PSL 2026: పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Pakistan Super League 2026 Tournament) తుది దశకు వచ్చేసింది. ప్రస్తుతం ప్లే ఆఫ్స్ నడుస్తున్నాయి. ఇప్పటికే ఈ టోర్నమెంట్ లో ఎలిమినేటర్ వన్ మ్యాచ్ ఫినిష్ అయింది. మే ఒకటో తేదీన అంటే రేపు ఎలిమినేటర్ 2 మ్యాచ్ జరగనుంది. మే మూడవ తేదీన లాహోర్ లోని గడాఫీ స్టేడియం ( Gaddafi Stadium, Lahore) వేదికగా ఫైనల్ మ్యాచ్ ఉంటుంది. అయితే ఇలాంటి నేపథ్యంలో గడాఫీ స్టేడియం వేదికగా నిన్న లైట్ షో ప్రదర్శించింది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ( Pakistan Cricket Board). అయితే ఈ లైట్ షో పైన సోషల్ మీడియా వేదికగా ట్రోలింగ్ జరుగుతోంది.
పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Pakistan Super League 2026 Tournament) నేపథ్యంలో ఎలిమినేటర్ 1 మ్యాచ్ నిన్న ముల్తాన్ సుల్తాన్స్ వర్సెస్ హైదరాబాద్ కింగ్స్ మెన్ ( Multan Sultans vs Hyderabad Kingsmen, Eliminator 1) జట్ల మధ్య భయంకరమైన ఫైట్ జరిగింది. అయితే ఈ మ్యాచ్ కంటే ముందు లైట్ షో నిర్వహించింది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు. అయితే దీనిపైన ట్రోలింగ్ జరుగుతోంది. ట్రోలింగ్ జరగడానికి ప్రత్యేక కారణం కూడా ఉంది. లైట్ షో పేరుతో… స్టేడియంలో ఉన్న ఫ్లడ్ లైట్స్ బటన్స్ ఆన్, ఆఫ్ చేశారట సిబ్బంది. దాంతో స్టేడియంలో ఒకసారి లైట్లు ఆగిపోవడం.. ఆ తర్వాత వెలగడం జరిగింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అయిన నేపథ్యంలో ట్రోలింగ్ చేస్తున్నారు. లైట్ షో అని చెప్పి బటన్స్ ఆఫ్.. అండ్ ఆన్ చేయడం ఏంటని దారుణంగా సెటైర్లు పేల్చుతున్నారు. ఇదెక్కడి వ్యవహారం అంటూ మండిపడుతున్నారు. స్టేడియంలో ఆఫ్ కరెంట్ వచ్చిందంటూ ఆడుకుంటున్నారు. లైట్ షో పేరుతో మోసం చేస్తోన్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు… ఐపీఎల్ ముందు దేనికి సరిపోదంటూ ట్రోల్స్ చేస్తున్నారు.
పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్ 2026 ఉత్కంఠ భరితంగా సాగుతున్న నేపథ్యంలో అదే స్థాయిలో ట్రోలింగ్ ఎదుర్కొంటుంది. ఈ టోర్నమెంటులో రిటైర్మెంట్ ఇచ్చిన ఆటగాళ్లు… ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ లో అన్ సోల్డ్ ప్లేయర్లు, ఫిట్నెస్ లేని దద్దమ్మలు ఆడుతుంటారని సోషల్ మీడియాలో ఆడుకుంటున్న సంగతి తెలిసిందే. లేటెస్ట్ గా నడవలేని స్థితిలో ఉన్న ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ ను కూడా బరిలోకి దింపింది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు. ఇది ఒక్కటే కాదు స్టేడియంలో సిగరెట్లు తాగడం… బాల్ టాంపరింగ్ చేయడం లాంటివి కూడా జరిగాయి. ఇలాంటి టోర్నమెంట్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ కు పోటీ ఇవ్వలేదని అంటున్నారు. ఐపీఎల్ కాలిగోటికి కూడా పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్ సరిపోదని సెటైరికల్ పోస్టులు కూడా పెడుతున్నారు ఇండియన్స్.
😂 PAKISTAN BEING PAKISTAN 😂
– Turning lights on and off is a kind of light show in PSL 😆
– Pakistan Cricket Board using flood lights for light show and still they compare poor PSL with IPL 😅
– A must watch video pic.twitter.com/BIqVx1Lv5g
— Ajay Jadeja (@AjayJadeja171) April 30, 2026