E-Paper
Advertisement

OTT Movie : సౌండ్ వింటే రెచ్చిపోయే మిస్టీరియస్ జీవి… సీను సీనుకో ట్విస్ట్ ఉన్న బెస్ట్ సర్వైవల్ థ్రిల్లర్

OTT Movie : సౌండ్ వింటే రెచ్చిపోయే మిస్టీరియస్ జీవి… సీను సీనుకో ట్విస్ట్ ఉన్న బెస్ట్ సర్వైవల్ థ్రిల్లర్
Advertisement

OTT Movie : ఏలియన్లు ఎలా ఉంటాయో ఎవరికీ తెలీదు. కొన్ని వింత ఆకారాలు అప్పుడప్పుడూ వైరల్ అవుతున్నా, అవి నిజమా కాదా అనే అయోమయంలోనే ఉన్నారు. అయితే వీటికి రూపాలను మాత్రం సినిమాలలో ఎంచక్కా ఇచ్చేస్తున్నారు. వింత ఆకారాలతో మనుషులకు కొన్ని సహాయం చేస్తే, మరికొన్ని ప్రాణాలను తెస్తూ విధ్వంసం సృష్టిస్తుంటాయి. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా లో ఏలియన్స్ శబ్దం చేస్తే మనుషులను చంపుతుంటాయి. ఈ సినిమా చిల్లింగ్ థ్రిల్ తో బాక్స్ ఆఫీస్ హిట్ గా నిలిచింది. $17 మిలియన్ల బడ్జెట్ తో $260 మిలియన్లను కలెక్ట్ చేసింది. ఇప్పుడు ఓటీటీలో కూడా అందుబాటులో ఉంది. దీని పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే …

ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందంటే

‘ఎ క్వయట్ ప్లేస్: డే వన్’ (A Quiet Place : Day One) 2024లో విడుదలైన అమెరికన్ హారర్ సై ఫై సినిమా. ఇది మైఖేల్ సార్నాస్కీ డైరెక్షన్ లో వచ్చింది. ఇది “ఎ క్వయట్ ప్లేస్” సిరీస్‌లో మూడో సినిమా. మొదటి రెండు సినిమాలకు ప్రీక్వెల్. ఇది 2024న జూన్ 28న విడుదలైంది. 1 గంట 39 నిమిషాల నిమిషాల రన్‌ టైమ్ తో ఐయండిబిలో 6.3/10 రేటింగ్ పొందింది. ప్రస్తుతం ప్రైమ్ వీడియో, ఆపిల్ టీవీ, జీ 5లో అందుబాటులో ఉంది.

Advertisement

Read Also : అనుకోకుండా చంపి ఆన్లైన్ హీరోగా పాపులర్… ట్విస్టుల మీద ట్విస్టులు… క్రేజీ క్రైమ్ థ్రిల్లర్

కథలోకి వెళ్తే

సామిరా అనే క్యాన్సర్ రోగి, ఒక రోజు పర్యటన కోసం మాన్‌హట్టన్‌కు వెళుతుంది. నగరంలో సందడి వాతావరణం ఉండగా, అకస్మాత్తుగా శబ్దం చేస్తే చంపేసే వింత జీవులు భూమిపైకి వస్తాయి. నగరమంతా హాహాకారాలు, విధ్వంసం నెలకొంటుంది. ఒక్కొక్కరూ దారుణంగా చనిపోతుంటారు. శబ్దం చేయకుండా ఉండడం ఒక్కటే బ్రతికే మార్గం అని తెలుసుకున్న సామ్, ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఈ ప్రయాణంలో ఆమెకు ఎరిక్ అనే బ్రిటిష్ విద్యార్థి, ఆమె పెంపుడు పిల్లి ఫ్రోడో తోడవుతారు. నిశ్శబ్దంగా ఉన్న నగరంలో వారు పడే పాట్లు, ఎదుర్కొనే ప్రమాదాలు ఉత్కంఠభరితంగా ఉంటాయి. చివరకు, సురక్షిత ప్రాంతానికి చేరుకోవడానికి, ఆ వింత జీవుల దృష్టిని మరల్చడానికి సామ్ చాలా ప్రయత్నాలు చేస్తుంది. ఇక క్లైమాక్స్ లో ఆమె ఎరిక్, ఫ్రోడో లను కాపాడటానికి తన ప్రాణాలను త్యాగం చేస్తుంది. ఆమె త్యాగం వల్ల ఎరిక్, ఫ్రోడో పడవలో సురక్షితంగా మాన్‌హట్టన్ నుండి బయటపడతారు. ఈ కథ ఇలా ముగిసిపోతుంది.

Advertisement

 

Related News

This week OTT Releases : ఈ వారం ఓటీటీ లవర్స్ కు పండగే.. ఏకంగా 18 సినిమాలు స్ట్రీమింగ్..!

Weekend OTT Movies: వీకెండ్ సినిమాల సందడి.. వీటిని అస్సలు మిస్ అవ్వొద్దు..

రెండు రోజుల్లో నలుగురి మర్డర్… నిమిషానికో ట్విస్ట్ ఉన్న సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్

తల్లి టూర్లో, తండ్రికి చుక్కలు చూపించే పిల్లలు… పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

క్రేజీ సిరీస్ కు సినిమాతో ఎండ్ కార్డు… లాంగ్-డిస్టెన్స్ రిలేషన్‌షిప్లో ఉన్నవాళ్ళు డోంట్ మిస్

చెరువులో బాలుడి శవం… దేవుడికి ఆచారాల పేరుతో గుండె జారిపోయే పనులు

తండ్రి చావుకు కారణమైన వాళ్ళను వేటాడే ఖతర్నాక్ లేడీ… యాక్షన్ తో పిచ్చెక్కించే మూవీ

తండ్రికి మించిన తనయుడు… కానీ తలనొప్పే… మిస్ అవ్వకుండా చూడాల్సిన స్పోర్ట్స్ కామెడీ సిరీస్

Big Stories

Advertisement
×