E-Paper
Advertisement

ఏప్రిల్ నెల రాశి ఫలితాలు : ఆ రాశి వారికి ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది

ఏప్రిల్ నెల రాశి ఫలితాలు : ఆ రాశి వారికి ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది
Advertisement

Monthly Horoscope:

ప్రముఖ జ్యోతిర్వాస్తు, వేద పండితులు, దేవీ ఉపాసకులు  ‘బ్రహ్మశ్రీ  రామడుగు శ్రీకాంత్‌ ఆచార్య’ గారిచే గ్రహాల సంచారం ప్రకారం అంచనా వేసిన ఏప్రిల్ రాశి ఫలితాలను ఇప్పుడు తెలుసుకుందాం.

మేష రాశి:  

ఈ నెల ఈ రాశి వారికి ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఉద్యోగమున ఉన్నతికి చేసే ప్రయత్నాలు కొంత వరకు అనుకూలిస్తాయి. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. అన్ని రంగాల వారికి అనుకూల వాతావరణం ఉంటుంది. స్థిరస్తి కొనుగోలు ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. మాసం మధ్య నుండి జీవిత భాగస్వామితో అకారణ వివాదాలు కలుగుతాయి. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. అనవసర వస్తువులపై ధన వ్యయం చేస్తారు.

వృషభ రాశి:

Advertisement

ఈ నెలలో ఈ రాశి వారికి కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి యోగ దాయకంగా ఉంటుంది. చేపట్టిన పనులు త్వరితగతిన పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాలందు విశేషమైన లాభాలు అందుకుంటారు. ఆర్థికంగా గతం కంటే కొంత పరిస్థితులు మెరుగవుతాయి. ఉద్యోగమున అధికారుల ఆదరణ పెరుగుతుంది. సంతానం విద్యా విషయాలలో శుభవార్తలు అందుతాయి. మాసం చివరన కొన్ని పనులు వాయిదా పడతాయి.

మిథున రాశి:  

ఈ నెలలో ఈ రాశి వారికి పని ఒత్తిడి పెరిగి సమయానికి నిద్ర హారాలు ఉండవు. దూర ప్రయాణాలలో వాహన ప్రమాదం సూచనలు ఉన్నవి. కుటుంబ సభ్యులతో చీటికిమాటికి మాటపట్టింపులు కలుగుతాయి. శారీరక మానసిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. సోదరులతో స్థిరాస్తుల విషయంలో వివాదాలు తప్పవు. ఉద్యోగస్తులు చేయని పనికి నిందలు పడవలసి వస్తుంది. నిరుద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహ పరుస్తాయి. రావలసిన సొమ్ము సకాలంలో చేతికి అందక ఇబ్బందులు ఎదుర్కొంటారు.

కర్కాటక రాశి:

Advertisement

ఈ నెలలో  ఈ రాశి వారికి వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. నూతన వ్యాపారాలకు పెట్టుబడులు పెట్టకపోవటం మంచిది. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు చేయవలసి వస్తుంది. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. ఉద్యోగస్తులు అధికారుల అప్రమత్తంగా వ్యవహరించాలి. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకుని ఇబ్బందులు ఎదుర్కొంటారు. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం వలన కొంత మానసిక ప్రశాంతత కలుగుతుంది.

సింహరాశి:

ఈ నెలలో ఈ రాశి వారికి వృథా ప్రయాణాల వల్ల శారీరక శ్రమ పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో ఆ కారణంగా మాటపట్టింపులు కలుగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో జాప్యం కలిగినప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి కొంత గందరగోళంగా ఉంటుంది. రుణదాతల నుండి ఒత్తిడి అధికమౌతుంది. వృధా ఖర్చులు కూడా చేదాటుతాయి. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. సంతాన ఆరోగ్య విషయాల్లో కొంత శ్రద్ధ వహించాలి

కన్యారాశి :

ఈ నెలలో ఈ రాశి వారికి చిన్నపాటి అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. కుటుంబ సభ్యులతో అకారణంగా వివాదాలు కలుగుతాయి. దూరప్రయాణాలు వీలైనంత వాయిదా వేయడం మంచిది. వృత్తి ఉద్యోగాలలో ఇతరుల వలన ఊహించని సమస్యలు ఎదురవుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు అతి కష్టం మీద పూర్తి చేయగలుగుతారు. మానసిక ఆందోళనలు పెరుగుతాయి. గృహ నిర్మాణ పనులు మందకొడిగా సాగుతాయి. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు అంతగా కలిసి రావు.

ALSO READ: ఈ రాశుల్లో జన్మించిన వారు ఎప్పటికైనా కోట్లు సంపాదిస్తారట

 

తులారాశి:

ఈ నెలలో ఈ రాశి వారికి అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేసి ఉత్సాహంగా ముందుకు సాగుతారు. అన్ని రంగాల వారికి గతంకంటే పరిస్థితులు మెరుగుపడతాయి. వృత్తి వ్యాపారాల విస్తరణ చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. అవసరానికి ఏదో విధంగా ధన సహాయం అందుతుంది. పాత రుణాలు కొంత వరకు తీర్చగలుగుతారు. దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలు ఒక్కసారిగా పరిష్కారమవుతాయి.

