Tanveer Ahmed On ball Tempering: పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( PSL 2026 ) నేపథ్యంలో బాల్ టాంపరింగ్ ( PSL ball Tempering) వ్యవహారం తెరపైకి వచ్చింది. ఆదివారం రోజున లాహోర్ ఖలందర్స్ vs కరాచీ కింగ్స్ మధ్య మ్యాచ్ జరగగా.. ఫఖర్ జమాన్ బాల్ టాంపరింగ్ కు పాల్పడ్డాడు. హరిస్ రవూఫ్, లహోర్ కెప్టెన్ షాహీన్ అఫ్రిది ( Shaheen Shah Afridi ) సమక్షంలోనే ఈ సంఘటన చోటు చేసుకుంది. దీంతో ఈ ముగ్గురుపై బ్యాన్ విధిస్తారని చర్చ జరుగుతోంది. అయితే ఈ బాల్ టాంపరింగ్ వ్యవహారంపై తాజాగా తన్వీర్ అహ్మద్ స్పందించారు. ఈ ముగ్గురు పాకిస్తాన్ పరువు తీసారని.. ఇలాంటి వెధవలకు ఉరి శిక్ష వేయాలంటూ డిమాండ్ చేశారు తన్వీర్ అహ్మద్ ( Tanveer Ahmed ). లేకపోతే పాకిస్తాన్ పరువు మరింత దిగజారుతుందని వెల్లడించారు.
Also Read: MI vs KKR Toss Fixing: వివాదంగా టాస్..తెరపైకి ఫిక్సింగ్ ఆరోపణలు, KKRపై ముంబై విజయం
పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Pakistan Super League 2026 Tournament ) నేపథ్యంలో లాహోర్ ఖలందర్స్ జట్టుకు సంబంధించిన ప్లేయర్లు జమాన్, షాహీన్ షా, రవూఫ్ లు బాల్ టాంపరింగ్ వ్యవహారంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. అయితే దీనిపై పాకిస్తాన్ మాజీ క్రికెటర్ తన్వీర్ అహ్మద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ ముగ్గురు ప్లేయర్లను ఉరి తీసిన తప్పులేదని ఫైర్ అయ్యారు. ఇలాంటి ఆటగాళ్లు ఉంటే పాకిస్తాన్ పరువు మరింత దిగజారుతుందని మండిపడ్డారు. పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్ చాలా గొప్పదని.. ఇలాంటి టోర్నమెంట్ లో ఇలా బాల్ టాంపరింగ్ చేయడం పెద్ద తప్పిదమని మండిపడ్డారు. సీనియర్ క్రికెటర్లు అయి ఉండి కూడా ఇలాంటి పనులకు పాల్పడడం దుర్మార్గమన్నారు.
పాకిస్తాన్ క్రికెట్ ప్రతిష్టను అంతర్జాతీయంగా మసకబారించే విధంగా వ్యవహరించారని ఎమోషనల్ అయ్యారు తన్వీర్ అహ్మద్. ఇక ఈ ముగ్గురు క్రికెటర్లపై ఐసీసీ వెంటనే నిషేధం విధించాలని డిమాండ్ చేశారు. అయితే ఇప్పటి వరకు ఈ సంఘటనపై ఐసీసీ ఎలాంటి ప్రకటన చేయలేదు. అటు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మాత్రం విచారణ ప్రారంభించింది. మరో 48 గంటల్లో ఈ బాల్ టాంపరింగ్ వ్యవహారంపై చర్యలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫఖర్ జమాన్ పైన మూడు సంవత్సరాలు బ్యాన్ విధించే అవకాశాలు ఉన్నట్లు చెబుతున్నారు.
కరాచీ కింగ్స్ మ్యాచ్ సందర్భంగా లాహోర్ ఖలందర్స్ ప్లేయర్లు బాల్ టాంపరింగ్ కు పాల్పడ్డారు. ఛేజింగ్ సమయంలో కరాచీ జట్టుకు 14 పరుగులు అవసరం అయ్యాయి. ఈ క్రమంలోనే బాల్ టాంపరింగ్ కు ( Ball Tampering) పాల్పడ్డాడు జమాన్. దీంతో 5 పరుగులు పెనాల్టీ వేశారు అంపైర్లు. ఇక టార్గెట్ తగ్గడంతో కరాచీ ( Karachi) విజయం సాధించింది.
Fakhar Zaman is staring at a ban for at least one match after he was charged with changing the condition of the ball in yesterday's PSL match 🧐
After Shahid Afridi's ball tempering vs Australia, now Fakhar Zaman is the latest in Pakistan cricket 😵💫pic.twitter.com/OJV4OOEagX
— Ajay Jadeja (@AjayJadeja171) March 30, 2026