Team India: టీమిండియా కెప్టెన్ శుభమాన్ గిల్ ( Shubman Gill) ప్రియురాలు సారా టెండూల్కర్ ( Sara Tendulkar) సంచలన నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆమె సన్యాసం తీసుకున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు తెగ వైరల్ చేస్తున్నారు. కాశీకి వెళ్లి సన్యాసం పుచ్చుకుందని వీడియోలు కూడా బయట పెడుతున్నారు. సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సచిన్ కూతురు కావడంతో బాలీవుడ్ హీరోయిన్ కు ఉన్న రేంజ్, సారా టెండూల్కర్ కు వచ్చింది. అయితే ఆమె గత కొన్ని రోజులుగా టీమిండియా కెప్టెన్ గిల్ తో ప్రేమాయణం నడిపిస్తున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.
టీమిండియా కెప్టెన్ శుభమాన్ గిల్ (Shubman Gill ) అలాగే సార్ అటెండూల్కర్ ఇద్దరు ప్రేమలో ఉన్నట్లు దాదాపు 5 సంవత్సరాలుగా వార్తలు వస్తున్నాయి. కానీ ఇప్పటి వరకు ఈ ఇద్దరిలో ఏ ఒక్కరు కూడా దీని పై స్పందించలేదు. స్పందించడానికి ఇష్టపడలేదు. ఎన్ని రూమర్లు, ఎన్ని కథనాలు, ఎన్ని ట్రోలింగ్స్ వచ్చిన కూడా సారా టెండూల్కర్ తో పాటు గిల్ ఎక్కడ టెంట్ కాలేదు. తమ పని తాము చేసుకున్నారు తప్ప ప్రేమాయణం గురించి ఎక్కడ లీక్ చేయలేదు. వాస్తవంగా వీళ్ళిద్దరి మధ్య ప్రేమ ఉందో ? లేదో ? తెలియదు, పని ప్రచారం మాత్రం జోరుగా సాగుతోంది.
అయితే ఇలాంటి నేపథ్యంలో వారణాసిలోని కాశీ విశ్వనాథ ఆలయంలో (Kashi Vishwanath Temple Varanasi ) సారా టెండూల్కర్ ప్రత్యక్షమయ్యారు. ఈ సందర్భంగా సన్యాసి తరహాలో డ్రెస్ ధరించి, మాల కూడా వేసుకున్నారు. సన్యాసి తరహాలోనే తలకు విభూది పూసుకున్నారు. దీంతో ఆమె సన్యాసిలా మారిపోయిందని కొంత మంది ప్రచారం చేస్తున్నారు. కానీ ఇందులో వాస్తవం లేదని తెలుస్తోంది. సచిన్ టెండుల్కర్ సతీమణి అంజలి టెండూల్కర్ , వాళ్ల కూతురు సారా ఇద్దరూ కలిసి వారణాసిలోని కాశీ విశ్వనాథ టెంపుల్ కు వెళ్లారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. కానీ, సన్యాసం తీసుకుందనే ఎలాంటి సన్యాసం తీసుకోలేదని తెలుస్తోంది. కొంతమంది కావాలని సన్యాసం తీసుకుందని న్యూస్ వైరల్ చేస్తున్నారని సమాచారం అందుతోంది.
టీమిండియా వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న టెస్ట్ సిరీస్ నేపథ్యంలో మెడనొప్పి బారినపడ్డాడు గిల్. దీంతో మొదటి టెస్ట్ మధ్యలోనే తప్పుకున్నాడు. దాదాపు మూడు రోజులపాటు ICU లో చికిత్స పొందాడు. అయితే నిన్నటి రోజున ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయినట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలిసిన నేపథ్యంలో సారా టెండర్ కాస్త టెన్షన్ పడుతున్నారట. అందుకే కాశీలోని విశ్వనాథ ఆలయంకు వెళ్ళినట్టు మరికొంతమంది చెబుతున్నారు. అక్కడ పూజలు చేస్తే, గిల్ కోలుకుంటాడని సారా వెళ్లినట్లు ప్రచారం జోరు అందుకుంది.
VIDEO | Cricket great Sachin Tendulkar's wife Anjali Tendulkar, daughter Sara Tendulkar offer prayers at Kashi Vishwanath Temple in Varanasi.
(Source: Third Party)#SaraTendulkar pic.twitter.com/k7PgxHQwfg
— Press Trust of India (@PTI_News) November 17, 2025