వృశ్చికరాశి:

ఈ నెలలో ఈ రాశి వారికి దూరపు బంధువుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలకు లోటుండదు. అన్ని రంగాల వారికి అనుకూల వాతావరణం ఉంటుంది. వృత్తి వ్యాపారాలు విశేషంగా లాభిస్తాయి. ఆదాయం గతం కంటే మెరుగు పడుతుంది. నూతన వ్యాపార ప్రారంభానికి శ్రీకారం చుడతారు. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగస్తులకు అధికారుల అండదండలతో పదోన్నతులు పెరుగుతాయి. నిరుద్యోగుల కష్టం ఫలించి నూతన అవకాశాలు లభిస్తాయి.

ధనస్సు రాశి:

ఈ నెలలో ఈ రాశి వారు అవసరానికి చేతిలో ధన నిలవలేక నూతన రుణాలు చేయవలసి వస్తుంది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు కొంత బాధిస్తాయి. చేపట్టిన పనులు అధిక కష్టంతో అల్ప ఫలితాన్ని పొందుతారు. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఇంట బయట మీ మాటకు విలువ తగ్గుతుంది. నిరుద్యోగ ప్రయత్నాలు అంతగా కలిసి రావు. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు వలన తగిన విశ్రాంతి ఉండదు. గృహ నిర్మాణ పనులు మందకొడిగా సాగుతాయి.

మకరరాశి:

ఈ నెలలో ఈ రాశి వారికి ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. నూతన ఋణప్రయత్నాలు కలసి రావు కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ధ వహించాలి. ఇంటా బయట గౌరవ మర్యాదలు తగ్గుతాయి. వాహన ప్రయాణ విషయంలో జాగ్రత్త అవసరం. ముఖ్యమైన వ్యవహారాలు మందగిస్తాయి. ఉద్యోగమున అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. సంతాన విద్యా ఉద్యోగ ప్రయత్నాలు కొంత నిరుత్సాహ పరుస్తాయి. మాసం చివర పరిస్థితులు కొంత అనుకూలిస్తాయి.

కుంభరాశి:

ఈ నెలలో ఈ రాశి వారికి చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. చిన్ననాటి మిత్రులతో అకారణ వివాదాలు కలుగుతాయి. అన్ని రంగాల వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. నేత్ర శిరో సంబంధిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. గృహ నిర్మాణ ప్రయత్నాలు వాయిదా పడతాయి. వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయం వల్ల నష్టాలు తప్పవు. మానసిక ఆందోళనలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో ఊహించని ఇబ్బందులు ఎదురవుతాయి. నిరుద్యోగులు మరికొంత కాలం వేచి చూడక తప్పదు.

మీనరాశి:

ఈ నెలలో ఈ రాశి వారికి మానసికంగా ప్రశాంతత లోపిస్తుంది ఇతరులతో అకారణ వివాదాలు కలుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి. అన్ని రంగాల వారికి ఇబ్బందులు తప్పవు. ఆదాయం అంతంత మాత్రంగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో వైద్యులు సంప్రదింపులు చేయవలసి వస్తుంది. వ్యాపార పరంగా నూతన పెట్టుబడులు పెట్టకపోవడం మంచిది. నిరుద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహ పరుస్తాయి. మాసం చివరన గృహమున వివాహాది శుభకార్యములు నిర్వహిస్తారు. 

ALSO READ: ఆ రాశి అమ్మాయిలతో జాగ్రత్త – లేదంటే ఇక అంతే

Related News

ఈ తేదీల్లో పుట్టినవారిపై శనిదేవుడి అనుగ్రహం.. జీవితంలో ఎన్నో కష్టాల తరువాతే వీరికి విజయం

న్యూమరాలజీ.. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయి అత్తగారింట్లో ఫేవరెట్ కోడలు

ఈ తేదీల్లో పుట్టినవారితో పెళ్లి జరిగితే అదృష్టం పట్టినట్లే.. మూల అంకం 3 వారికి బెస్ట్ లైఫ్ పార్ట్‌నర్ వీరే

ఈ తేదీల్లో పుట్టినవారిది డబుల్ మైండ్ సెట్.. పైకి నవ్వుతూ లోపల మరో ఆలోచన

ప్రేమ, నమ్మకం, అర్థం చేసుకునే మనస్తత్వం.. ఈ తేదీల్లో పుట్టిన వారు మూల అంకం 2కు సరైన జోడీ

టాయిలెట్‌లో ఫోన్ వాడుతున్నారా? చేతులారా దరిద్రాన్ని కొనితెచ్చుకోవడమే.. వాస్తు ఏం చెబుతోంది?

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే12: ఆ రాశి వారికి అకస్మిక ధనలాభం – వారు చేపట్టిన పనుల్లో విజయం

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే11: ఆ రాశి వారికి చేపట్టిన పనుల్లో విజయం – ఉద్యోగులకు శుభవార్తలు

Big Stories

Advertisement
×