E-Paper
Advertisement

Tanveer Ahmed: వైభ‌వ్ 15 కాదు, 25 ఏళ్లు ఉంటాడు.. లేక‌పోతే క‌ట్ డ్రాయ‌ర్ పైన తిరుగుతా

Tanveer Ahmed: వైభ‌వ్ 15 కాదు, 25 ఏళ్లు ఉంటాడు.. లేక‌పోతే క‌ట్ డ్రాయ‌ర్ పైన తిరుగుతా
Advertisement

Tanveer Ahmed :  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament
) నేపథ్యంలో మళ్లీ 15 ఏళ్ల వైభవ్ సూర్య వంశీ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నారు. గత సీజన్ లో ఓ సెంచరీ అలాగే పలు అర్థ సెంచరీలు నమోదు చేసిన వైభవ్ సూర్యవంశీ ( Vaibhav Suryavanshi).. 2026 ఐపిఎల్ టోర్నమెంట్ లో మొదటి మ్యాచ్ లోనే అర్థ సెంచరీతో రెచ్చిపోయాడు. అయితే ఈ నేపథ్యంలో వైభవ్ సూర్య వంశీ ( Vaibhav Suryavanshi age ) వయస్సు పైన పాకిస్తాన్ మాజీ క్రికెటర్ త‌న్వీర్ అహ్మ‌ద్ ( Tanveer Ahmed ) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వైభవ సూర్యవంశీ 15 ఏళ్ల కుర్రాడు కాదని.. అతనికి 25 సంవత్సరాలు ఉంటుందని బాంబు పేల్చారు. ఇది నిజం కాకపోతే, తాను కట్ డ్రాయర్ పైన పాకిస్తాన్ వీధుల్లో తిరుగుతానని శప‌థం చేశారు. దీంతో త‌న్వీర్ అహ్మ‌ద్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం వేస్తున్నాయి.

Also Read: Shahid Afridi: నాకు ఛాన్స్ ఇవ్వండి..టీమిండియాకు 100 మంది బుమ్రాల‌ను త‌యారు చేస్తా

వైభవ్ 15 సంవత్సరాలు కాదు.. 25 ఏళ్లు త‌న్వీర్ అహ్మ‌ద్ సంచలనం

Advertisement

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంటులో మొదటి మ్యాచ్ లోని అర్థ సెంచరీ నమోదు చేసుకున్న వైభవ్ సూర్యవంశీ.. మొన్న మార్చి 27వ తేదీన 14 సంవత్సరాలు పూర్తి చేసుకుని 15వ ఏటలోకి అడుగుపెట్టాడు. 2011లో వైభవ్ సూర్య వంశీ జన్మించాడు. ఈ లెక్క ప్రకారం 15 సంవత్సరాలు అతనికి కొనసాగుతున్నాయి. అయితే ఐపిఎల్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మధ్య మొన్న మార్చి 30వ తేదీన మ్యాచ్ జరిగింది. అయితే ఈ సందర్భంగా వైభవ్ సూర్య వంశీ అర్థ సెంచరీ చేసి సోషల్ మీడియాను షేక్ చేశాడు. కేవలం 17 బంతులు ఎదుర్కొన్న వైభవ్ సూర్యవంశీ 52 పరుగులు సాధించాడు. కేవలం 15 బంతుల్లోనే అర్థ సెంచరీ నమోదు చేసి చరిత్ర సృష్టించాడు.

అయితే ఐపీఎల్ లో ( IPL 2026) రాణిస్తున్న ఈ 15 ఏళ్లకు కుర్రాడు వైభ‌వ్ సూర్య వంశీని ఉద్దేశించి పాకిస్తాన్ మాజీ క్రికెటర్ తన్వీర్ అహ్మ ద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వయస్సు విషయంలో వైభవ్ సూర్య వంశీ నాటకాలు వాడుతున్నాడని ఆరోపణలు చేశారు. అతని వయసు 15 సంవత్సరాలు అస్సలు కాదని.. 24 నుంచి 25 సంవత్సరాలు ఉంటాడని తన్వీర్ అహ్మద్ వెల్లడించారు. అయితే అతని వయసుపైన విచారణ చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ దీనిపైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బోన్ లేదా డీఎన్ఏ టెస్ట్ నిర్వహించి వైభవ్ సూర్య వంశీ బండారం బయటపెట్టాలని కోరారు. అంతేకాదు వైభవ్ సూర్య వంశీ 25 సంవత్సరాలు లేకపోతే, తాను క‌ట్ డ్రాయర్ పైన తిరుగుతానని చాలెంజ్ విసిరారు త‌న్వీర్ అహ్మ‌ద్. అదే స‌మ‌యంలో వైభ‌వ్ సూర్య వంశీ బ్యాటింగ్ పై ప్ర‌శంస‌లు కురిపించాడు తన్వీర్‌. ఏజ్ ప‌క్క‌కు పెడితే, వైభ‌వ్ మ‌రో స‌చిన్ అవుతాడ‌న్నారు.

Advertisement

Also Read: PSL 2026: PSLను అత‌లాకుత‌లం చేసిన తుఫాన్‌..గాల్లో ఎగిరిప‌డ్డ గ్రౌండ్ మెన్లు

 

 

https://www.facebook.com/photo.php?fbid=887864717567355&set=a.143646471989187&type=3

 

 

Related News

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

గంభీర్ వెనక కోహ్లీ కుప్పిగంతులు..అస‌భ్యక‌రంగా చేతులు చూపిస్తూ డ్యాన్స్

లార్ట్స్ మైదానంలో ఈ గంట కొట్ట‌డానికి కార‌ణం ఏంటి? దీని వెనుక ఉన్న‌ర‌హ‌స్యం

Big Stories

Advertisement
×