E-Paper
Advertisement

Ishan Kishan: వివాదంలో ఇషాన్ కిష‌న్..టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ కాదు, నాకు తిన‌డం, ప‌డుకోవ‌డ‌మే కావాలి !

Ishan Kishan: వివాదంలో ఇషాన్ కిష‌న్..టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ కాదు, నాకు తిన‌డం, ప‌డుకోవ‌డ‌మే కావాలి !
Advertisement

Ishan Kishan: 2026 టి-20 ప్రపంచ కప్ కి ఇంకా 50 రోజుల సమయం ఉంది. అయితే శనివారం రోజు ముంబైలో జరిగిన సమావేశంలో బీసీసీఐ సెలెక్టర్లు టి-20 వరల్డ్ కప్ కోసం 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును ప్రకటించారు. ఈ జట్టులో అనూహ్యంగా టెస్ట్, వన్డేల కెప్టెన్ గిల్ కి చోటు దక్కలేదు. ఊహించినట్లుగానే సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీలో అద్భుతంగా రాణించి, సెంచరీతో అలరించిన ఇషాన్ కిషన్ ని సెలెక్టర్లు ఎంపిక చేశారు. గతంలో బీసీసీఐ చెప్పిన మాట వినలేదని అద్భుతమైన ఫామ్ లో ఉన్న ఇతడిని ఉన్నట్టుండి జట్టులో నుంచి తప్పించిన విషయం తెలిసిందే. ఇప్పుడు అదే ఫామ్ ని కొనసాగిస్తూ జట్టులో చోటు దక్కించుకున్నాడు.

Also Read: T20 World Cup 2026 India Squad: గిల్ ను తీసేశారు, కానీ హ‌ర్షిత్ రాణాను ట‌చ్ చేస్తే మాడి మ‌సైపోతారు

Advertisement

 

రెండు సంవత్సరాలు జట్టుకు దూరంగా ఉన్న కిషన్:

ఇషాన్ కిషన్ దాదాపు రెండు సంవత్సరాలుగా జట్టుకు దూరంగా ఉన్నాడు. తాజాగా దేశవాలి క్రికెట్ లో అద్భుత ప్రదర్శనతో తిరిగి జట్టులో స్థానం సంపాదించుకున్నాడు. 2024 ఫిబ్రవరిలో ఇషాన్ కిషన్ బిసిసిఐ సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి చోటు కోల్పోయాడు. ఆ తర్వాత ఎంతగానో కష్టపడ్డాడు. ఝార్ఖండ్ టీమ్ ని సయ్యద్ ముస్తక్ అలీ టోర్నీ విజేతగా నిలిపాడు. ఇషాన్ కిషన్ చివరిసారిగా 2023 నవంబర్ 28న ఆస్ట్రేలియాపై టి-20 మ్యాచ్ ఆడాడు. సుమారు 753 రోజులపాటు టీమిండియా జెర్సీకి దూరంగా ఉన్న కిషన్.. ఆశలు వదులుకోకుండా దేశవాళీ క్రికెట్ లో పరుగుల వరద పారిస్తూ ఇప్పుడు నేరుగా వరల్డ్ కప్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. తాజాగా సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీలో పది మ్యాచ్ లలో 57.44 సగటుతో ఏకంగా 517 పరుగులు చేశాడు. ఇందులో అతడి స్ట్రైక్ రేట్ 197.33 గా ఉండడం విశేషం. ఇక ఈ టోర్నీలో ఏకంగా 33 సిక్సర్లు బాదాడు. హర్యానాతో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో అద్భుతమైన సెంచరీతో జట్టుకు ట్రోఫీని అందించాడు.

Advertisement

 

వివాదంలో ఇషాన్ కిషన్:

టి-20 వరల్డ్ కప్ కి ఇషాన్ కిషన్ సెలెక్ట్ అయిన సందర్భంగా అతడి స్పందన తెలుసుకునేందుకు ఓ యాంకర్ ప్రయత్నించింది. ఈ సందర్భంలో అతడు తన వ్యాఖ్యలతో వివాదంలో చిక్కుకున్నాడు. భారత జట్టులోకి మళ్ళీ తిరిగి రావడంపై ఇషాన్ కిషన్ ఇచ్చిన సమాధానాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఇషాన్ కిషన్ స్పందన తెలుసుకునేందుకు రిపోర్టర్ ఈ విధంగా ప్రశ్నించింది. ” టీం ఇండియాకు తిరిగి రావడం పై మీ ఫీలింగ్ ఏంటి..? ” అని అడగగా.. ” గుడ్ గుడ్ థాంక్యూ” అని సమాధానం ఇచ్చాడు.

Also Read: U19 Asia Cup 2025 Final: తెర‌పైకి ఆసియా ‘కప్’ గొడవ..ట్రోఫీ ఇస్తాడా? లేక మ‌రోసారి నఖ్వీ పారిపోతాడా!

ఇక జట్టులో చేరే ముందు ఎలాంటి ప్రిపరేషన్ చేస్తున్నారు..? అనే ప్రశ్నకు మాత్రం ఎవ్వరు ఊహించని విధంగా సమాధానం ఇచ్చాడు. ” జస్ట్ గోయింగ్ టు స్లీప్. బై, థాంక్యు” అంటూ చేతిని ఊపి వెళ్ళిపోయాడు”. దీంతో ఇషాన్ కిషన్ చేసిన వ్యాఖ్యలపై పలువురు క్రీడాభిమానులు మండిపడుతున్నారు. అతడు చేసిన వ్యాఖ్యలు నాకు తినడం, పడుకోవడమే కావాలనే విధంగా ఉన్నాయని.. అతడి సమాధానానికి యాంకర్ కూడా షాక్ అయిందని కామెంట్స్ చేస్తున్నారు. చాలా కాలం తర్వాత జట్టులోకి తిరిగి వస్తున్న సమయంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని క్రికెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

Related News

ఈ ద‌ద్ద‌మ్మకు టీమిండియాపై ఆడ‌టం చేత‌కాదు…స‌ల్మాన్ సెంచ‌రీపై బాజిద్ ఖాన్ ఫైర్‌

శ‌భాష్ స‌ల్మాన్‌…నీ దెబ్బ‌కు న‌ఖ్వీ గాడి రెండు చెంప‌లు వాచిపోయింటాయ్ ?

అస‌లు నీకు బుర్ర ఉందా ? ష‌న‌కా బ్యాటింగ్ పై గ్యారీ కిర్‌స్టెన్ సీరియ‌స్‌

ఆ పాట‌లు పెట్టి ధోని న‌న్ను రెచ్చ‌గొట్టేవాడు…వీరూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

బాబ‌ర్‌, షాహీన్‌, షాబాద్, హారిస్ రోజులు లెక్క‌బెట్టుకోవాల్సిందే…పాకిస్తాన్ నుంచి త‌రిమేసే టైమ్ వ‌చ్చింది!

2027 వ‌ర‌ల్డ్ క‌ప్ పాకిస్తాన్ కు అందిస్తా..లేక‌పోతే త‌ల న‌రుక్కుంటా ?

డ‌బుల్ సెంచ‌రీ చేయ‌కుండా ద్రవిడ్ అడ్డుకున్నాడు..స‌చిన్ సంచ‌ల‌నం !

కావ్య పాప‌ పెళ్లికి పాకిస్తాన్ క్రికెట‌ర్లు…SRHను బ్యాన్ చేయాలంటూ మ‌ళ్లీ పోస్టులు ?

Big Stories

Advertisement
×