Ambati Rayudu: టీమిండియా తెలుగు క్రికెటర్ అంబటి రాయుడు ( Ambati Rayudu) అభిమానులకు అదిరిపోయే శుభవార్త అందింది. అంబటి రాయుడు తాజాగా తండ్రయ్యారు. ఆయన భార్య విద్య పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ నేపథ్యంలో తన కుటుంబంతో కలిసి దిగిన సెల్ఫీ ని సోషల్ మీడియాలో పంచుకున్నారు అంబటి రాయుడు. దీనికి సంబంధించిన ఫోటో ఇప్పుడు వైరల్ గా మారింది. ఇది చూసిన టీమిండియా అభిమానులు, అంబటి రాయుడుకు కంగ్రాట్స్ చెబుతున్నారు. ఇలాగే ముందుకు దూసుకు వెళ్ళు రాయుడు అంటూ కామెంట్స్ కూడా చేస్తున్నారు. దీంతో అంబటి రాయుడు తండ్రైన న్యూస్ వైరల్ గా మారింది.
టీమిండియా మాజీ క్రికెటర్, తెలుగు కుర్రాడు అంబటి రాయుడు ( Ambati Rayudu) మరోసారి తండ్రి అయ్యాడు. ఇప్పటికే ఆయనకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఇప్పుడు అంబటి రాయుడు దంపతులు పండంటి మగ బిడ్డకు తల్లిదండ్రులు అయ్యారు. ఆయన భార్య విద్య మగపిల్లాడికి జన్మనిచ్చింది. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో ఫొటోస్ షేర్ చేసి మరి, వెల్లడించాడు అంబటి రాయుడు.
కాగా తన కాలేజ్ ఫ్రెండ్ చెన్నుపల్లి విద్యను అంబటి రాయుడు ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరి వివాహం ఫిబ్రవరి 14వ తేదీ 2009 సంవత్సరంలో జరిగింది. డిగ్రీ కాలేజ్ సమయంలోనే ఈ ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే 2020లో ఈ జంటకు మొదట కుమార్తె జన్మించగా 2023లో రెండవ కుమార్తె జన్మించారు. ఇక లేటెస్ట్ గా పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చారు. దీంతో సోషల్ మీడియాలో అంబడి రాయుడుకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు ఫ్యాన్స్.
టీమిండియాతో పాటు రాజకీయాల్లో చాలా చురుకుగా అంబడి రాయుడు కొనసాగారు. మొదట టీమిండియాలో అద్భుతంగా రాణించిన అంబటి రాయుడు ( Ambati Rayudu), వరల్డ్ కప్ లో తనను సెలెక్ట్ చేయనందుకుగాను రిటైర్మెంట్ ఇచ్చేశారు. అటు ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ లో కూడా అద్భుతంగా రాణించారు అంబటి రాయుడు. ముంబై ఇండియన్స్ తో పాటు చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో ప్రాతినిధ్యం వహించిన అంబటి రాయుడు ఎన్నో రికార్డులు సృష్టించారు. ఇక ఇప్పుడు రిటైర్మెంట్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు రాయుడు.
2019 జులై మూడవ తేదీన అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు అంబటి రాయుడు. అటు ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో 2023 మే 29వ తేదీన రిటైర్మెంట్ ఇచ్చాడు. రిటైర్మెంట్ ఇచ్చిన తర్వాత రాజకీయాల్లోకి వచ్చి, రచ్చ రచ్చ చేశాడు. మొదట వైసీపీలో చేరిన అంబటి రాయుడు ఆ తర్వాత జనసేనలోకి వెళ్లారు. ఇప్పుడు ఏ పార్టీలో లేకుండా కామెంట్రీ చెప్పుకుంటున్నాడు.
Also Read: Ravichandran Ashwin: టీ20 వరల్డ్ కప్ 2026 కంటే సీరియల్స్ చూడటం బెటర్..టీమిండియా ఆడటం దండగే