Heavy Rains: తెలుగు రాష్ట్రాలకు అలర్ట్..! మరో మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.. ఉపరితల ఆవర్తన ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.
తెలంగాణకు భారీ వర్ష సూచన..
తెలంగాణలో మరో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.ఈ క్రమంలో కామారెడ్డి, సంగారెడ్డి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్.. గరిష్ట ఉపరితల గాలి వేగం గంటకు 40 కి.మీ కంటే తక్కువ తేలికపాటి ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.
ఈ ప్రాంతాల్లో ఎల్లో అలర్ట్..
అంతేకాకుండా ఆదిలాబాద్, జగిత్యాల, జోగులాంబ గద్వాల్, మహబూబ్ నగర్, మెదక్, నాగర్ కర్నూల్, నారాయణపేట, నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, వికారాబాద్, వనపర్తి, ఆసిఫాబాద్, మంచిర్యాల, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాలకు ఎల్లో అలర్ట్.. జారీ చేసింది. రానున్న 2-3 గంటల్లో తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. ముఖ్యంగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తున్నప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
హైదరాబాద్‌లో ఈ ప్రాంతాల్లో భారీ వర్షం..
నేడు హైదరాబాద్‌లో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ అధికారులు తెలిపారు. ఈ ప్రాంతాల్లో కుండపోత వర్షాలు పడే అవకాశం ఉందని చెబుతున్నారు. బాలాపూర్, బడంగ్‌పేట్, మీర్ పేట్, బీఎన్ రెడ్డి, హస్థినాపురం, బోయిన్ పల్లి, సికింద్రాబాద్, బేగం పేట్, మల్కాజ్ గిరి, ముషీరాబాద్, ఉప్పల్, నాగోల్, గుర్రాంగూడా, కూకట్ పల్లి వంటి ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. ఆయా ప్రాంతాల్లో పిడుగులు కూడా పడే అవకాశం ఉన్నట్లు తెలిపారు. కావున పట్టణ వాసి ప్రజలు అప్రమత్తంగా ఉండలని చెబుతున్నారు.
ఏపీలో రానున్న 48 గంటల్లో కుండపోత వర్షాలు..
బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. వాయువ్య దిశగా కదులుతున్న అల్పపీడనం కారణంగా… రానున్న 48 గంటల్లో బలపడే అవకాశం ఉంది. దీని ప్రభావంతో తీర ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురవనున్నాయి. ఆంధ్రా, ఒడిశా, బెంగాల్ తీరాలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేశారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరిస్తున్నారు.
Also Read: నేపాల్‌లో చిక్కుకున్న తెలుగువారిని.. సురక్షితంగా రాష్ట్రానికి తీసుకురానున్న ఏపీ ప్రభుత్వం
ఈనెల 13న మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం..
రానున్న మూడు రోజులు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, ఎన్టీఆర్, బాపట్ల, పల్నాడు జిల్లాలతో పాటు.. కాకినాడ, ఈస్ట్ గోదావరి, కోనసీమ, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షం పడుతుందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈనెల 13న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతవరణ శాఖ అధికారులు తెలిపారు.
తెలంగాణకు వర్ష సూచన
మరో రెండు, మూడు గంటల్లో రాష్ట్రంలోని ఆయా జిల్లాల్లో వర్షాలు
కామారెడ్డి, సంగారెడ్డి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్.. గరిష్ట ఉపరితల గాలి వేగం గంటకు 40 కి.మీ కంటే తక్కువ తేలికపాటి ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం
ఆదిలాబాద్, జగిత్యాల, జోగులాంబ గద్వాల్, మహబూబ్… https://t.co/cS62LvN66F pic.twitter.com/O5QTuu5YOp
— BIG TV Breaking News (@bigtvtelugu) September 11, 2025