వ్యవహరించిన ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ డేవిడ్ వార్నర్, సౌతాఫ్రికా కీలక ఆటగాడు మార్క్రమ్ లను మోసం చేసింది. కావ్య మారన్ ఎప్పుడు తన సొంత నిర్ణయం తీసుకోదని.. ఇతరుల నిర్ణయాలపై ఆధారపడుతుందని అందుకే ఇలా జరుగుతుందని పలువురు చర్చించుకోవడం గమనార్హం.
ముఖ్యంగా డేవిడ్ వార్నర్ ఐపీఎల్ ప్రారంభంలో ఢిల్లీ క్యాపిటల్స్ కి ప్రాతినిధ్యం వహించాడు. ఆ తరువాత 2014లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు తరపున ఆడాడు. 2015లో సన్ రైజర్స్ కెప్టెన్ గా వ్యవహరించాడు. ఆ తరువాత 2016 లో ఎలిమినేటర్ మ్యాచ్ నుంచి ఫైనల్ మ్యాచ్ లో విజయం సాధించేంత వరకు వార్నర్ చాలా పోరాడాడు. వార్నర్ ఐపీఎల్ లో సన్ రైజర్స్ కి ట్రోఫీ తీసుకొచ్చినప్పటికీ కావ్య పాప మాత్రం అతన్ని పక్కకు పెట్టింది. అతనితో వాటర్ బాటిల్స్ మోపించారు. తనని వదిలేయడం కూడా జరిగింది. 2024లో తిరిగి వార్నర్ ఢిల్లీ క్యాపిటల్స్ కి వెళ్లారు. ఈ సీజన్ లో క్లాసెన్, మార్క్రమ్ వంటి కీలక ఆటగాళ్లతో ఐపీఎల్ ఫైనల్ కి చేరుకుంది SRH. కానీ ఫైనల్ లో కోల్ కతా నైట్ రైడర్స్ చేతిలో ఓటమి పాలైంది. అదే ఊపుతో మరోసారి 2025లో బరిలోకి దిగినప్పటికీ ఈసారి ప్లే ఆప్స్ కి కూడా చేరుకోకుండా ఇంటిబాట పట్టింది.
డేవిడ్ వార్నర్ తో పాటు సౌతాఫ్రికా కీలక ఆటగాడు మార్క్రమ్ ని కూడా పక్కకు పడేసింది. 2022 నుంచి 2024 వరకు మార్క్రమ్ సన్ రైజర్స్ జట్టు తరుపున కీలకంగా వ్యవహరించాడు. వార్నర్ తరువాత తను కెప్టెన్సీ బాధ్యతలను కూడా అందుకున్నాడు. ఆ తరువా ఆస్ట్రేలియా ఆటగాడు కమ్మిన్స్ ప్రస్తుతం కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. అయితే ఐపీఎల్ తో పాటు SA లీగ్ లో సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్ గతలో ఎయిడెన్ మార్క్రమ్ కెప్టెన్ గా వ్యవహరించాడు. మార్క్రమ్ కెప్టెన్సీలో వరుసగా రెండుసార్లు ఛాంపియన్ గా నిలిచింది. ఈ సారి ఫ్రాంచైజీ మార్క్రమ్ ను రిటైన్ చేసుకోకపోవడం గమనార్హం. దీంతో మార్క్రమ్ డర్బన్ సూపర్ జెయింట్స్ జట్టుకు రూ.7కోట్లకు అమ్ముడుపోయాడు. మార్క్రమ్ స్థానంలో SA లీగ్ తొలి సీజన్ నుంచి సన్ రైజర్స్ ఈస్టర్న్ కేఫ్ జట్టులో ఉన్న ట్రిస్టన్ స్టబ్స్ కి కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. 25 ఏళ్ల ట్రిస్టన్ స్టబ్స్ ఓ పవర్ హిట్టర్ గా ప్రసిద్ధి చెందాడు. SA లీగ్ 20 లోగత మూడు సీజన్లలో అతను మొత్తం 723 పరుగులు సాధించడం విశేషం. ఈసారి ఐపీఎల్ లో మరెవ్వరినీ మోసం చేస్తుందోనని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.