NTRNeel Glimpse: యంగ్ టైగర్ ఎన్టీఆర్, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో రాబోతున్న మోస్ట్ అవేటెడ్ పాన్-ఇండియా మూవీ ‘NTRNeel’ కి సంబంధించిన ‘ఫస్ట్ గ్లింప్స్’ అప్‌డేట్ కోసం నందమూరి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా దీనికి సంబంధించి అప్డేట్ ఇచ్చారు మూవీ టీం.. ఈ సినిమాకు సంబంధించి రిలీజ్ డేట్ అండ్ టైమ్ ను అప్డేట్ చేశారు. ఇది చూసిన ఎన్టీఆర్ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. ఎప్పటి నుంచో ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ ఈ వార్త విన్న తర్వాత సంబరాలు చేసుకుంటున్నారు.
Read also-సెన్సార్ పూర్తి చేసుకున్న రామ్ చరణ్ ‘పెద్ది’.. ఈ డిటైల్స్ చూస్తే ఫ్యాన్స్‌కు పూనకాలే..
అయతే ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్ ను మే 19 మంగళవారం అర్ధ రాత్రి 23:52 గంటలకు అంటే సరిగ్గా మే 20న ఎన్టీఆర్ పుట్టినరోజుకు కొన్ని నిమిషాల ముందే ఈ గ్లింప్స్ ల్యాండ్ కాబోతోంది. యూట్యూబ్, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో అధికారికంగా విడుదల చేయనున్నారు మూవీ టీం. అంతే కాకుండా.. ఎంపిక చేసిన కొన్ని ప్రధాన థియేటర్లలో కూడా అభిమానుల కోలాహలం మధ్య ఈ గ్లింప్స్‌ను స్క్రీన్ చేయబోతున్నారు.
Read also-‘పెద్ది’ ట్రైలర్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న చరణ్ ఫ్యాన్స్.. దానికి ఫుల్ క్లారిటీ ఇదే..
సాధారణంగా వచ్చే చిన్న టీజర్లలా కాకుండా, ఈ గ్లింప్స్ ఏకంగా 3 నిమిషాలకు పైగా ఉండబోతున్నట్లు ఇండస్ట్రీ టాక్. ప్రశాంత్ నీల్ సృష్టించిన కొత్త ప్రపంచాన్ని ఆడియన్స్‌కు పరిచయం చేయడానికి ఇంత నిడివి ప్లాన్ చేశారట. ఈ గ్లింప్స్ ద్వారానే సినిమా అధికారిక టైటిల్‌ను (బలమైన ప్రచారం జరుగుతున్నట్లు ‘డ్రాగన్’ లేదా మరో పవర్‌ఫుల్ టైటిల్) ప్రకటించే అవకాశం ఉంది. ఈ గ్లింప్స్ లాంచ్ కోసం ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ టీమ్ ముంబైలో నేషనల్ మీడియాతో కలిసి ఒక గ్రాండ్ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ జూన్ 11, 2027న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. మే 19 రాత్రి 11:52 గంటలకి “నేషన్‌వైడ్ డిస్ట్రక్షన్ ప్రొటోకాల్” పేరుతో ప్రశాంత్ నీల్ మార్క్ ఎలివేషన్స్‌తో రాబోతున్న ఈ గ్లింప్స్ కోసం కౌంట్‌డౌన్ మొదలైపోయింది. దీనిని చూసిన ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు.
20.5937° N, 78.9629° E
A nationwide destruction protocol begins 🔥
T-MINUS 08 ⚡
May 19 • 23:52 IST#NTRNeel First Glimpse strikes in selected theatres & digitally 🔥
— #NTRNeel (@NTRNeelFilm) May 18, 2026