T20 World Cup 2026: టి20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ ( T20 World Cup 2026) షెడ్యూల్, గ్రూపుల గురించి కీలక అప్డేట్ వచ్చేసింది. ఎప్పటినుంచి మ్యాచ్ లు జరుగుతాయి ? ఏ గ్రూప్ లో ఏ జట్టు ఉంది అనే దానిపైన జాతీయ మీడియాలో రకరకాల కథనాలు వస్తున్నాయి. ఈ కథనాల ప్రకారం టీమ్ ఇండియా ( Team India) అలాగే పాకిస్తాన్ ( Pakistan) మరోసారి ఒకే గ్రూపులో ఉండబోతున్నాయి. ఇండియా, పాకిస్తాన్, నమీబియా, నెదర్లాండ్స్, యూఎస్ఏ ఈ ఐదు జట్లు గ్రూప్ A లో ఉన్నట్లు నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి.
గ్రూప్ ఏలో టీమిండియా అలాగే పాకిస్తాన్ ( India Vs Pakistan ) లాంటి జట్లు ఉండగా, గ్రూపు బీలో శ్రీలంక, ఆస్ట్రేలియా, జింబాబ్వే, ఐర్లాండ్ జట్లు ఉన్నాయి. గ్రూప్ సిలో ఇంగ్లాండ్, వెస్టిండీస్, బంగ్లాదేశ్, నేపాల్, ఇటలీ లాంటి టీమ్స్ ఉండనున్నాయి. గ్రూప్ డి లో న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, ఆఫ్గనిస్తాన్, యూఏఈ, కెనడా లాంటి టీమ్స్ ఉండనున్నట్లు కథనాలు వస్తున్నాయి. ఇలా మొత్తం 20 జట్లను 4 గ్రూప్‌లుగా విభజించనున్నారట. ఒక్కో గ్రూప్ లో 5 జట్ల చొప్పున ఉంటాయి అన్న మాట.
గ్రూప్ 1: టీమిండియా, పాకిస్తాన్, నెదర్లాండ్స్, నమీబియా, USA
గ్రూప్ 2: ఇంగ్లాండ్, WI, బంగ్లాదేశ్, నేపాల్, ఇటలీ
గ్రూప్ 3: దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, ఆఫ్ఘనిస్తాన్, UAE, కెనడా
గ్రూప్ 4: ఆస్ట్రేలియా, శ్రీలంక, జింబాబ్వే, ఒమన్, ఐర్లాండ్
టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ లో భాగంగా మరోసారి పాకిస్తాన్ అలాగే భారత రెండు తలపడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ మ్యాచ్ ఫిబ్రవరి 15వ తేదీన కొలంబో వేదికగా జరగనుంది. ఇండియాలో పాకిస్తాన్ పర్యటించబోదు కాబట్టి, కొలంబో వేదికగా ఈ మ్యాచ్ జరిగే ఛాన్స్ ఉంది. ఇక టీమిండియా, పాకిస్తాన్ సెమీ ఫైనల్ , ఫైనల్స్ కు దూసుకు వెళ్తే కచ్చితంగా కొలంబో వేదికగానే ఈ రెండు మ్యాచ్ లు జరుగుతాయి. పాకిస్తాన్ సెమీస్, ఫైనల్ కు వెళ్లకపోతే అహ్మదాబాద్ లో ఫైనల్, సెమీ ఫైనల్ ముంబై వాంఖడే స్టేడియంలో ఉంటుంది. ఇక టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ ఫిబ్రవరి 7వ తేదీన ప్రారంభం కానుంది. మార్చి 8వ తేదీన ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఫైనల్ మ్యాచ్ కు అహ్మదాబాద్ వేదిక కానుంది. పాకిస్తాన్ ఫైనల్ కు వస్తే మాత్రం కొలంబోలో మ్యాచ్ ఉంటుంది. ముంబై, ఢిల్లీ, చెన్నై, కోల్‌కతా, అహ్మదాబాద్, కొలంబో వేదికలుగా టీ20 వరల్డ్ కప్ లీగ్ దశ మ్యాచ్ లు జరిగే ఛాన్సు ఉంది.
🚨 GROUPS FOR T20I WORLD CUP 2026 🚨 [Cricbuzz]
1) India, Pakistan, USA, Namibia, Netherlands.
2) Australia, Sri Lanka, Zimbabwe, Ireland, Oman.
3) England, West Indies, Italy, Bangladesh, Nepal.
4) South Africa, New Zealand, Afghanistan, UAE, Canada. pic.twitter.com/CEROU5Oz06
— Johns. (@CricCrazyJohns) November 22, 2025
🚨 INDIA'S GROUP IN THE T20 WORLD CUP 2026 🚨
– India.
– USA.
– Pakistan.
– Namibia.
– Netherlands. pic.twitter.com/FP9brCUw86— Tanuj (@ImTanujSingh) November 21, 2025