E-Paper
Advertisement

Whats App New Rules: నో సిమ్ నో వాట్సాప్.. మార్చి 1 నుంచి మారే రూల్స్ ఇవే

Whats App New Rules: నో సిమ్ నో వాట్సాప్.. మార్చి 1 నుంచి మారే రూల్స్ ఇవే
Advertisement

Whats App New Rules: మార్చి 1,2026 నుంచి వాట్సాప్, టెలిగ్రామ్ కొత్త రూల్స్ అమల్లోకి రానున్నాయి. మొబైల్‌లో యాక్టివ్ సిమ్ కార్డు ఉంటేనే వాట్సాప్, టెలిగ్రామ్ వంటి యాప్స్ పనిచేస్తాయి. డెస్క్‌టాప్ వాట్సాప్ 6 గంటలకే లాగౌట్ అవుతుంది. ఇకపై సిమ్ లేకపోతే వాట్సాప్ పనిచేయదు. మార్చి 1వ తేదీ నుంచి ఈ నిబంధన అమల్లోకి రానుంది. ఫిబ్రవరి 28 తర్వాత మొబైల్లో సిమ్ లేకుంటే వాట్సాప్ పనిచేయదని కేంద్రం ప్రకటించింది. అది కూడా యాక్టివ్ సిమ్ అయితే వాట్సాప్ యాక్టివ్ గా ఉంటుందని వెల్లిడించింది.

వాట్సాప్ వెబ్ 6 గంటల మాత్రమే

కంప్యూటర్ లో లాగిన్ అయ్యే వాట్సాప్ వెబ్ 6 గంటల తర్వాత ఆటోమేటిక్ గా లాగౌట్ అవుతుంది. వాట్సాప్, టెలిగ్రామ్, సిగ్నల్, స్నాప్ చాట్ వంటి యాప్ లు ఈ నిబంధన వర్తిస్తుంది. జాతీయ భద్రత, సైబర్ నేరాల నియంత్రణ కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం తెలిపింది. ఇకపై మెసేజింగ్ యాప్స్ వినియోగానికి సిమ్ తప్పనిసరి అని పేర్కొంది.

Advertisement

టెలికమ్యూనికేషన్స్ విభాగం జారీ చేసిన ఆదేశాల మేరకు, మొబైల్ లో యాక్టివ్ సిమ్ కార్డు ఉంటేనే మెసేజింగ్ యాప్ లు పనిచేస్తాయి. ప్రస్తుతం సిమ్ తీసివేసినప్పటికీ లింక్ చేసిన యాప్‌లు పనిచేస్తూనే ఉంటున్నాయి. ఈ నిబంధన ఫిబ్రవరి 28 తర్వాత మారనుంది. సైబర్ సెక్యూరిటీ, సైబర్ నేరాలను నిరోధించే చర్యల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఈ రూల్ తీసుకొచ్చింది.

యాక్టివ్ సిమ్ ఉంటేనే

కొత్త ఫ్రేమ్‌వర్క్ ప్రకారం, యాక్టివ్ సిమ్ ఉందో లేదో మెసేజింగ్ యాప్ లు నిరంతరం ధృవీకరించాల్సి ఉంటుంది. సిమ్ తీసివేసినా, మార్చినా లేదా ఇన్ యాక్టివ్ అయినా, మెసేజింగ్ యాప్ లు ఇకపై పనిచేయవు. వెబ్, డెస్క్‌టాప్ యాక్సెస్ కోసం ప్రతి ఆరు గంటలకు మళ్లీ లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. QR కోడ్‌లు లేదా OTP ధృవీకరణ అవసరం. ఆఫీస్ సిస్టమ్‌లు, హోమ్ ల్యాప్‌టాప్‌లతో సహా మల్లీ పర్సస్ పరికరాల్లో ఒకే ఖాతాపై ఆధారపడే వినియోగదారులకు ఈ నిబంధన కాస్త ఇబ్బందిగానే ఉంటుంది.

Advertisement

పెరుగుతున్న ఆన్‌లైన్ మోసాలను అరికట్టడానికి ఈ చర్యలు తీసుకుంటున్నట్లు డీవోటీ తెలిపింది. ఖాతాలను యాక్టివ్ సిమ్‌కు లింక్ చేయడం వల్ల.. ఆన్ లైన్ మోసాలను అధికారులు ట్రేస్ చేసేందుకు సహాయపడుతుందని పేర్కొంది. కమ్యూనికేషన్ ప్లాట్‌ఫామ్‌ల దుర్వినియోగాన్ని తగ్గించడం లక్ష్యంగా ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిపింది.

Also Read:  హైదరాబాద్ లో ఆకాశాన్ని తాకుతున్న ధరలు.. గజం భూమి లక్షల్లో..

నిపుణులు ఆందోళన

మెసేజింగ్ యాప్స్, డిజిటల్ హక్కుల పరిశీలకులు దీని వల్ల ఎదురయ్యే సవాళ్ల గురించి ఆందోళన వ్యక్తం చేశారు. తరచుగా ప్రయాణించేవారు, సిమ్ కార్డులను మార్చుకునే కస్టమర్లు, పలు పరికరాల్లో అకౌంట్లను నిర్వహించే వ్యాపారులువ్యా పదేపదే అథెంటింకేషన్ సమస్యలు ఎదుర్కోవలసి రావచ్చు. సెక్యూరిటీని కఠినతరం చేయడమే దీని ప్రధాన ఉద్దేశం అయినప్పటికీ, కమ్యూనికేషన్ కోసం ఉపయోగించే మెసేజింగ్ యాప్ పై ఆధారపడే లక్షలాది మందికి ఈ నిబంధనలు అసౌకర్యాన్ని కలిగిస్తుందని విమర్శకులు వాదిస్తున్నారు.

Related News

SIP ఇన్వెస్టర్లకు కొత్త సమస్య.. తగ్గుతున్న రాబడి.. కారణాలు ఇవే

బంగారం ధరలో హెచ్చుతగ్గులు, ఇవాళ మార్కెట్లో రేటు మాటేంటి?

క్లౌడ్ కిచెన్ బిజినెస్‌లో రూ.4 లక్షలు నష్టపోయిన దంపతులు.. కట్ చేస్తే 10 నెలల్లో రూ.2 కోట్ల టర్నోవర్

బ్యాంక్ ఖాతాదారులకు షాక్.. ఎటీఎంపై ఛార్జీలు, ఆపై తగిన బ్యాలెన్స్ లేకున్నా ఎడాపెడా బాదుడు

ఇంజినీర్లకు షాక్.. ఎంబిఏ గ్రాడ్యుయేట్లకు భారీగా పెరుగుతున్న డిమాండ్.. కారణం ఇదే

పేకమేడలా కూలిన స్టాక్‌మార్కెట్‌.. నిమిషాల వ్యవధిలో 5 లక్షల కోట్ల పైగా సంపద ఆవిరి! జపాన్ నుంచి మొదలు..

గోల్డ్ మార్కెట్‌ని దెబ్బ కొట్టిన ట్రంప్.. కొనుగోళ్లదారుల్లో ఉత్సాహం, బంగారం-వెండి ధరలు పతనం

200 అప్లికేషన్లు, 15 ఇంటర్వ్యూలు ఫెయిల్.. చివరికి డిష్‌వాషింగ్ జాబ్.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగి వ్యధ

Big Stories

Advertisement
×