E-Paper
Advertisement

ZIM qualified into super 8: కొంపముంచిన వ‌రుణుడు, ప్ర‌పంచ క‌ప్ నుంచి నిష్క్ర‌మించిన‌ ఆస్ట్రేలియా..సూప‌ర్ 8 కు జింబాబ్వే

ZIM qualified into super 8: కొంపముంచిన వ‌రుణుడు, ప్ర‌పంచ క‌ప్ నుంచి నిష్క్ర‌మించిన‌ ఆస్ట్రేలియా..సూప‌ర్ 8 కు జింబాబ్వే

ZIM qualified into super 8: టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్  ( T20 World Cup 2026 tournament )
నేపథ్యంలో ఆస్ట్రేలియా ( Australia) జట్టుకు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. ఆస్ట్రేలియాకు వర్షం విలన్ గా మారిన నేపథ్యంలో, ఈ టోర్నమెంట్ నుంచి నిష్క్రమించింది. ఇవాళ ఐర్లాండ్ వర్సెస్ జింబాబ్వే ( Ireland vs Zimbabwe )
మధ్య శ్రీలంక‌లోని ప‌ల్లెకెలే ( Pallekele International Cricket Stadium, Pallekele ) వేదికగా 32వ మ్యాచ్ జరగాల్సి ఉంది. అయితే ఈ రెండు జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం ( Rain ) కారణంగా రద్దయింది.. దీంతో ఐర్లాండ్ అలాగే జింబాబ్వే చెరో పాయింట్ సంపాదించాయి. దీంతో పాయింట్ల పట్టికలో ఐదు పాయింట్లు సాధించిన జింబాబ్వే గ్రూప్ బి నుంచి సూపర్ 8కు దూసుకు వెళ్ళింది. ఈ దెబ్బకు ఆస్ట్రేలియా ( Australia Eliminated) ఇంటికి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది.

Also Read: IND VS PAK: ఇక‌ పాకిస్తాన్ కు సిగ్గు రాదు..గెల‌వ‌డం చేత‌కాక‌, చివ‌ర‌కు హిట్ వికెట్ చేసేందుకు కుట్ర‌

ప్ర‌పంచ క‌ప్ నుంచి నిష్క్ర‌మించిన‌ ఆస్ట్రేలియా..సూప‌ర్ 8 కు జింబాబ్వే

 

టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ( T20 World Cup 2026 tournament ) చాలా రసవత్తరంగా సాగుతోంది. ముందుగా అందరూ ఊహించిన రీతిగానే పసికూనలు అదరగొట్టాయి. ఇందులో భాగంగానే తాజాగా ఆస్ట్రేలియాకు షాక్ ఇచ్చిన జింబాబ్వే సూపర్ 8 లోకి అడుగుపెట్టింది. గ్రూప్ స్టేజిలో ఆస్ట్రేలియాను ఓడించిన జింబాబ్వే మెరుగైన రన్ రేట్ అలాగే పాయింట్లు దక్కించుకుంది. దానికి తగ్గట్టుగానే వరుణుడు జింబాబ్వేకు సహాయం చేశాడు. ఇవాళ జింబాబ్వే వర్సెస్ ఐర్లాండ్ మధ్య మ్యాచ్ జరగాల్సి ఉంది. కానీ పల్లె కేలే వేదికగా జరగాల్సిన ఈ మ్యాచ్ కు మధ్యాహ్నం నుంచి వర్షం పడుతూనే ఉంది. దీంతో మ్యాచ్ రద్దు అయినట్లు ప్రకటించారు అంపైర్లు. దీంతో జింబాబ్వే ఖాతాలో మరో పాయింట్ చేరింది. ఈ దెబ్బకు ఆస్ట్రేలియా ( Australia Eliminated) గ్రూప్ స్టేజ్ నుంచి ఇంటి దారి పట్టింది. అటు జింబాబ్వే మాత్రం గ్రూప్ స్టేజి నుంచి సూపర్ 8 లోకి అడుగుపెట్టింది. దీంతో జింబాబ్వే శిబిరంలో సంబరాలు చేసుకుంటున్నారు.

సూపర్ 8 లోకి ఇప్పటివరకు చేరిన జట్లు ఇవే

టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో ఇప్పటి వరకు ఏడు జట్లు సూపర్ 8 ( Super 8 stage) చేరుకున్నాయి. ఇందులో గ్రూపు వన్ లో టీమిండియా, జింబాబ్వే, వెస్టిండీస్ అలాగే దక్షిణాఫ్రికా స్థానం దక్కించుకున్నాయి. అటు గ్రూప్ బీలో శ్రీలంక, ఇంగ్లాండ్, న్యూజిలాండ్ స్థానం దక్కించుకున్నాయి. ఇక మరో స్థానం కోసం పాకిస్తాన్ తో పాటు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా పోటీ పడుతున్నాయి. రెండు రోజుల్లో దీనిపై క్లారిటీ రానుంది. కాగా సూపర్ 8లో భాగంగా జింబాబ్వే, వెస్టిండీస్ అలాగే దక్షిణాఫ్రికాతో త‌ల‌ప‌డ‌నుంది టీమిండియా.

Also Read: IND vs PAK cricketers car collection: టీమిండియా, పాక్ క్రికెట‌ర్ల కార్ల క‌లెక్ష‌న్‌, వర్త్ వర్మ వర్త్.. క‌ళ్లు చెదిరిపోవాల్సిందే

 

 

Related News

Jos Buttler: న‌న్ను నంబ‌ర్ 4లో పంపి, ఆశిష్ నెహ్రానే స‌ర్వ నాశ‌నం చేశాడు !

బాబ‌ర్ పై ట్రోల్స్‌..ఇండియ‌న్స్ అనుకుని, ఆస్ట్రేలియా ఫ్యాన్స్ ను అరెస్ట్ చేసిన పాక్ !

మైదానంలోనే స్మోకింగ్..మ‌రో వివాదంలో టిమ్ డేవిడ్, ఇక ప‌ర్మినెంట్ బ్యాన్ !

టీమిండియాకు బిగ్ షాక్‌..బంగ్లాదేశ్ లోనే ఆసియా కప్ 2027, షెడ్యూల్ ఇదే

ఎలిమినేట‌ర్ లో ఓడిపోయిన‌ SRHకు ఊపిరిపోసిన పాకిస్తాన్ ప్లేయ‌ర్

రెండోసారి ఛాంపియ‌న్ గా RCB..ప్ర‌మాదంలో సూర్య‌, శ్రేయ‌స్ అయ్య‌ర్ భ‌విష్య‌త్తు !

Tanveer Ahmed: విరాట్ కోహ్లీ మ‌గాడైతే, పాకిస్తాన్ పిచ్ ల‌పై ఆడి చూపించాలి

లాహోర్ గ‌డ్డ‌పై విరాట్ కోహ్లీ ప్లకార్డులు…గూస్ బంప్స్ రావాల్సిందే

Big Stories

×