E-Paper
Advertisement

Tanveer Ahemed: గిల్ బ్యాట్ల‌లో ర‌బ్బ‌ర్లు…అందుకే అవ‌లీలగా సిక్సులు, బౌండ‌రీలు కొడుతున్నాడు

Tanveer Ahemed: గిల్ బ్యాట్ల‌లో ర‌బ్బ‌ర్లు…అందుకే అవ‌లీలగా సిక్సులు, బౌండ‌రీలు కొడుతున్నాడు
Advertisement

Tanveer Ahmed: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంటులో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభమాన్ గిల్ అదిరిపోయే బ్యాటింగ్ తో రెచ్చిపోతున్నాడు. నిన్న కేకేఆర్ తో జరిగిన మ్యాచ్ సందర్భంగా అద్భుతంగా రాణించిన గిల్.. ఆరెంజ్ క్యాప్ కూడా సొంతం చేసుకున్నాడు. ఈ టోర్నమెంట్ మొత్తంలో నాలుగు మ్యాచ్ లలో 241 పరుగులు సాధించిన శుభమాన్ గిల్, ఆరెంజ్ క్యాప్ దక్కించుకోవడం గమనార్హం. అయితే ఆరెంజ్ క్యాప్ హోల్డర్ శుభమాన్ గిల్ పైన పాకిస్తాన్ మాజీ క్రికెటర్ తన్వీర్ అహ్మద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గిల్ బ్యాటింగ్ పై అనుమానాలు వ్యక్తం చేస్తూ సంచలన ఆరోపణలు చేశారు. గిల్ వాడే బ్యాట్ లో రబ్బర్లు ఉన్నాయని.. అందుకే అతడు భారీగా పరుగులు సాధిస్తున్నాడని వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు తన్వీర్ అహ్మద్. దీంతో త‌న్వీర్ అహ్మద్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి.

Also Read: SRH జ‌ట్టులో చీలిక‌.. తెలంగాణ‌, ఏపీ ఫ్యాన్స్ మ‌ధ్య కొత్త పంచాయితీ..త‌ల‌ప‌ట్టుకున్న కావ్య పాప‌

ఐపీఎల్ 2026 లో అదరగొడుతున్న శుభమాన్ గిల్

Advertisement

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభమాన్ గిల్ అదరగొడుతున్నాడు. నిన్న కేకేఆర్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ మధ్య బిగ్ ఫైట్ జరిగింది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా ఈ రెండు జట్లు తలపడ్డాయి. ఈ సందర్భంగా కేకేఆర్ జట్టు పైన ఐదు వికెట్ల తేడాతో విక్టరీ కొట్టింది గుజరాత్ టైటాన్స్. ఈ మ్యాచ్ లో కూడా 86 పరుగులతో శుభమాన్ గిల్ రాణించాడు. ఇందులో నాలుగు సిక్సర్లు, 8 బౌండరీలు ఉన్నాయి. 172 స్ట్రైక్ రేట్ తో రెచ్చిపోయాడు శుభమాన్ గిల్. దీంతో ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకున్నాడు గుజరాత్ కెప్టెన్ శుభమాన్ గిల్.
ఆడిన నాలుగు మ్యాచ్ ల‌లో మొత్తం 251 పరుగులు సాధించాడు. ఈ నాలుగు మ్యాచ్ ల‌లో ఓవరాల్ గా 62.75 యావేరేజ్ సాధించాడు. 86 పరుగులు హైయెస్ట్ స్కోర్. 154.93 స్ట్రైక్ రేట్ తో ఆదరగొట్టాడు. దీంతో ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకున్నాడు గిల్.

శుభమాన్ గిల్ బ్యాటలో రబ్బర్లు.. తన్వీర్ అహ్మ‌ద్ సంచలనం

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో గుజరాత్ కెప్టెన్ శుభమాన్ గిల్ ఆట తీరుపై పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ తన్వీర్ అహ్మద్ సంచలన ఆరోపణలు చేశారు. ఐపీఎల్ 2026 టోర్నమెంట్ సందర్భంగా శుభమాన్ గిల్ రబ్బర్లు ఉన్న బ్యాట్లు వాడుతున్నాడని ఆరోపణలు చేశాడు. బ్యాట్లలో రబ్బర్లు ఉన్న నేపథ్యంలో అవలీలగా పరుగులు సాధిస్తున్నాడని గిల్ పై ఫైర్ అయ్యాడు త‌న్వీర్ అహ్మ‌ద్. కేవలం టెస్టుల్లో అదరగొట్టే శుభమాన్ గిల్… ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ లో బాగా ఆడినప్పుడే తనకు డౌట్ వచ్చిందని తెలిపారు. శుభమాన్ గిల్ బ్యాట్ల‌లో రబ్బర్లు ఉన్న నేపథ్యంలోనే అవలీలగా పరుగులు సాధిస్తున్నాడని పేర్కొన్నాడు.

Advertisement

Also Read: IPL LED Stumps: ఐపీఎల్ లో వాడే LED వికెట్లు ఇంత ఖ‌రీదైన‌వా ? ఆ డ‌బ్బుల‌తో 4 SUV కార్లు కొన‌చ్చు

 

https://www.facebook.com/photo/?fbid=122221892174289704&set=a.122097672758289704

Related News

2027 వ‌ర‌ల్డ్ క‌ప్ పాకిస్తాన్ కు అందిస్తా..లేక‌పోతే త‌ల న‌రుక్కుంటా ?

డ‌బుల్ సెంచ‌రీ చేయ‌కుండా ద్రవిడ్ అడ్డుకున్నాడు..స‌చిన్ సంచ‌ల‌నం !

కావ్య పాప‌ పెళ్లికి పాకిస్తాన్ క్రికెట‌ర్లు…SRHను బ్యాన్ చేయాలంటూ మ‌ళ్లీ పోస్టులు ?

పుట్టినిల్లా ? మెట్టినిల్లా ? బక్కోడిని ఆడుకుంటున్న ఐపీఎల్ ఫ్యాన్స్

ఒరేయ్ ఇన్ని రోజులు ఎక్క‌డున్నావ్ రా? న‌మ‌న్ ధీర్ బ్యాటింగ్ చూసి బిత్త‌ర‌పోయిన గంభీర్‌

విండీస్, టీమిండియా మ్యాచ్ రద్దు… వ‌ర్షం ప‌డి బ‌తికిపోయారంటూ తన్వీర్ అహ్మద్ కామెంట్!

పాకిస్తాన్ జట్టులో ప్రకంపనలు..కోచ్ మైక్ హెసన్ కాలర్ పట్టుకున్న షాహీన్ అఫ్రిది

ముస్లిం క్రికెట‌ర్ల‌కు టీమిండియాలో ఛాన్స్ ఇవ్వ‌రు కానీ పాకిస్తాన్ వ‌చ్చేయ్ !

Big Stories

Advertisement
×