Abhishek Sharma-Yuvraj Singh: టీమిండియా డేంజర్ ఆటగాడు అభిషేక్ శర్మ ( abhishek sharma ) పరువు తీశాడు యువరాజ్ సింగ్ ( yuvraj singh). అభిషేక్ శర్మ మెంటార్ గా ఉన్న యువరాజ్ సింగ్, చెప్పులు పంపించి అతని పరువు తీసే ప్రయత్నం చేశాడు. జింబాబ్వే పైన అద్భుతంగా తాను ఆడినట్లు సోషల్ మీడియా వేదికగా అభిషేక్ శర్మ పోస్ట్ పెట్టారు. అయితే క్రికెట్ అభిమానులు అందరూ, అభిషేక్ శర్మ పోస్టుకు సపోర్ట్ గా నిలుస్తూ రియాక్ట్ అయ్యారు. కానీ అభిషేక్ శర్మకు సంబంధించిన మెంటార్ యువరాజ్ సింగ్ మాత్రం డిఫరెంట్ గా రియాక్ట్ అయ్యారు. నువ్వు పీకింది చాలు లే అన్న రేంజ్ లో రియాక్షన్ ఇస్తూ చెప్పులు ( shoes) పంపించారు యువరాజు సింగ్. దీంతో ఈ పోస్ట్ వైరల్ గా మారింది. ఇది చూసిన అభిషేక్ శర్మ ఫ్యాన్స్ చాలా సీరియస్ అవుతున్నారు. తమ అభిమాన క్రికెటర్ అభిషేక్ శర్మకు చెప్పులు పంపించడం ఏంటని ఫైర్ అవుతున్నారు.
టీమిండియా స్టార్ క్రికెటర్ అభిషేక్ శర్మ మెంటార్ గా యువరాజ్ సింగ్ ఉన్న సంగతి తెలిసిందే. అతని చేతిలో పడిన తర్వాత అభిషేక్ శర్మ రాటుదేలిన ఆటగాడిగా మారిపోయాడు. భారీ సిక్సర్లు, బౌండరీలతో రెచ్చిపోతున్నాడు. ఈ నేపథ్యంలోనే టి20 స్పెషలిస్ట్ గా మారడమే కాకుండా నెంబర్ వన్ ఆటగాడిగా చరిత్ర పుటల్లోకి ఎక్కాడు అభిషేక్ శర్మ. ఈ నేపథ్యంలోనే టి20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ కోసం కూడా అభిషేక్ శర్మాను సెలెక్ట్ చేసింది బీసీసీఐ. అయితే వరల్డ్ కప్ ప్రారంభమైన తర్వాత వరుసగా మూడుసార్లు డకౌట్ అయిన అభిషేక్ శర్మ… చాలా విమర్శలను ఎదుర్కొన్నారు. ఇక నిన్న జింబాబ్వే తో జరిగిన మ్యాచ్ లో అర్థ సెంచరీ చేసి మళ్ళీ కదం తొక్కారు.
ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియా వేదికగా అభిషేక్ శర్మ ఓ పోస్ట్ పెట్టారు. తన డబ్బా తాను కొట్టుకునే ప్రయత్నం చేశారు. జింబాబ్వే పైన రాణించినందుకు తనకు సంతోషంగా ఉందని అభిమానులతో తన అభిప్రాయాలను పంచుకున్నారు అభిషేక్ శర్మ. ఈ నేపథ్యంలోనే, అభిషేక్ శర్మకు చెప్పులు పంపించాడు యువరాజ్ సింగ్. చెప్పు ఉన్న ఎమోజిని పెట్టి అభిషేక్ శర్మకు కౌంటర్ ఇచ్చాడు. నువ్వు ఓవర్ గా రియాక్ట్ అయింది చాలు.. ఆట మీద దృష్టి పెట్టు అంటూ కౌంటర్ ఇచ్చే ప్రయత్నంలో భాగంగా చెప్పులను పంపించాడు యువరాజ్ సింగ్. దీనికి సంబంధించిన పోస్ట్ వైరల్ గా మారింది. ఆ తర్వాత అభిషేక్ శర్మ అర్థ సెంచరీని మెచ్చుకుంటూ పోస్ట్ కూడా పెట్టారు యువరాజ్ సింగ్. దీంతో ఈ అంశం హాట్ టాపిక్ అయింది.
Also Read: Daisy Shah On Palash: పలాష్ ముచ్చల్ చాలా మంచోడు..స్మృతినే కిలాడీ లేడీ ?..బాలీవుడ్ నటి సంచలనం !
Just a typical mentor reaction 😅
Great knock from Abhishek Sharma… but Yuvraj Singh still wants more! 🇮🇳👀#YuvrajSingh #INDvZIM #T20WorldCup #Sportskeeda pic.twitter.com/JqTc5m07TE
— Sportskeeda (@Sportskeeda) February 27, 2026
Mentor Yuvraj Singh still seems unhappy with Abhishek Sharma👀 pic.twitter.com/KtCcbWwI29
— CricTracker (@Cricketracker) February 27, 2026